The research
-
హరివిల్లులా ఉంటే వారు వీరవుతారు!
కనుబొమలు ప్రముఖ ఫెంగ్షు నిపుణురాలు ప్రియా షేర్ ‘కనుబొమలు- మనుషుల మనస్తత్వాలు’ అనే విషయంపై చాలాకాలంగా పరిశోధన చేస్తున్నారు. కనుబొమల్ని బట్టి మనిషి స్వభావాన్ని అంచనా వెయ్యొచ్చని గతంలో ఆమె ఆసక్తికరమైన కొన్ని విషయాలను వెల్లడించారు. ఇప్పడు వాటికి మరిన్ని విశేషాలు జోడించారు. అద్దంలో మీ కను బొమల్ని చూసుకోండి. మీరేమిటో తెలుసుకోండి. ఇంద్రధనుసులా వంగివుండే కనుబొమలు కల పురుషులు సెన్సెటివ్‌గా... మహిళలైతే మొండిగా ఉంటారట. సన్నని గీతలా ఉండే కనుబొమలు కలవారు చాలా మృదు స్వభావులై ఉంటారట. చివర్లు వంపు తిరిగి ఉండే కనుబొమలు కలవారు సృజనాత్మకత కలవారై ఉంటారట. కనుబొమలు నల్లగా కాకుండా బ్రౌన్ కలర్లో ఉంటే... వారిలో ప్రణయ భావనలు అధికంగా ఉంటాయట. అదే కనుబొమలు మెత్తగా లేకుండా రఫ్‌గా ఉంటే... అటువంటి భావనలు తక్కువగా ఉంటాయట. తిన్నగా గీత గీసినట్టుగా ఉండే కనుబొమలు ఉన్నవారు దృఢచిత్తం కలవారై ఉంటారట. ఒకవేళ మహిళలైతే వారిలో కాస్త పురుషత్వం కనిపిస్తూ ఉంటుందట. కన్నులకు మరీ దూరంగా, పైన ఎక్కడో ఉన్నట్టుగా కనుబొమలు ఉంటే... వారికి కలలు, కోరికలు ఎక్కువుంటాయట. అదే కనుబొమలు కన్నులకు చాలా దగ్గరగా ఉంటే... వారిలో నిబద్ధత, ప్రతి పని పట్ల శ్రద్ధ కనిపిస్తుందట. అలాగే వీరు పరమ జాగ్రత్తపరులట. కొన్నిసార్లు తమ పనిలో పడి ఇతరులను కూడా పట్టించుకోరట. కంటికీ కనుబొమకీ మధ్య ఉండే దూరం ఒక్కోసారి రెండు కన్నులకూ వేరుగా ఉంటుంది. దాన్ని బట్టి, స్త్రీ పురుషుల్లో ఎవరు డామినేటింగో చెప్పవచ్చట. ఆడవారి కుడి కనుబొమ కనుక ఎడమ కనుబొమకంటే పైకి ఉంటే... వారిలో ఆధిక్యధోరణి ఎక్కువట. అదే పురుషుల్లో అయితే ఎడమ కనుబొమను పరిగణనలోకి తీసుకోవాలట.గుబురు కనుబొమలు కల మహిళల నడక, బాడీ లాంగ్వేజ్‌లో కొద్దిగా పురుష లక్షణాలు కనిపిస్తుంటాయట. అదే పురుషులైతే యమా ఉత్సాహంగా ఉంటారట. -
డెత్ సెన్స్
పదిశోధన మరణం ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రపంచంలో కొందరు ప్రముఖ వ్యక్తులు మాత్రం మృత్యుజాడల్ని ముందే పసిగట్టారు. తమ మరణం ఎలా ఉండబోతుందో ప్రకటించారు. చివరికి అలాగే కన్నుమూశారు. వీరే వారు... 1.తన రచనలతో ప్రపంచం మొత్తాన్నీ అభిమానులుగా మార్చేసుకున్న మార్క్ ట్వెయిన్ ఓచోట ఇలా రాశారు -‘‘1835లో హేలీ తోకచుక్కతో పాటే నేనూ పుట్టాను. అది వచ్చే యేడు మళ్లీ వస్తోంది. బహుశా ఈసారి దానితో పాటే నేనూ పోతానేమో’’. మార్క్ ట్వెయిన్ అన్నట్టుగానే అయ్యింది. ఆయన ఏప్రిల్ 21, 1910న గుండెపోటుతో కన్నుమూశారు. అంతకు కొద్ది గంటల ముందే హేలీ తోకచుక్క రావడం, పోవడం జరిగింది. - మార్క్ ట్వెయిన్ 2.అమెరికాను కొద్దికాలం ఊపేసిన గాయని, నటి, మోడల్... ఆలియా... 2001, జూలైలో ఓ ఇంటర్వ్యూలో తనకు వచ్చిన ఓ కలను చెప్పింది. ఎవరో తరుముతుంటే ఆమె చీకటిలో పరిగెడుతూ ఉంటుంది. ఉన్నట్టుండి గాల్లోకి లేస్తుంది. ఎక్క డికో ఎగిరిపోతుంది. ఇది చెప్పి ఆమె ఓ మాట అంది -‘దేని నుంచి పారిపోతున్నాను? ఈ వృత్తి నుంచా? కీర్తి నుంచా? లేక ఈ లోకం నుంచా?’. నెల తిరక్కుండానే విధి సమాధానం! విమాన ప్రమాదం కారణంగా ఇరవై రెండేళ్ల ఆలియా లోకం నుంచే వెళ్లిపోయింది.- ఆలియా 3. లింకన్‌కి ఓ కల వచ్చింది. ఆ కలలో ఆయన వైట్‌హౌస్‌లో తూర్పున ఉన్న గదికి వెళ్లారు. అక్కడో శవపేటిక ఉంది. చుట్టూ సైనికులు నిలబడి ఉన్నారు. ప్రజలు సందర్శిస్తున్నారు. చనిపోయింది ఎవరని అడిగారు లింకన్. ‘ప్రెసిడెంట్’ అని సమాధానమిచ్చాడో వ్యక్తి. ఎన్నో రోజులు గడవకముందే మరో కల వచ్చింది. విశాల జలాల మీద పడవలో ఒంటరిగా ప్రయాణిస్తున్నట్టు. ఉదయం లేచాక ఆ కల గురించి ఇంట్లోవాళ్లకు చెప్పారు లింకన్. తర్వాత కొద్ది గంటలకే హత్యకు గురయ్యారు. - అబ్రహాం లింకన్ 4. జర్మనీకి చెందిన ప్రముఖ చిత్రకారుడు, సంగీతకారుడు ఆర్నాల్డ్ సోహన్బర్గ్కి 13వ నంబర్ అంటేనే వణుకు. ఆయన పుట్టింది సెప్టెంబర్ పదమూడున. దాంతో ఆ తేదీనే చనిపోతాను అని భయపడే వారాయన. జీవితాంతం ఆ సంఖ్య తన దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ తేదీ ఆయన్ను వెంటాడింది. 1951, జూలై 13న మరణించారు. ఇంకా విచిత్రం ఏంటంటే... ఆయన చనిపోయింది తన 76వ ఏట. 7, 6 కలిపినా పదమూడే అవుతుంది! - ఆర్నాల్డ్ సోహన్బర్గ్ 5. పాప్ రారాజు మైఖేల్ జాక్సన్‌కి కూడా మరణం దగ్గర పడుతోన్న విషయం ముందే అర్థమయ్యిందట. ఓ కాన్సర్ట్ గురించి మాట్లాడినప్పుడల్లా అది వర్కవుటయ్యేలా లేదనేవాడట. చనిపోవడానికి రెండు గంటల ముందు కూడా ‘ఈ జీవితంతో విసిగిపోయాను’ అన్నాడట. ఇయాన్ హల్పెరిన్ రాసిన ‘అన్మాస్క్డ్- ద ఫైనల్ ఇయర్ ఆఫ్ మైఖేల్ జాక్సన్’లో దీని గురించి ఉందట. - మైఖేల్ జాక్సన్ 6. అమెరికాకు చెందిన గొప్ప ఫుల్బాల్ క్రీడాకారుడు పీట్ మారవిచ్. అతని వేగాన్ని చూసి ‘పిస్టల్ పీట్’ అని పిలిచేవారతన్ని. ఓసారి అతను ఒక సందర్భంలో ఊహించని మాట అన్నాడు. ‘నేనేమీ మరో పదేళ్లు ఫుట్‌బాల్ ఆడకపోవచ్చు. ఆలోపే, అంటే నా నలభయ్యో యేట గుండె నొప్పితో చనిపోవచ్చు’ అన్నాడు. అదే జరిగింది. తొమ్మిదేళ్లు ఆడాక, ఓరోజు ఫుల్బాల్ ఆడుతూండగానే హార్ట్ అటాక్ వచ్చి కన్నుమూశాడు పీట్. అప్పుడతనికి నలభయ్యేళ్లు. - పీట్ మారవిచ్ 7 . ‘ఫాదర్ ఆఫ్ ద మోడ్రన్ టాబ్లాయిడ్’ విలియమ్ థామస్ స్టెడ్ రాసిన మొదటి కథలో... అట్లాంటిక్ సముద్రంలో రెండు ఓడలు గుద్దుకుని, సరిపడా లైఫ్ బోట్స్ లేక వందల మంది చనిపోతారు. తర్వాతి కథలో ఓ పడవ ఐస్‌బర్గ్‌ను గుద్దుకుని ముక్కలవుతుంది. కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ కారణంగా కొందరు బతికినా, మిగతావాళ్లంతా చనిపోతారు. కొన్నాళ్లకి అమెరికాలో జరిగే పీస్ కాన్ఫరెన్స్‌కి వెళ్లడానికి టైటానిక్ ఓడ ఎక్కారు స్టెడ్. ఆ ప్రమాదంలో కన్నుమూశారు. విచిత్రం ఏమిటంటే, ఆ ఓడ కెప్టెన్ పేరు... ఎడ్వర్డ్ స్మిత్. - విలియమ్ స్టెడ్ 8. సుప్రసిద్ధ ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త అబ్రహాం డి మోవ్రేకి ఓరోజు తన నిద్ర విషయంలో అనుమానం వచ్చింది. తను రోజూ అనుకున్నదానికంటే పదిహేను నిమిషాలు ఎక్కువసేపు నిద్రపోతున్నట్టు తెలుసు కున్నాడు. అప్పుడతను తన అసిస్టెంట్‌తో... ‘రోజుకో పదిహేను నిమిషాలు చొప్పున కలుపుకుంటూ పోతే, అవి 24 గంటలు అయిన రోజున నేను ఇక లేవను. పూర్తిగా నిద్రలోకి పోతాను’ అని. అలాగే అయ్యింది. సరిగ్గా తొంభై ఆరు రోజుల తర్వాత మోవ్రే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. - అబ్రహాం డి మోవ్రే 9. డబ్ల్యూడ బ్ల్యూఎఫ్ చూసిన వాళ్లకు జేమ్స్ హెల్విగ్ గురించి చెప్పక్కర్లేదు. అతడు తన లాస్ట్ అప్పియరెన్స్ రోజున ప్రసంగిస్తూ ఇలా అన్నాడు... ‘ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరి హృదయ స్పందనా ఎప్పుడో ఒకప్పుడు ఆగుతుంది. ప్రతివారి ఊపిరీ ఎప్పుడో ఒకప్పుడు స్తంభిస్తుంది. ప్రతి ఒక్కరి ఆటా ఏదో ఒకనాడు ముగుస్తుంది. ఈరోజు నాది ముగిసింది’. ఆ తర్వాత రోజు తన భార్యతో కలిసి నడుస్తుండగా గుండె నొప్పి వచ్చి, జేమ్స్ ఆట పూర్తిగా ముగిసిపోయింది. జేమ్స్ హెల్విగ్ 10. డయానాకి కూడా మృత్యువు తనను వెతుక్కుంటూ వస్తున్న విషయం ముందే తెలిసిందట. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు నుంచీ డిస్టర్బ్ అయ్యేదట. కారు ప్రమాదానికి గురై మరణిస్తున్నట్టు ఊహలు వచ్చేవట. సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తికి వాటి గురించి ఉత్తరం కూడా రాసిందట. ఆమె ఊహ నిజమైంది. కారులో బయలుదేరి కానరాని లోకాలకు చేరుకుంది. డయానా -
నెట్‌ను మితిమీరి ఉపయోగిస్తే జబ్బుల బారిన పడ్డట్లే!
పరిపరి శోధన మీకు తరచూ జలుబు చేస్తోందా? మీరు తరచూ జబ్బుల బారిన పడుతున్నారా? బహుశా మీరు ఇంటర్నెట్పై ఎక్కువగా ఉంటున్నారేమో? నిజమే. ఇంటర్నెట్కూ... జలుబూ, ఫ్లూ జ్వరాలూ, తరచూ జబ్బు పడటానికి సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. పద్దెనిమిది ఏళ్లు పైబడ్డ కొందరిపై నిర్వహించిన పరిశోధనల్లో విచిత్రమైన విషయాలు తెలిశాయి. శ్వాన్సీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హ్యూమన్ అండ్ హెల్త్ సెన్సైస్‌లో నిర్వహించిన ఈ అధ్యయనంలో అనేక అంశాలతో పాటు ఇంటర్నెట్ వల్ల ఆరోగ్యం దెబ్బతినే తీరు కూడా తేటతెల్లమైంది. ఈ అధ్యయనంలో పాలు పంచుకున్న ప్రొఫెసర్ ఫిల్ రీడ్ మాటల్లో చెప్పాలంటే... ‘మామూలు వారితో పోలిస్తే ఇంటర్నెట్పై గంటల తరబడి ఉండేవారిలో వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. ఆన్లైన్లో ఉండేవారు దానికి బానిసలైపోవడంతో వారు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం మళ్లీ ఆన్‌లైన్‌కి వెళ్తారు. ఇలా వెళ్లే వాళ్లలో సాధారణ స్థాయులతో పోలిస్తే కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా వెలువడుతుంది. దాంతో ఒకలాంటి ఊరటకు గురవుతుంటారు. ఆ ఊరటను పొందడం కోసం మళ్లీ మళ్లీ ఇంటర్నెట్ను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇలా ఇంటర్నెట్ను ఆశ్రయించేవాళ్లలో మామూలు పాళ్ల కంటే ఎక్కువగా కార్టిసోల్ వెలువడుతుండటం వల్ల వాళ్ల రోగనిరోధక శక్తి కూడా దెబ్బ తింటుంది. ఫలితంగా ఇది పూర్తి ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇక ఇదే తరహా పరిశోధనల్లో పాలుపంచుకున్న మిలాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాబర్టో ట్రుజోలీ మాట్లాడుతూ ‘ఇంటర్నెట్ ఉపయోగించడం పెరుగుతున్న కొద్దీ వ్యాధుల బారిన పడే అవకాశాలూ అంతే పెరుగుతున్నాయి. వ్యాధి బారిన పడటం ఎలా జరుగుతుందన్న విషయం వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉండవచ్చు. కానీ వ్యాధుల బారిన పడుతున్న మాట మాత్రం వాస్తవం’ అని వ్యాఖ్యానించారు. ఇలా ఆరోగ్యం దెబ్బతినే విషయంలో మహిళలు, పురుషులకు తేడాలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇంటర్నెట్ను ఉపయోగించే విషయంలో మహిళలు, పురుషుల ప్రాధాన్యాలు వేరుగా ఉన్నాయి. మహిళలు ప్రధానంగా షాపింగ్, సోషల్ మీడియా కోసం ఇంటర్నెట్ను వాడుతున్నారు. అదే పురుషులు మాత్రం పోర్నోగ్రఫీ, గేమింగ్ కోసం ఎక్కువగా నెట్‌ను ఉపయోగిస్తున్నట్లు కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది. -
అధికారం తలకెక్కుతుందట!
పరిపరి శోధన అధికారం కిక్కు తలకెక్కితే, అది ఒక పట్టాన దిగదట. అధికారంలో ఉన్నా, లేకున్నా స్థిమితంగా ప్రవర్తించడం స్థితప్రజ్ఞులకే చెల్లుతుంది. సామాన్యుల పరిస్థితి అలా కాదు కదా! అధికారం దక్కాక ఎంతో కొంత దర్పాన్ని ప్రదర్శించడం మామూలే. అయితే, కొందరు అతిగా దర్ప ప్రదర్శన చేస్తుంటారట. వారి సంభాషణలు సాధారణంగా వన్‌వే ట్రాఫిక్‌లాగే ఉంటాయని, ఎదుటి వారి మాటలు వినిపించుకోకుండా, తాము చెప్పదలచుకున్నదే చెబుతూ పోతారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి వారికి అధికారంతో పాటే ఆధిక్యతా భావం పెరుగుతుందని, దాంతో ఇతరులను చులకనగా చూస్తారని తమ పరిశోధనల్లో తేలినట్లు కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. -
దెయ్యాలు ఉన్నాయా?
దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. ఈ విషయం గురించి పరిశోధన చేయడానికి వెళ్లిన కొందరు విద్యార్థులకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఆనంద్‌కుమార్, అనూష జంటగా చాంద్‌పాషా దర్శకత్వంలో ఖాదర్‌బాబు, తారాబేగం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ ప్రతి సన్నివేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నవంబర్ నెలాఖరులో పాటలను విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆనంద్, సహ-నిర్మాత: సల్మాన్‌ఖాన్.