మధుకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం
- అంగీకరించిన ప్రభుత్వం
హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా మంథనిలో తీవ్ర కలకలం రేపిన మధుకర్ హత్య కేసుకు సంబంధించి మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. గాంధీ లేదా ఉస్మానియా ఫారెనిసిక్ నిపుణుల తో రీపోస్టుమార్టం నిర్వహించాలని మధుకర్ తల్లి లక్ష్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా స్పెషల్ జీపీ ఈ మేరకు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో రీ పోస్టుమార్టం చేయిస్తామని తెలిపింది. అయితే, జిల్లా జడ్జి ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేయాలని లక్ష్మి విజ్ఞప్తి చేయగా ప్రభుత్వ అనుమతి కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను సాయంత్రానికి న్యాయస్థానం వాయిదా వేసింది.