బంజారాహిల్స్ (హైదరాబాద్) : తన మనోభావాలు, ఇష్టాలను పట్టించుకోకుండా నచ్చని వ్యక్తితో తనకు పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తండ్రి, సోదరుడిపై ఓ యువతి బంజారాహిల్స్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.10లో నివసించే రెహ్మా రీమా(24) ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. తండ్రి, సోదరుడు కలసి ఇటీవలే ఆమెకు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. 35 సంవత్సరాల వయసున్న వ్యక్తితో పెళ్లి కుదర్చడమే కాకుండా, ఆ వ్యక్తిని కనీసం తనకు చూపించలేదని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. నిశ్చయించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ వాపోయింది.
పెళ్లి తర్వాత తాను ఉద్యోగం చేయాలనుకుంటున్నానని, అందుకు తన తండ్రితో పాటు, వాళ్లు నిశ్చయించిన వ్యక్తి కూడా అంగీకరించడం లేదని ఆమె పేర్కొంది. తనను హౌస్ అరెస్ట్ చేశారని, స్నేహితులతో కూడా మాట్లాడనివ్వడం లేదని ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు బాధితురాలు తండ్రి, సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 341, 506ల కింద కేసు నమోదు చేశారు.
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ...
Published Tue, Jun 23 2015 6:45 PM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM
Advertisement
Advertisement