రుణమాఫీకి ఆశపడి రుణాలు కట్టడం మానొద్దు
లావేరు: రుణమాఫీకి ఆశపడి బ్యాంకు ల్లో రుణం తీసుకున్న వారు రుణాలు కట్టడం మానొద్దని రిజర్వు బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజరు కె.సుబ్రహ్మణ్యం సూచించారు. రుణాల కట్టకపోతే డిపాల్టర్లుగా మిగిలిపోతారని చెప్పారు. నాబార్డు, రిజర్వు బ్యాంకు సౌజన్యంతో లావేరులోని బెజ్జిపురం యూత్క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంపై రైతులు, మహిళా సంఘాలు సభ్యులకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బ్యాంకులు ద్వారా అమలు అవుతున్న బీమా పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. దేశంలో 121 కోట్లు మంది జనాభా ఉంటే వారిలో 11 కోట్లు మందే బీమా పథకాల్లో చేరారని వివరించారు.
దొంగనోట్లు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏటీఎంలో దొంగనోట్లు వస్తే వెంటనే ఫిర్యాదు చేస్తే ఏటీఎంలకు నోట్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏటీఎం కార్డులు, పిన్ నంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులుకు ఇవ్వరాదని చెప్పారు. నాబార్డు ఏజీఎం వాసుదేవన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా చిన్న వ్యాపార, కార్యక్రమాలకు మూడు రకాలు రుణాలు ఇస్తున్నట్టు వెల్లడించారు. లీడ్ బ్యాంకు మేనేజరు ఎం.రామినాయుడు బ్యాంకుల బీమా పథకాల గురించి వివరించారు. ఏఎల్డీఎం సత్యనారాయణ, లీడ్బ్యాంక్ అక్షరాస్యత కౌన్సిలర్ ఆర్ఆర్ఎం పట్నాయక్, లావేరు జడ్పీటీసీ సభ్యులు పిన్నింటి శ్రీదేవి, బ ెజ్జిపురం సర్పంచ్ ఇజ్జాడ ఉత్తరలక్ష్మీ, ఎంపీటీసీ సభ్యులు దన్నాన దివ్వబారతి తదితరులు పాల్గొన్నారు.