ఉప్పు.. ఉసురు తీస్తోంది!
ఉప్పు అధికంగా వాడటం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 16 లక్షల మంది గుండెజబ్బుల బారిన పడి చనిపోతున్నారట. ఒక్కొక్కరు రోజుకు 2 గ్రాములుకంటే ఎక్కువ ఉప్పు వాడొద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతకుముందే సిఫారసు చేసింది. అయితే ఇంతకుమించి ఎక్కువ ఉప్పు వాడితే కలిగే ప్రభావాలపై 187 దేశాల్లో అధ్యయనం చేసిన టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఏకంగా లక్షలాది మంది రక్తపోటు బారినపడుతున్నారని, తద్వారా గుండెజబ్బుల ప్రమాదం పెరిగి మరణిస్తున్నారని వెల్లడించారు.
గుండెజబ్బుతో చనిపోతున్న ప్రతి 10 మందిలో ఒకరి మరణానికి పరోక్షంగా ఉప్పే కారణమని, అందువల్ల దీని విషయంలో అతి జాగ్రత్తగా కాకుండా.. కాస్త జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.