‘అమృత హస్తం, మార్పు’ పనితీరు భేష్
నర్సాపూర్‌రూరల్, న్యూస్‌లైన్: గర్భిణి, బాలింత, శిశుమరణాల తగ్గింపు కోసం ప్రవేశ పెట్టిన మార్పు, అమృతహస్తం పథకాల పని తీరు భేష్‌గా ఉందని వరల్డ్ బ్యాంక్, విదేశీ బృందం సభ్యులు కితాబునిచ్చారు. గురువారం నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో వరల్డ్ బ్యాంక్ బృందం సభ్యులతోపాటు లూయిస్ దేశానికి చెందిన 5 మంది సీనియర్ ప్రభుత్వ అధికారుల బృందం సభ్యులు మార్పు, అమృతహస్తం పథకాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా కొనసాగుతున్న అమృత హస్తం పథకం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సర్పంచ్ భరత్‌గౌడ్ అధ్యక్షతన నిర్విహించిన మార్పు గ్రామస్థాయి సమావేశంలో వారు పాల్గొని మార్పు పథకంలో పనిచేస్తున్న అధికారులతోపాటు గర్భిణి, బాలింతలతో చర్చించారు. అమృత హస్తం, మార్పు పథకాల పని తీరు తెలుసున్న వరల్డ్ బ్యాంక్, విదేశీ బృందం సభ్యులు అశికోయిలీ కతురియ, సంగీత, ఖాంప్లో సిహకంగ్, ఖాసేంగ్ ఫిలావోంగ్, సెంగ్ప్రాసేవ్ వాంతనౌవోంగ్, చాన్లావ్ లుఆంగ్లత్, సోవంఖమ్ పోమ్మసెంగ్, ఫెట్దర చంతల మాట్లాడుతూ ఈ పథకాలను తమ దేశాల్లో కూడా ప్రవేశ పెట్టించెందుకు కృషి చేస్తామన్నారు. ఈపథకాలపై విదేశీయులతోపాటు మనదేశంలోని ఆయా రాష్ట్రాల అధికారులకు అహగాహన కల్పించేందకు మెదక్ జిల్లాకు తీసుకు రానున్నట్లు తెలిపారు.
అనంతరం రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్యో కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్పు రాష్ట్ర కోఆర్డినేటర్ సరళ రాజ్యలక్ష్మి, ఆర్జెడి విజయలక్ష్మి, జిల్లా వైద్యాఆరోగ్య శాఖ అధికారి పద్మ, డీఆర్డీఓ ప్రాజెక్ట్ అధికారి రాజెశ్వర్రెడ్డి, ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి శైలజ, సీడీపీఓ కనకదుర్గ, ఎంపీడీఓ రమాదేవి, పీహెచ్సీ వైద్యురాలు జ్యోతి, సర్పంచ్ భరత్‌గౌడ్, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ బాబూరావు, ఏపీఎం సత్యనారాయణ మాజీ ఆత్మకమిటీ చెర్మన్ ఆంజనేయులుగౌడ్. అశోక్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాస్పత్రిని సందర్శించిన బృందం
సంగారెడ్డి అర్బన్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని పోషక పునరావస కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు, ప్రపంచ బ్యాంకు బృందం, లావోస్ దేశం మెటర్నల్ చైల్డ్ హెల్త్ సెంటర్ ప్రతినిధులు గురువారం సందర్శించారు. వైద్యం అందిస్తున్న తీరును పరిశీలించి డాక్టర్ల ద్వారా వివరాలను తెలుసుకున్నారు. ఎన్ఆర్సీ సెంటర్ పనితీరును స్టడీ చేయడానికి వచ్చినట్లు ఆ సంస్థ డెరైక్టర్ కాంపియో సీయాకాంగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లావోస్ దేశ మెటర్నల్ చైల్డ్ హెల్త్ సెంటర్ డిప్యుటీ డెరైక్టర్లు ఖామ్సెంగ్ ఫిల్వాంగ్, వరల్డ్ బ్యాంక్ ఇండియా అధికారులు అశికోయిల్ ఖథారియా, మోహినోక్, రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ జాయింట్ డెరైక్టర్ సరళ రాజ్యలక్ష్మి, ఎన్ఆర్హెచ్ఎం డీపీఎంఓ జగన్నాథ్‌రెడ్డి, ఎన్ఆర్సీ వైద్యులు డాక్టర్ రహీం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.