redsand
-
'ఎర్ర' స్మగ్లింగ్‌లో పోలీసుల పాత్ర: డీజీపీ
కర్నూలు: త్వరలో కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వెంకటరాముడు తెలిపారు. శుక్రవారం ఆయన కర్నూలు నగరంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో బ్రౌన్ షుగర్‌పై పూర్తి విచారణ జరుపుతామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. నిందితులతో చేతులు కలిపిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని డీజీపీ రాముడు ఈ సందర్భంగా తెలియజేశారు. -
13 మంది తమిళ కూలీల అరెస్ట్
-
13 మంది తమిళ కూలీల అరెస్ట్
పోరుమామిళ్ల (వైఎస్సార్‌జిల్లా): అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 13 మంది తమిళ కూలీలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల అటవీ పరిధిలోని ఇటుకులపాడు గ్రామ సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు దుంగలను తరలిస్తున్న తమిళ కూలీలు ఎదురు పడటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక కూలీ పరారుకాగా.. 13 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 14 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారూ రూ.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
రూ.1.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
రేణిగుంట (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఎర్రచందనం దొంగలు చెలరేగిపోయారు. అడ్డమొచ్చిన అటవీ సిబ్బంది, పోలీసులపై రాళ్ల వర్షం కురిపించి పరారయ్యారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి తరువాత (సోమవారం ఉదయం)2 గంటల సమయంలో చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో జరిగింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన 220 మంది కూలీలు ఎర్రచందనం దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది వారిపై దాడి చేశారు. పోలీసుల సహాయంతో అటవీ సిబ్బంది దాడి చేయడంతో కూలీలు వీరిపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో కూలీలు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అటవీ సిబ్బంది 180 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.