releasing today
-
అవార్డుల కంటే ప్రేక్షకుల గుర్తింపే ముఖ్యం
‘‘అవార్డుల కోసం సినిమాలు తీయాలనే ఆలోచన నాకు ఉండదు. ప్రేక్షకులు ఇచ్చే గుర్తింపు, ప్రేమ, అభిమానం, ఆప్యాయత చాలా ముఖ్యం. అవార్డులు వస్తే అదనపు బోనస్‌గా భావిస్తాను. ప్రేక్షకుల ప్రేమ, అభిమానంతో పాటు ‘జోకర్’ చిత్రానికి జాతీయ అవార్డు తీసుకోవడం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ‘జపాన్’ కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని దర్శకుడు రాజు మురుగన్ అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘జపాన్’. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా రాజు మురుగన్ మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి రావడానికి చార్లీ చాప్లిన్‌గారే స్ఫూర్తి. మూకీ చిత్రాలతోనే ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలను రేకెత్తించారు ఆయన. ఇక కార్తీగారిని దృష్టిలో పెట్టుకునే ‘జపాన్’ కథ రాశాను. కార్తీ, నిర్మాతలు ప్రభు, ప్రకాశ్‌గార్ల సహకారంతోనే ‘జపాన్’ చిత్రం ఇంత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఒక దర్శకుడిగా చిన్నా పెద్దా అని కాకుండా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
నేడు విడుదల కానున్న నీట్ ఫలితాలు
-
ఐఫోన్ 5ఎస్ నేడే విడుదల
ఐఫోన్‌తో మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న యాపిల్ సంస్థ మరో కొత్త మోడల్ ఫోన్‌ను నేడు విడుదల చేయనుంది. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌కు మార్కెట్ విస్తృతంగా పెరుగుతుండటంతో దాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. సిలికాన్ వ్యాలీలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కొత్త 5ఎస్ మోడల్ విడుదల కానుంది. ఇది చూడటానికి ఇంతకు ముందు మోడళ్లలాగే ఉండొచ్చు గానీ, సరికొత్త ప్రాసెసర్, కొత్త గ్రాఫిక్స్ సామర్థ్యాలతో మరింత వేగంగా పనిచేస్తుందని ఫారెస్టర్ విశ్లేషకుడు చార్లెస్ గోల్విన్ అంటున్నారు. అంతేకాదు, ఇంతకుముందు వాటి కంటే దీని ధర కూడా తక్కువట. చాలా రంగులలో కూడా ఇది రాబోతోంది. ముందుగా ఇది బంగారు రంగులో ఉండి, వేలిముద్రలను కూడా గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనివల్ల ఫోన్ పోయినా.. యజమాని తప్ప వేరెవ్వరూ దీన్ని ఉపయోగించలేరన్న మాట. ప్రధానంగా చైనాతో పాటు అభివృద్ధి చెందుతున్న ఇతర మార్కెట్లలో కొనుగోలు దారులు దీనిపై ఎక్కువ మోజు పడొచ్చని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్న ఫోన్లకు ఇటీవలి కాలంలో డిమాండ్ బాగా పెరుగుతోంది. బీజింగ్‌లో బుధవారం మరో కార్యక్రమం జరుగుతుందని కూడా యాపిల్ సంస్థ తెలిపింది.