నేటి నుంచి రీసెట్
ఎస్కేయూ : కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రీసెట్ (రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్–2016)ను శుక్రవారం నుంచి నిర్వహించనున్నారు. ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో నిర్వహించే రాత పరీక్షలు ఆదివారం ముగియనున్నాయి. తొలిసారిగా ఆన్లైన్ విధానంలో ప్రవేశ పరీక్షలు జరుపుతున్నారు.
ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల, ఎస్కేయూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల మూడు పరీక్ష కేంద్రాలను నిర్ధారించారు. మొత్తం 2,500 మంది విద్యార్థులు రాత పరీక్షకు దరఖాస్తు చేసుకొన్నట్లు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీన్ చింతా సుధాకర్ తెలిపారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు అరగంట ముందే చేరుకోవాలని సూచించారు. మొత్తం 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.