నూడుల్స్ తిని వాంతులు, విరోచనాలు?
కల్లూరు (రూరల్): రిలయన్స్ మార్కెట్లో కొనుగోలు చేసిన నూడుల్స్ తిని తన కుమారుడు అఫ్రోజ్ హుస్సేన్ (9) వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిపాలయ్యాడని తండ్రి పి.మహబూబ్‌బాష ఆరోపించారు. ఈ విషయాన్ని డాక్టర్ కూడా నిర్థారించారని చెప్పారు. అయితే రిలయన్స్ మార్కెట్ నిర్వాహకులు మాత్రం.. నూడుల్స్ తినడంతో వాంతులు, విరోచనాలు కాలేదని చెబుతున్నారు. బుధవారం బాధితుడు.. రిలయన్స్ మార్కెట్ ఎదుట నూడుల్స్‌ను పెట్టుకుని పట్టుకుని నిరసన తెలిపారు. నాల్గో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని.. ఫుడ్ ఇన్స్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని చెప్పి పంపించారు.