refuses to marry
-
భర్త నుంచి విడాకులు.. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
ఆకివీడు(పశ్చిమ గోదావరి): భర్త నుంచి కోర్టులో విడాకులు తీసుకుని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోమని కోరగా, అతను నిరాకరించడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కుప్పనపూడి గ్రామానికి చెందిన పుష్పలత అదే గ్రామానికి చెందిన ఎడమటి సతీష్‌ను ప్రేమించింది. ఇది తెలియని పెద్దలు ఆమెను భీమవరం మెంటేవారితోటకు చెందిన గెడ్డం ఏసురాజుతో గత ఏడాది అక్టోబర్ 28న వివాహం చేశారు. చదవండి: ఎంతపని చేశావ్.. ఎంత భార్యపై కోపం ఉంటే మాత్రం.. ఆమె ప్రేమ విషయం భర్త తెలుసుకుని కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అనంతరం సతీష్‌ను పెద్దలు కలిసి పుష్పలతను పెళ్లి చేసుకోవాలని కోరగా, అతను నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన పుష్పలత ఈ నెల 3వ తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆకివీడులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. సోదరుడు మారంపూడి నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ భూషణం చెప్పారు. -
నన్నే మోసం చేస్తావా.. ప్రియుడిని చితక్కొట్టిన యువతి.. చివరకు
కల్లూరు(కర్నూలు జిల్లా): ఆయన పొలం యాజమాని. ఆ పొలంలోనే ఓ యువతి వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. ఇరువురు ఇష్టపడ్డారు. ఏడాది పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన యువకుడు మొహం చాటేశాడు. దీంతో నన్నే మోసం చేస్తావా అంటూ యువతి బంధువుల ఎదుటే ప్రియుడికి బడితపూజ చేసింది. వివరాలు.. కల్లూరు మండలం చిన్నటేకూరుకు చెందిన శేఖర్, పెద్దటేకూరు గ్రామానికి చెందిన మునీ మధ్య ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరగా కుటుంబసభ్యులు వద్దంటున్నారని శేఖర్ బదులిచ్చాడు. చదవండి: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి ఎందుకు నాన్న.. సీన్ కట్ చేస్తే.. యువతి వినకపోవడంతో పెద్దలందరూ పోలీసు స్టేషన్లో పంచాయితీ పెట్టారు. సదరు యువతి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. నాకు కేసు వద్దు అతనితో పెళ్లి జరిపించాలని యువతి కోరగా శేఖర్ ససేమిరా అన్నాడు. ఇదిలాఉండగా ఇటీవల యువతి ప్రియుడికి ఫోన్ చేసి పిలింపించుకుని తెలంగాణలోని బంధువుల ఊరికి తీసుకెళింది. ఆ ఊరిలో దేవాలయం ముందు పెద్దల సమక్షంలోనే తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ నిరాకరించిన ప్రియుడిని కర్రతో చితక బాదింది. ఈ ఘటన అక్కడున్న వారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇదిలాఉండగా సదరు యువతి ప్రేమ విషయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేసి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై ఉలిందకొండ పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. -
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ...
బంజారాహిల్స్ (హైదరాబాద్) : తన మనోభావాలు, ఇష్టాలను పట్టించుకోకుండా నచ్చని వ్యక్తితో తనకు పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తండ్రి, సోదరుడిపై ఓ యువతి బంజారాహిల్స్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.10లో నివసించే రెహ్మా రీమా(24) ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. తండ్రి, సోదరుడు కలసి ఇటీవలే ఆమెకు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. 35 సంవత్సరాల వయసున్న వ్యక్తితో పెళ్లి కుదర్చడమే కాకుండా, ఆ వ్యక్తిని కనీసం తనకు చూపించలేదని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. నిశ్చయించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ వాపోయింది. పెళ్లి తర్వాత తాను ఉద్యోగం చేయాలనుకుంటున్నానని, అందుకు తన తండ్రితో పాటు, వాళ్లు నిశ్చయించిన వ్యక్తి కూడా అంగీకరించడం లేదని ఆమె పేర్కొంది. తనను హౌస్ అరెస్ట్ చేశారని, స్నేహితులతో కూడా మాట్లాడనివ్వడం లేదని ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు బాధితురాలు తండ్రి, సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 341, 506ల కింద కేసు నమోదు చేశారు. -
అక్కా,బావతో కలిసి ప్రియుడి ఇంటి ముందు దీక్ష
వరంగల్(వెంకటాపూర్): ఓ యువతిని గర్భవతి చేసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడో ప్రబుద్ధుడు. వరంగల్ జిల్లావెంకటాపూర్ మండలం నల్లగుంటకు చెందిన గువ్వ శరత్, నర్సింహులుపేట మండలానికి చెందిన సలుగు కృష్ణవేణి(24) కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. కృష్ణవేణి నగరంలోని విప్రో కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది. శరత్, కృష్ణవేణికి మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. తన అన్న పెళ్లి కాకుండా తాను పెళ్లి చేసుకోవడం బాగుండదని శరత్ 5 నెలల క్రితం కృష్ణవేణికి అబార్షన్ చేయించాడు. తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి నీకు వేరే వాళ్లతో సంబంధాలున్నాయని శరత్ పెళ్లి కుదరదన్నాడు. దీంతో కృష్ణవేణి తన అక్కా బావతో కలిసి ప్రియుడి ఇంటి ముందు శనివారం ఉదయం బైఠాయించారు. కృష్ణవేణి తనకు న్యాయం జరిగేవరకు అక్కడ నుంచి కదలనని భీష్మించుకుని కూర్చొంది. పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడుతున్నారు.