renual
-
వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?
షోరూమ్‌లో కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే తప్పకుండా బీమా తీసుకోవాల్సిందే. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఇది అందరికీ వర్తిస్తుంది. సాధారణంగా లాంగ్‌టర్మ్ బీమా ఎంచుకుంటే ఐదేళ్లు బీమా వెసులుబాటు ఉంటుంది. అయితే బీమా అయిపోయాక చాలామంది దాన్ని తిరిగి రెన్యువల్ చేయడం లేదు. తొలి పాలసీ గడువు ముగిసిన తర్వాత భారత్‌లో కేవలం 19 శాతం టూ వీలర్ యజమానులు మాత్రమే బీమా రెన్యువల్ చేయిస్తున్నారు. వాహనం తీసుకున్న కొత్తలో అనివార్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీమా తీసుకోవాల్సిందే. కానీ బీమా సమయం పూర్తయిన తర్వాత కూడా వాహనదారులు ఇన్సూరెన్స్ చేయించాలి.మార్కెట్లో ఆప్లైన్తోపాటు ఆన్లైన్లో చాలా వెబ్పోర్టళ్ల ద్వారా టూవీలర్ బీమాను రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే బీమా తీసుకునేప్పుడు గమనించాల్సిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల బీమాలున్నాయి. మొదటిది థర్డ్ పార్టీ బీమా, రెండోది సమగ్ర బీమా. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు వాహనాన్ని నడిపే వ్యక్తికి కాకుండా ఇతరులకు ఏదైన జరిగితే పరిహారం ఇచ్చేలా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. శారీరక గాయాలు, ఆస్తి నష్టం, మరణం.. వంటివి ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. సొంత వాహనానికి జరిగే నష్టం మాత్రం దీనిలోకి రాదు.విస్తృత బీమావిస్తృత బీమా ప్రయోజనాలు దీని పరిధిలోకి వస్తాయి. ప్రమాదం, దొంగతనం, వరదలు, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, థర్డ్ పార్టీకి వాటిల్లిన నష్టాన్నీ ఇది భర్తీ చేస్తుంది.ఇవి తెలుసుకోండి..కవరేజీ: బీమా పాలసీ ఎంచుకునేప్పుడు మొత్తం ఎంత కవరేజీ అవసరమో తెలుసుకోవాలి. నిత్యం వాహనాన్ని ఉపయోగిస్తుంటే దాని విలువ ఆధారంగా కవరేజీని అంచనా వేయాలి. థర్డ్-పార్టీ చేయించినప్పటికీ.. సమగ్ర బీమా ఉండటమే మేలు. ఏదైనా అనుకోని ప్రమాదం వాటిల్లినా పూర్తి భద్రత ఉంటుంది.ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ: వాహనం తీవ్రంగా దెబ్బతిన్నా లేదా దొంగతనానికి గురైనా కంపెనీలు అత్యధికంగా చెల్లించే పరిహారమే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ (ఐడీవీ). వాహనాన్ని కొనుగోలు చేసి చాలా రోజులైతే క్రమంగా దాని విలువ తగ్గిపోతోంది. ఐడీవీ మార్కెట్లో వాహన ప్రస్తుత ధరను తెలియజేస్తుంది.బీమా కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియా(సీఎస్ఆర్) తెలుసుకోవాలి. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు.కొన్ని కంపెనీలు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం కొంత మొత్తంలో బీమా తీసుకునే సమయంలోనే వసూలు చేస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగి వాహనం రోడ్డుపై నిలిచిపోతే దాన్ని సర్వీస్ సెంటర్ వరకు భద్రంగా చేరవేసేందుకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్ఆన్ ఉపయోగపడుతుంది.బీమా రెన్యువల్ చేసిన ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే తర్వాత సంవత్సరం కట్టే ప్రీమియంకు కొన్ని కంపెనీలు రాయితీలు ఇస్తుంటాయి.ఇదీ చదవండి: ఉక్కు ఉత్పత్తుల దిగుమతి సుంకం పెంపుఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహన రిపేర్ల కోసం ఎలాంటి నగదు చెల్లించకుండా ఉండే పాలసీను ఎంచుకోవాలి. పాలసీ నెట్వర్క్ గ్యారేజీల్లో ఉచితంగానే రిపేర్ చేస్తారు. మీరు ఉంటున్న ప్రదేశాల్లో బీమా కంపెనీ నెట్వర్క్ గ్యారేజీలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. -
చైనా ఇది తగునా.. భారత్ విషయంలో మరో చెత్త నిర్ణయం!
బీజింగ్: డ్రాగన్ దేశం చైనా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాలో ఉన్న ఏకైక భారతీయ జర్నలిస్టు తమ దేశం నుంచి వెళ్లిపోవాలని తాజాగా చైనా ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం ఈ నెల చివరి వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. దీంతో చైనాలో ఇప్పటివరకు ఉన్న ఒకే ఒక్క భారత మీడియా ప్రతినిధి కూడా అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది. వివరాల ప్రకారం.. ప్రస్తుతం పీటీఐ రిపోర్టర్ ఒకరు చైనాలో ఉన్నారు. అయితే, భారత జర్నలిస్టుల వీసా రెన్యూవల్ చేసేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. చైనాలో ఈ ఏడాది మొదటివరకు పలు భారత మీడియా సంస్థల నుంచి నలుగురు జర్నలిస్టులు విధులు నిర్వహించారు. హిందుస్థాన్ టైమ్స్‌కు చెందిన ఓ రిపోర్టర్ గత ఆదివారమే చైనా వదిలి వచ్చేశారు. దూరదర్శన్, ద హిందూకు చెందిన రిపోర్టర్లను ఏప్రిల్‌లోనే పంపించేశారు. ఇక, మిగిలిన పీటీఐ రిపోర్టర్‌ను కూడా చైనా ఇంటికి పంపించనుంది. కాగా, దీనిపై ఇరుదేశాల విదేశాంగ శాఖల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు.. విదేశీ మీడియా ప్రతినిధులకు సంబంధించి చైనా కండీషన్స్ పెడుతోంది. అయితే, జర్నలిస్టుల వీసాకు సంబంధించి భారత ప్రభుత్వం గత నెలలో ఓ ప్రకటన చేసింది. భారత్‌లో పనిచేసే చైనా జర్నలిస్టులకు ఎటువంటి ఆటంకాలు లేనప్పటికీ.. చైనాలో భారత జర్నలిస్టులకు మాత్రం ఇలాంటి వెసులుబాటు లేదని పేర్కొంది. ఇక, లడాఖ్, సిక్కిం వద్ద జరిగిన ఘర్షణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దు విషయంలో కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులకు వీసా రెన్యువల్ చేయలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: విషాదం: మాజీ ప్రధాని కన్నుమూత -
లీజు రెన్యువల్ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: తన స్థలంలో ఉన్న ప్రభుత్వ డిస్పెన్సరీ లీజు పునరుద్ధరణ(రెన్యువల్)కు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇవ్వడానికి కార్మిక శాఖ నిరాకరించడంపై ప్రధాని మోదీ ఆంటీగా చెప్పుకుంటున్న 90 ఏళ్ల మహిళ అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించింది. గుజరాత్‌లోని వాద్నగర్లో దహిబెన్ నరోత్తమ్‌దాస్ మోదీ నివసిస్తున్నారు. ఆమెకు చెందిన స్థలంలో బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీ నడుస్తోంది. 1983లో రూ. 600 అద్దె ఇవ్వగా.. అనంతరం రూ.1,500కు పెంచారు. అప్పటి నుంచి అద్దె పెంచకపోవడంతో గత ఏడాది డిసెంబర్లో లీజు వివరాలు, పునరుద్ధరించక పోవడానికి కారణాలు చెప్పాలంటూ కార్మిక శాఖకు సమాచార హక్కు చట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. సరైన సమాధానం రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)కి దహిబెన్ ఫిర్యాదు చేశారు. గత వారం సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు వద్దకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. లీజును రెన్యువల్ చేయకపోవడంతో ఆ మొత్తంతో జీవించడం కష్టంగా మారిందని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఆమె మొదట దాఖలు చేసిన పిటిషన్‌కు సరైన సమాధానం రాకపోవడంతో.. 2018 జనవరి 9న ఆమె రెండో అప్పీలు దాఖలు చేశారు. అందులో తాను ప్రధాని మోదీ ఆంటీనని, తనకు న్యాయం జరగకపోతే ప్రధానికే ఈ విషయం తెలియజేస్తానని పేర్కొన్నారు. ప్రధాని మోదీతో బంధుత్వం గురించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆమె అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ ఎందుకు సమాధానం ఇవ్వలేదని, ఆమె ఆర్టీఐ పిటిషన్‌ను విచారించిన అధికారులపై ఎందుకు జరిమానా విధించకూడదో తెలపాలని సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు ప్రశ్నించారు. -
క్రమబద్ధీకరణకు కొత్త రూపు
మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ అమలు 2014 జనవరి 1కి ముందున్న వాటికే 100 నుంచి 500 గజాల లోపు స్థలాలకే కొత్త నిబంధనలతో 388 జీఓ విడుదల జిల్లాలో 2 లక్షల మందికి ప్రయోజనం ఏలూరు (మెట్రో): సొంతంగా కట్టుకున్న ఇల్లు, క్రమం తప్పకుండా పన్ను చెల్తిస్తున్నట్లు ధృవీకరణ పత్రాలు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు తదితరాలతో కూడిన స్థలం ఉన్నా అది సొంతం అని చెప్పుకోలేని ఆశక్తత. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నా ఎటువంటి హక్కులు దాఖలు పడకపోగా అధికారులు కన్నెర్ర చేస్తే మరోమాటకు తావులేకుండా కట్టుబట్టలతో రోడ్డున పడాల్సిన దయనీయ స్థితి. తమదనుకున్న స్థలంతో ఎప్పుడు తెగదెంపులు చేసుకోవాల్సి వస్తుందో అన్న భయంతో వందల సంఖ్యలో కుటుంబాలు ప్రభుత్వ స్థలాల్లో కాలం వెళ్లదీస్తున్నాయి. ప్రస్తుతం ఆ భయాలకు చెక్ పడనుంది ఆక్రమణ స్థలాలు క్రమబద్ధీకరించే ప్రక్రియ మళ్లీ మొదలైంది. దీనిపై ప్రభుత్వం జారీ చేసిన 388 జీఓను అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలు చివరికి గ్రామాల్లోనూ ప్రభుత్వ స్థలాల్లో ఏళ్లతరబడి కాలం వెళ్లదీస్తున్న ప్రజల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో ఉన్న జీఓలను కాస్త మార్పు చేస్తూ నూతనంగా కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు నిర్దేశిత మొత్తాన్ని వసూలు చేయనున్నారు. ఇప్పటికే గతంలో నగరాల పరిధిలో క్రమబద్ధీకరణకు 118, 296 జీఓలు విడుదల చేసిన ప్రభుత్వం వాటిలో మార్పులు చేస్తూ 388 జీఓను విడుదల చేసింది. వీరికి ప్రయోజనం ః జీఓ 388 ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువున, ఎగువున ఉన్నవారికి ప్రయోజనకరమే. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో 2014 జనవరి ఒకటో తేదీ నాటికి ముందున్న వారందరికీ ఈ జీఓ వర్తిస్తుంది. 100 గజాల పైబడి, 500 గజాలలోపు ఉన్న స్థలాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆక్రమిత స్థలంలో ఖచ్చితంగా కట్టడం ఉండి తీరాల్సిందే. ఇలా చెల్లించాలి ః ఆక్రమణల పూర్తి వివరాలతో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాలి. ఇంటిపన్ను, రిజిస్టర్ డాక్యుమెంటు, విద్యుత్ బిల్లు, నీటి పన్ను బిల్లు వంటివి జతచేయాలి. ఆధార్‌కార్డు నకలు అందించాలి. క్రమబద్ధీకరణకు సంబంధిత దరఖాస్తు అర్హత సాధించిన తరువాత ఎంతమొత్తం చెల్లించాలనే విషయాన్ని ఓ నోటీసు ద్వారా అధికారులు తెలియజేస్తారు. నిర్ణయించిన మొత్తం సొమ్మును నాలుగు వాయిదాల్లో చెల్లించాలి. ఆరు నెలల గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ఖర్చులు సంబంధిత దరఖాస్తుదారుడే చెల్లించాలి. రిజిస్ట్రేషన్ పూర్తియిన రోజు నుంచి రెండేళ్ల తరువాత భూ బదలాయింపు హక్కులు వర్తిస్తాయి. పరిశీలన పక్కాః 250 గజాల లోపు స్థలాలను క్రమబద్ధీకరించేందుకు ఆర్డీఓ గానీ, సబ్ కలెక్టర్‌గానీ ఛైర్మన్‌గా కమిటీ వేశారు. ఆ కమిటీలో టౌన్‌ప్లానింగ్ అధికారి, ఎంపీడీఓ సభ్యులుగా ఉంటారు. సంబంధిత తహశీల్దార్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. 250 నుండి 500 గజాల వరకూ కలెక్టర్ ఛైర్మన్‌గా ఉండే కమిటీ పరిష్కరించనుంది. కలెక్టర్ ఛైర్మన్‌గా ఉండే కమిటీకి జాయింట్ కలెక్టర్ సభ్య కన్వీనర్‌గా ఉంటారు. మున్సిపల్ కమిషనర్ గానీ, జడ్పీ సీఈఓ గానీ సభ్యులుగా ఉంటారు. ఆర్డీఓ కమిటీ తిరస్కరిస్తే కలెక్టర్‌కు 30 రోజుల వ్యవధిలో అప్పీలు చేసుకోవచ్చు. కలెక్టర్ కమిటీ తిరస్కరిస్తే సీసీఎల్ఏకు 30 రోజుల వ్యవధిలో అప్పీలు చేసుకోవచ్చు. ఇవీ నిబంధనలు ః నగరం, పట్టణం, గ్రామీణ ప్రాంతాలకూ ఈ జీఓ వర్తిస్తుంది. జనవరి 1వ తేదీ 2014లోపు వెలసిన ఆక్రమణలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆక్రమిత స్థలంలో కట్టడం లేదా గుడిసె, లేదా ఏదో ఒకటి ఉండాలి. క్రమబద్ధీకరణకు ఖాళీ స్థలాలను లెక్కలోకి తీసుకోరు. భవిష్యత్ అవసరాల కోసం రిజర్వు చేసిన స్థలాలు, కాలువ గట్లు, నదీ తీర ప్రాంతాలు, రహదారుల విస్తరణ కోసం ఉద్దేశించిన స్థలాలు వంటి వాటిని క్రమబద్ధీకరణకు అనుమతించరు. దీనికి బీపీఎల్, ఏపీఎల్ రెండు వర్గాలూ అర్హులే. బీపీఎల్ కుటుంబాలైతే తెలుపు రేషన్‌కార్డు తప్పనిసరిగా జతచేయాలి. ఒక వేళ తెలుపురేషన్‌కార్డు లేకుంటే తహశీల్దార్ జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. కుటుంబానికి ఒకటి మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. యజమాని, అతని భార్యతోపాటుగా మైనర్ పిల్లలు, మైనర్ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లను కలిపి కుటుంబంగా పరిగణిస్తారు. క్రమబద్ధీకరణ ధరలు ఇలా ః ఆక్రమిత స్థలం విలువను 2013 మార్కెట్ ధర ఆధారంగా లెక్కిస్తారు. లెక్కించిన మొత్తంలో దారిద్య్ర రేఖకు ఎగువున ఉన్న కుటుంబాలకు 1100 గజాల వరకూ మార్కెట్ విలువలో 7.5శాతం చొప్పున వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు. 101250 గజాల వరకూ (ఏపీఎల్, బీపీఎల్ కుటుంబాలకు) మార్కెట్ విలువలో 15శాతం వసూలు చేస్తారు. 251500 గజాల వరకూ మార్కెట్ విలువలో 30శాతం వసూలు చేస్తారు.