Reliance Jio Infocomm Limited
-
జియోపై భారీగా ఖర్చు
ముంబై : టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించుకోబోతుందట. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో రిలయన్స్ జియోపై భారీగా మరో 23 బిలియన్ డాలర్లను(రూ.1,46,841 కోట్లు) వెచ్చించనున్నట్టు మూడీస్ అంచనావేస్తోంది. వైర్లెస్ సర్వీసులకు మించి తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటుందని తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఇప్పటికే 31 బిలియన్ డాలర్లను(రూ.1,97,916 కోట్లు) వెచ్చించింది. 21016లో మార్కెట్లోకి ప్రవేశించాక.. ఇతర టెల్కోలకు షాకిస్తూ పలు సంచలనాలనే సృష్టించింది. ప్రస్తుతం మార్కెట్లో దేశీయ నాలుగో టెలికాం ఆపరేటర్‌గా ఉంది. అయితే మూడీస్ అంచనాలపై కంపెనీ వెంటనే స్పందించలేదు. రేపు(శుక్రవారం) రిలయన్స్ ఇండస్ట్రీస్ తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేయబోతుంది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో పెట్టే మూలధన వ్యయాలు, ఫైబర్-టూ-హోమ్, డిజిటల్ టీవీ, మొబైల్ ఫోన్ సర్వీసులను మెరుగుపరిచే బిజినెస్‌లపై వెచ్చించనుందని సింగపూర్‌కు చెందిన మూడీస్ విశ్లేషకుడు వికాస్ హలాన్ చెప్పారు. మరికొంత నగదును నాలుగో తరానికి చెందిన ఫీచర్ ఫోన్లపై, సంబంధిత నెట్వర్క్ ఖర్చులపై పెట్టనుందని పేర్కొన్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు షాకిస్తూ.. జియో ప్రతి నెలా కొత్త సబ్స్క్రైబర్లను విపరీతంగా యాడ్ చేసుకుంటోంది. 2016లో టెలికాం మార్కెట్లోకి ప్రవేశించిన బిలీనియర్ ముఖేష్ అంబానీ, అన్ని కాల్ సర్వీసులు జీవిత కాలం ఉచితమంటూ తీవ్ర ధరల యుద్ధానికి తెరతీశారు. డేటా సర్వీసులను కూడా కొన్ని నెలల పాటు ఉచితంగా అందించారు. అంతేకాక గతేడాది జూలైలో తీసుకొచ్చిన ఫీచర్ ఫోన్‌తో మరోసారి టెల్కోలకు హడలెత్తించారు. -
గడువు ముగిసినా జియోనే వాడతాం!
ఉచిత ఆఫర్లతో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ రిలయన్స్ జియోకు, ఆ ఆఫర్ల గడువు ముగిసిన తర్వాత కూడా వినియోగదారులుంటారట. ఏప్రిల్ 1 నుంచి రిలయన్స్ జియో డేటా సర్వీసులపై ఛార్జ్ చేసినా భరించేందుకే తాము సిద్ధమేనని అంటున్నారు. దాదాపు 85 శాతం కస్టమర్లు ఫ్రీ ఆఫర్ గడువు ముగిసినప్పటికీ జియో వాడేందుకే సిద్ధమని పేర్కొంటున్నారు. బ్యాంకు ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అయితే వారిలో 67 శాతం మంది జియోను రెండో సిమ్గానే వాడతారని తేలింది. అదేవిధంగా 18 శాతం మొదటి సిమ్గా దీన్ని ఉపయోగిస్తారని సర్వే పేర్కొంది. అయితే అత్యంత సంతృప్తికరమైన కస్టమర్లు 97.7 శాతం మంది టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కే ఉన్నారని సర్వే తెలిపింది. కేవలం 17 శాతం భారతీ ఎయిర్టెల్ కస్టమర్లే జియోపై ఆసక్తి చూపుతున్నారని, అది కూడా క్వాలిటీ బాగుంటేనే దీన్ని మొదటిసిమ్గా వాడతామని చెబుతున్నట్టు తెలిసింది. రిలయన్స్ కమ్యూనికేషన్ లాంటి చిన్న టెల్కోలు పరిస్థితి అద్వానంగా ఉందని, జియోకు మరలిన ఈ కస్టమర్లు వాటిని సెకండరీ సిమ్గా వాడేందుకే మొగ్గుచూపుతున్నారని బ్యాంకు అమెరికా మెర్రిల్ లించ్ సర్వే పేర్కొంది. ఆశ్కర్యకరంగా 26 శాతం యూజర్లు జియోను మొదటి సిమ్గానే వాడుతున్నారు. ఇన్నిరోజులు జియో నెట్ స్పీడ్‌పై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఇతర టెల్కోలతో పోలిస్తే దీనికే 55 శాతం స్పీడ్ అధికమని తేలింది. జియో స్పీడ్ వేగంగా ఉన్నప్పటికీ, అస్థిరంగా ఉందని తేలింది. కేవలం 44 శాతం మందే జియో స్పీడ్ తక్కువగా ఉందని అభిప్రాయ పడ్డారు.