Replacement of teachers
-
విద్య ప్రాధాన్యతను ప్రభుత్వాలు గుర్తించడం లేదు
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్: ‘రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విద్య ప్రాధాన్యత అంశం కాకుండా పోరుుంది. విద్యపై పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన లేకపోవడం.. విద్యపై పెట్టే పెట్టుబడులు సామాన్యుల అభివృద్ధికి, మానవ వనరుల అభివృద్ధికి, దేశ ప్రగతికి తోడ్పడతాయనే విషయాన్ని పాలకులు గుర్తించకపోవడం, విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నాం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ, విద్యా శాఖామంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మానవ వనరుల అభివృద్ధి ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యపడుతుందని సీఎం కేసీఆర్ విశ్వసిస్తున్నారని, ఆ మేరకు తెలంగాణలో ప్రతి విద్యార్థి ప్రపంచంలో ఉన్న ఏ విద్యార్థితోనైనా పోటీపడేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. సోమవారం ఇక్కడ సనత్‌నగర్ సెరుుంట్ థెరిస్సా స్కూల్లో మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్ర స్థారుు ఇన్స్పైర్ ప్రదర్శన-2016 ప్రదర్శనను రాష్ట్ర హోం, కార్మిక శాఖమంత్రి నారుుని నర్సింహారెడ్డి, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి శ్రీనివాస్‌యాదవ్‌లతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ 4, 5 సంవత్సరాల్లో విద్యా రంగాన్ని పట్టాలు ఎక్కించి దేశంలోనే తెలంగాణను మార్గదర్శకంగా మారుస్తామన్నారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణరుుంచినట్లు వివరించారు. హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.75 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా టారుులెట్స్ నిర్మాణం, మంచినీటి వసతి, కరెంటు సరఫరా, ఆర్ఓ ప్లాంట్, ప్రహరీలు, వంటశాలలు వంటి మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా జూనియర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ కళాశాలలకు, యూనివర్సిటీలకు అనుమతులు మంజూరు చేశాయని, కానీ దురదృష్టవశాత్తూ వాటికి భూమి గానీ, నిధులు గానీ, నియామకాలు గానీ చేపట్టకుండా కేవలం కాగితాఛిల పైనే మంజూరు చేసిపోయాయన్నారు. వాటన్నింటిని తమ ప్రభుత్వం పటిష్టపరిచే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. అలాగే, కాంట్రాక్ట్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని, అరుుతే న్యాయపర అడ్డంకులు ఉండడం వల్ల ఆలస్యం అవుతుందన్నారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి 2017 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల భర్తీ పూర్తి చేయనున్నామన్నారు. పాఠశాల స్థారుు నుంచి ఇంజనీరింగ్ వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను నియంత్రించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే నవంబర్ 14 బాలల దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 1500 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. -
టీచర్ల భర్తీకి రెండు పేపర్ల విధానం!
♦ ఒక్కో పేపరుకు 150 మార్కులు ♦ క్లాస్ రూమ్ డెమాన్‌స్ట్రేషన్, ఇంటర్వ్యూకు 30 మార్కులు ♦ త్వరలో విధానాన్ని ఖరారు చేయనున్న సర్కారు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలో రెండు పేపర్ల విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) నేతృత్వంలో ఈ పరీక్షను నిర్వహించగా.. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణ బాధ్యతలను టీఎస్పీఎస్సీకి అప్పగించిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ పరిధిలోని టీచర్ పోస్టుల భర్తీ బాధ్యతలను కూడా కమిషన్‌కే అప్పగించింది. అయితే విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల్లో ఖాళీలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీక రణ తర్వాతే ఆ లెక్క తేలనుంది. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే (2016-17) ప్రారంభించాలనుకుంటున్న మైనారిటీ, ఎస్సీ గురుకులాల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అందులో ప్రిన్సిపల్‌తోపాటు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) విధానం ఉంది. ఈ నేపథ్యంలో వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన పరీక్ష విధానంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఆయా శాఖల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే స్థూలంగా రెండు పేపర్ల విధానం (ఒకటి సబ్జెక్టు పేపరు, మరొకటి జనరల్ అవేర్నెస్, ఎబిలిటీస్, జనరల్ ఇంగ్లిష్ పేపరు) ఉంటే బాగుంటుందన్న ఆలోచనలు చేస్తోంది. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున ఉండేలా కసరత్తు చేస్తోం ది. ఆలాగే తరగతి గది డెమాన్‌స్ట్రేషన్‌కు 30 మార్కులు ఉండేలా చర్యలు చేపడుతోంది. కొత్తగా ప్రారంభించే గురుకులాల్లో టీచర్ల భర్తీ విషయంలో డిస్క్రిప్టివ్ విధానం అమలు చేయాలా? ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష పేపర్లు ఉండాలా? అన్నది తేలాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో ఆబ్జెక్టివ్ విధానం లో త్వరగా పరీక్ష నిర్వహించి టీచర్లను ఇవ్వాలని ఒక శాఖ కోరుతుండగా, ఆబ్జెక్టివ్ విధానంలోనే పరీక్ష పేపరు ఉండాలని, క్లాస్ డెమాన్‌స్ట్రేషన్ కూడా కచ్చితంగా ఉండాలని మరో శాఖ అధికారులు కోరుతున్నారు. దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. ఈ రెండింటిలో ఏదో ఒక విధానం ఖరారైతే విద్యా శాఖ పరిధిలోని టీచర్ పోస్టుల భర్తీకి కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. టెట్ వెయిటేజీ ఎలా? రెండు పేపర్ల విధానం, తరగతి డెమాన్‌స్ట్రేషన్ పద్ధతి ఖరారైతే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వెయిటేజీ సంగతిని తేల్చాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉంది. వాస్తవానికి టెట్‌ను ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు (ఎలిమెంటరీ విద్య) బోధించే టీచర్లకే వర్తింపజేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) స్పష్టం చేసింది. కానీ రాష్ట్రంలో 9, 10 తరగతులు బోధించే స్కూల్ అసిస్టెంట్లకు కూడా టెట్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది. నిబంధనలకు ఇది విరుద్ధం కావడంతో టెట్ విషయంలో ఏం చేద్దామని యోచిస్తోంది. ఒకవేళ టెట్ వెయిటేజీని కొనసాగించినా, 330 మార్కుల రాత పరీక్షకు, క్లాస్రూమ్ డెమాన్‌స్ట్రేషన్ కమ్ ఇంటర్వ్యూకు మొత్తంగా 80 శాతం వెయిటేజీ ఇచ్చి, టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఇచ్చి నియామకాలు చేపట్టాలా? లేదా టెట్‌కు వెయిటేజీ పూర్తిగా తొలగించి, దాన్ని ఒక అర్హత పరీక్షగానే చూడాలా? అన్న అంశాలపైనా ఆలోచనలు చేస్తోంది. ఎన్ సీటీఈ మార్గదర్శకాల ప్రకారం టెట్ స్కోర్‌కు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నందునా వెయిటేజీ తొలగింపు సాధ్యమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పీజీటీ పోస్టులకు టెట్ అవసరం లేనందునా, 330 మార్కులకు రాత పరీక్ష, క్లాస్రూమ్ డెమాన్‌స్ట్రేషన్ కమ్ ఇంటర్వ్యూ చేపట్టి నియామకాలు చేస్తే బాగుంటుందని ఆలోచనలు చేస్తోంది. మరోవైపు సిలబస్ విషయంలోనూ మార్పులు చేయాలని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం ఎస్జీటీ పోస్టుకు ప్రస్తుతం 8వ తరగతి వరకు సిలబస్‌ను, స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పదో తరగతి వరకున్న సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే 8, 10 తరగతుల సిలబస్ కాకుండా డిగ్రీ స్థాయి వరకు సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకునేలా కసరత్తు చేస్తోంది.