విద్య ప్రాధాన్యతను ప్రభుత్వాలు గుర్తించడం లేదు | Governments do not realize the importance of education | Sakshi
Sakshi News home page

విద్య ప్రాధాన్యతను ప్రభుత్వాలు గుర్తించడం లేదు

Published Tue, Nov 8 2016 2:29 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

విద్య ప్రాధాన్యతను ప్రభుత్వాలు గుర్తించడం లేదు

విద్య ప్రాధాన్యతను ప్రభుత్వాలు గుర్తించడం లేదు

 ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్: ‘రాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాలకు విద్య ప్రాధాన్యత అంశం కాకుండా పోరుుంది. విద్యపై పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన లేకపోవడం.. విద్యపై పెట్టే పెట్టుబడులు సామాన్యుల అభివృద్ధికి, మానవ వనరుల అభివృద్ధికి, దేశ ప్రగతికి తోడ్పడతాయనే విషయాన్ని పాలకులు గుర్తించకపోవడం, విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నాం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ, విద్యా శాఖామంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మానవ వనరుల అభివృద్ధి ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యపడుతుందని సీఎం కేసీఆర్ విశ్వసిస్తున్నారని, ఆ మేరకు తెలంగాణలో ప్రతి విద్యార్థి ప్రపంచంలో ఉన్న ఏ విద్యార్థితోనైనా పోటీపడేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.

సోమవారం ఇక్కడ సనత్‌నగర్ సెరుుంట్ థెరిస్సా స్కూల్‌లో మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్ర స్థారుు ఇన్‌స్పైర్ ప్రదర్శన-2016 ప్రదర్శనను రాష్ట్ర హోం, కార్మిక శాఖమంత్రి నారుుని నర్సింహారెడ్డి, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి శ్రీనివాస్‌యాదవ్‌లతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ 4, 5 సంవత్సరాల్లో విద్యా రంగాన్ని పట్టాలు ఎక్కించి దేశంలోనే తెలంగాణను మార్గదర్శకంగా మారుస్తామన్నారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణరుుంచినట్లు వివరించారు.    హైదరాబాద్‌లోని  15 నియోజకవర్గాల్లో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.75 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వీటి ద్వారా టారుులెట్స్ నిర్మాణం, మంచినీటి వసతి,  కరెంటు సరఫరా, ఆర్‌ఓ ప్లాంట్, ప్రహరీలు, వంటశాలలు వంటి మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా జూనియర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ కళాశాలలకు, యూనివర్సిటీలకు అనుమతులు మంజూరు చేశాయని, కానీ దురదృష్టవశాత్తూ వాటికి భూమి గానీ, నిధులు గానీ, నియామకాలు గానీ చేపట్టకుండా కేవలం కాగితాఛిల పైనే  మంజూరు చేసిపోయాయన్నారు. వాటన్నింటిని తమ ప్రభుత్వం పటిష్టపరిచే ప్రయత్నం చేస్తోందని చెప్పారు.

అలాగే, కాంట్రాక్ట్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని, అరుుతే న్యాయపర అడ్డంకులు ఉండడం వల్ల ఆలస్యం అవుతుందన్నారు.  త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి 2017 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల భర్తీ పూర్తి చేయనున్నామన్నారు. పాఠశాల స్థారుు నుంచి ఇంజనీరింగ్ వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను నియంత్రించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే నవంబర్ 14 బాలల దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 1500 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement