వైఎస్సార్ జిల్లాలో ఎర్రచందనం డంప్ స్వాధీనం
వైఎస్ఆర్జిల్లా: ఎర్రచందనం అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. అక్రమ రవాణా చేసేందుకు వీలుగా ఎర్రచందనం డంప్‌లను స్మగ్లర్లు దాచిపెడుతున్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అటవీశాఖ అధికారులపై స్మగ్లర్లు దాడులుకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను అరికట్టడానికి అటవీశాఖ ఎప్పటికప్పుడూ తమ చర్యలను ముమ్మరం చేస్తోంది.
తాజాగా వైఎస్ఆర్జిల్లాలోని చిట్వేల్ సుద్దకాలువ వద్ద స్మగ్లర్లు దాచిన ఎర్రచందనం డంప్‌ను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఎర్రచందనం డంప్ విలువ దాదాపు 1.10 లక్షల విలువ ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.