Repallewada
-
మూణ్నెళ్ల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే
ఇల్లెందు: క్షణికావేశంలో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇద్దరిలో భర్త పరిస్థితి విషమంగా ఉంది.. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని నిజాంపేట పంచాయతీ రేపల్లెవాడకు చెందిన భూక్యా వేణు మూడు నెలల కిందట సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలలకే ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పురుగులమందు తాగేలా చేసింది. వేణు కలుపు నివారణకు కొట్టే మందు తాగగా సంధ్య విత్తనశుద్ధి చేసే మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వారిని ఇల్లెందు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఖమ్మానికి తరలించారు. వేణు పరిస్థితి విషయంగా ఉంది. వేణుకు తల్లి చీన్యా, సోదరుడు వీరన్న ఉండగా సంధ్యకు మాత్రం తల్లిదండ్రులు లేరు. రేపల్లెవాడలో తన పిన్ని ఇంటి వద్ద ఉండి బీఫార్మసీ వరకు చదువుకుంది. చదవండి: కలెక్టరేట్లో గన్మెన్గా భర్త.. రోడ్డుపై విగతజీవిగా భార్య చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
ప్రేమజంట ఆత్మహత్య
చండ్రుగొండ: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే మనస్తాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం రేపల్లెవాడలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. రేపల్లెవాడకు చెందిన ఇనుముల రాము (20), ఇరుప పుష్పలత (25) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గిరిజన తెగకు చెందిన పుష్పలత ఎమ్మెస్సీ బీఈడీ పూర్తిచేసి ప్రస్తుతం ఊట్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సీఆర్టీగా పనిచేస్తోంది. రాము ఆటో డ్రైవర్ కాగా, పాఠశాలకు రోజూ అతడి ఆటోలోనే వెళ్తున్న క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే వీరి పెళ్లికి ఇద్దరి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో సోమవారం సాయంత్రం ఇద్దరూ మద్దుకూరు అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం పశువుల కాపరులు వీరిని చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.