redsanders
-
ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
తిరుపతి: ఎర్రచందనం, శ్రీ గంధం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. శేషాచలం అడవుల్లో ముగ్గురు తమిళ స్మగ్లర్లను అరెస్టు చేశామని, వారి నుంచి రూ. 80 లక్షల విలువ చేసే 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఏపీ రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ఫోర్సు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. అలాగే రాగిమానుకుంట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న గౌస్ బాషా, శివ అనే స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు, వారి నుంచి మూడు ఎర్ర చందనం, ఏడు శ్రీగంధపు దుంగలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రెండు ఘటనల్లో పోలీసులకు చిక్కకుండా 20 మంది స్మగ్లర్లు తప్పించుకున్నారని, వారికోసం కూంబింగ్ కొనసాగుతోందని ఆయన చెప్పారు -
ఇద్దరు ‘ఎర్ర’ దొంగల అరెస్ట్
రూ.40 వేల నగదు, 4 ఎర్రచందనం దుంగల స్వాధీనం కావలిరూరల్ : ఎర్ర చందనం దుంగలు తరలిస్తున్న లారీని పట్టుకుని ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసినట్లు కావలి రూరల్ ఎస్సై జి.పుల్లారావు తెలిపారు. జాతీయ రహదారిపై గౌరవరం టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా ఓ లారీ పోలీసులను గమనించి వెనక్కి మళ్లీంచి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అనుమానించిన సిబ్బంది లారీని నిలిపి తనిఖీ చేశారు. ఖాళీ కూరగాయల ట్రేల మధ్యలో 4 ఎర్రచందనం దుంగలు ఉండటంతో మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ యజమాని ఇమ్రాన్మేవ్, లారీలో ఉన్న పొదలకూరుకు చెందిన వేమిరెడ్డి సురేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఈ మార్గంలో తనిఖీలు ఉండవని, ఉదయగిరి నుంచి కావలి మీదుగా నెల్లూరుకు వెళ్తున్నట్లు చెప్పారు. గతంలో కూడా వీరిపై ఎర్రచందనం కేసులున్నట్లు తేలిందన్నారు. ఎర్రచందనం తరలింపులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో విచారిస్తున్నామన్నారు. -
12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వెంకటగిరి : మండలంలోని సీసీ కండ్రిగ దళితవాడ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కారులో అక్రమంగా తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కారు సహా రూ.4 లక్షలు ఉంటుందని అంచనా. వెంకటగిరి సబ్ డీఎఫ్ఓ రవీంద్రారెడ్డి కథనం మేరకు.. సీసీకండ్రిగ సమీపంలో ఎర్రచందనం అక్రమంగా రవాణా అవుతున్నట్లు తమకు సమాచారం అందడంతో నిఘా ఉంచామన్నారు. ఆదివారం తెల్లవారు జామున కారు అనుమానాస్పదంగా సీసీకండ్రిగ చెరువు వద్ద నుంచి తెలుగుగంగ కట్ట మీదుగా వస్తుండంతో వెంబడించామని తెలిపారు. దీంతో సీసీకండ్రిగ సమీపంలోని గుండ్ల సముద్రం కాలనీ వద్ద కారును వదిలి స్మగ్లర్లు పరారయ్యారు. కారు లోపల 12 ఎర్రచందనం దుంగలు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడుల్లో ఫారెస్ట్ రేంజర్ జి వెంకటేశ్వర్లు, పీఆర్వో వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్, డక్కిలి డీఆర్వో డివి రమణయ్య, ఎఫ్బీఓ చంద్రశేఖర్, మస్తాన్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.