సిన్సియర్ సిటిజన్స్
శేషజీవితాన్ని హాయిగా గడపాలనుకునే వారికి.. పదవీ విరవుణ ఓ వరం ! బ్యాలెన్స్ లైఫ్‌ను ఎలా నెట్టుకురావాలో అని టెన్షన్ పడే వారికి రిటైర్మెంట్ ఒక శాపం ! కానీ ఈ పెద్దోళ్లకు మాత్రం రిటైర్మెంట్ ఒక బాధ్యత.. సమాజానికి సాయం చేసే తీరిక ఇలా దొరకడం ఓ అదృష్టంగా భావిస్తున్నారు. వీళ్ల కాలక్షేపం కూడా లోకాభిరామమే. కాకపోతే అది కాస్త సందడిగా, డిఫరెంట్‌గా, రెస్పాన్సిబుల్‌గా ఉంటుంది. సరదా సరదా ముచ్చట్లకు ఎంత టైం కేటాయిస్తారో.. సంఘానికీ అంతే సమయం ఇస్తారు. వానప్రస్థాశ్రమంలో రామా కృష్ణా అనుకోవాల్సిన ఈ పెద్దోళ్లు.. సమాజ హితం కోసం నడుం బిగించారు. జీవితానుభవాలే పెట్టుబడిగా.. ఈ సీనియర్లు తమ పెద్దరికాన్ని కాపాడుకుంటున్నారు.
- భువనేశ్వరి
ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్.. కమలానగర్ సీనియర్ సిటిజన్ క్లబ్లో పొద్దున పదింటికల్లా సందడి మొదలవుతుంది. ఒకరు మనవడ్ని స్కూల్లో దింపి, ఇంకొకరు మనవరాలిని కాలేజీలో దింపి.. ఒక్కొక్కరుగా ఈ క్లబ్లో వాలిపోతుంటారు. రాగానే న్యూస్‌పేపర్లు ముందేసుకుంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. సినివూల నుంచి రాజకీయూల వరకు.. సరదాగా ముచ్చటించుకుంటారు. ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్‌తో రీఫ్రెష్ అవుతారు. ఇలా నాలుగైదు గంటలు టైంపాస్ చేసి ఇళ్లకు చేరుకుంటారు. మళ్లీ సాయంత్రం.. కాలేజీలు మూసే సవుయూనికి రోడ్డెక్కుతారు. ఈ సమయంలో వీరికేం పని అనుకుంటున్నారా..? ఈ సీనియర్ల అసలు ట్రీట్మెంట్ ఇక్కడి నుంచే మొదలవుతుంది.
దారితప్పితే కౌన్సెలింగ్
ఈ సీనియుర్ సిటిజన్స్‌లో ఓ బృందం.. ఓ కాలేజీ ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన బస్టాప్‌లో కూర్చున్నారు. అటుగా వెళ్తున్న ఇద్దరమ్మాయిలను.. వెనుక నుంచి ఓ నలుగురు కుర్రాళ్లు ఫాలో అవుతున్నారు. అంతటితో ఆగకుండా ఏదో కామెంట్ చేశారు. అప్పటికే బస్టాప్‌లో ఉన్న ఈ పెద్దోళ్లకు సీన్ అర్థమైంది. వారిని ఆపి విషయుం ఏంటని ఆరా తీశారు. ఆ నలుగురిలో ఓ అబ్బాయి.. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అలాగా అంటూ వారిని సీనియుర్స్ క్లబ్‌కు తీసుకెళ్లారు. నిజమైన ప్రేమ గురించి.. ఒకరి తర్వాత ఒకరు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతే అమ్మాయిలు థ్యాంక్స్ చెబితే.. అబ్బాయిలు తలదించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘మా క్లబ్ స్థాపించి రెండేళ్లవుతుంది. ఎందరికో ఉపయోగపడే పనులు చేయగలిగాం’ అని అంటారు క్లబ్ ప్రెసిడెంట్ పెద్ది నర్సింహ.
తోటివారికి తోడుగా
ఓ నెల కిందట తమకు న్యాయం చేయాలంటూ ఓ వృద్ధ జంట ఈ క్లబ్ తలుపు తట్టారు. సవుస్యను సున్నితంగా పరిష్కరించి వారి కళ్లలో ఆనందం నింపారు ఈ క్లబ్ సభ్యులు. ‘మా కళ్లముందే అల్లంవెల్లుల్లి అమ్ముకుని కష్టపడి రెండు వందల గజాల ఇంటి స్థలం కొనుక్కున్నాడు. కొడుక్కి ఉద్యోగం వచ్చాక అతని పేరిట లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. కొడుకు పెళ్లయ్యూక.. ఈ ఇంటితో మీకు సంబంధం లేదంటూ ఆ కొడుకు కన్నవారిని బయుటకు నెట్టేశాడు. మా క్లబ్ సభ్యుల్లో ఓ నలుగురు ఆ కొడుకు, కోడలికి నచ్చజెప్పాం. నాలుగైదు కౌన్సెలింగ్‌ల తర్వాత దిగొచ్చారు. ఆ పెద్దవునుషులకు ఇంటి మీద ప్రత్యేకంగా ఓ రూమ్ కూడా కట్టిచ్చారు. ఆయునే కాదు.. ఇలాంటి సవుస్యలు ఎవరికున్నా వాటి పరిష్కారానికి మేమందరం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం..’ అని క్లబ్ సెక్రటరీ శత్రుఘ్నచారి వివరించారు.
మేం ముసలివాళ్లమేంటి..?
అరవై ఏళ్లు పైబడిన ఆ పెద్దోళ్లు.. కాలక్షేపంతో పాటు సవూజం గురించి ఆలోచిస్తున్నారు. ‘ఇన్నాళ్లు ఇల్లు, పిల్లలు, ఉద్యోగం అంటూ చుట్టూ ఉన్న సమాజం గురించి పట్టించుకోకుండానే గడిపేశాం. ఇప్పుడు మా పిల్లలకు మా ఆసరా అక్కర్లేదు, ఉద్యోగానికి ఓ నమస్కారం పెట్టేశాం. మాకున్న ఓపిక, తెలివితేటలు, అనుభవం.. తోటివారికి ఉపయోగపడాలన్నదే వూ ఉద్దేశం’ అని చెబుతారు ఆ సీనియుర్ సిటిజన్స్. ‘వయుసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో ఒక్కో పార్ట్ రిపేర్కొస్తుంటుంది. వచ్చిన రోగాలకు భయుపడి ఇంట్లో కూర్చుంటే జబ్బులు తగ్గుతాయూ? ఈ క్లబ్ మా మనసును సేదతీరుస్తుంది. ఇక్కడ అడుగు పెట్టగానే మేవుూ పిల్లలమైపోతాం. ఇండోర్ గేమ్స్‌తో అదరగొడతాం. నేను ముసలాడ్ని ఏంటి అనుకునేవారంతా అవుట్‌డోర్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. వూ వునవలు, వునవరాళ్లు కూడా మాతో జాయిన్ అవుతుంటారు’ అని క్లబ్ విశేషాలు పంచుకున్నారు జేజే రెడ్డి.
సమాజం కోసం
ఉదయం నుంచి ఎన్ని రకాల పనులు చేసినా.. అప్పుడప్పుడూ కాలేజీలకు వెళ్లి వురీ కౌన్సెలింగ్‌లు ఇస్తుంటారు. రోడ్లపై దవుు్మలాగుతున్న కాలేజీ కుర్రాళ్లకు క్లాసులిస్తారు, కౌన్సెలింగ్ చేస్తారు. సాయుంత్రం కాగానే అవ్మూరుులకు రక్షణగా రోడ్లపై గస్తీ కాస్తారు. ‘వూ పిల్లలు కాలేజీకి వెళ్లిన సవుయుంలో మేం చేయులేని పనులు ఇప్పుడు చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇవన్నీ చేస్తున్న టైంలో మేం హీరోలుగా ఫీలవుతాం’ అంటూ తమ హీరోయిజాన్ని చాటుకున్నారు చంద్రశేఖర్‌రావు. ఇప్పటివరకూ మేం బతికింది మాకోసం, మా కుటుంబం కోసం. ఇక నుంచి సవూజం కోసం బతకాలనుకుంటున్నాం అంటున్న ఈ సిన్సియుర్ సిటిజన్స్‌ను వునం కూడా అభినందిద్దాం.
మాతో పంచుకోండి
రిటైర్మెంట్ లైఫ్ సేవాభావంతో వెళ్లదీస్తున్న సీనియుర్ సిటిజన్స్ మీరైతే.. మీ జీవితం పదివుందిలో స్ఫూర్తి నింపాలి. చుట్టూ ఉన్న సవూజం కోసం మీరు పడే తపన వురికొందరికి వూర్గనిర్దేశం చేయూలనుకుంటున్నారా.. అరుుతే మీ సావూజిక బాధ్యతను ‘సిటీప్లస్’తో పంచుకోండి. మీరు చేస్తున్న కార్యక్రవూల వివరాలు sakshicityplus@gmail.com కు పంపండి.