reserviors
-
మూడు రిజర్వాయర్లకు సీఎం జగన్ శంకుస్థాపన
-
జాప్యంతో రూ. కోట్లు వృథా
మక్తల్ : ప్రభుత్వాల వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతుందని తద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ అన్నారు. ప్రాజెక్టుల కింద ముంపునకు గురైన ప్రాంతాల్లో నిర్వాసితులకు అన్నివసతులతో పునరావాసం కల్పించాలన్నారు. బుధవారం ఆయన సంగం బండ, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తున్నాయని, దశాబ్దాలు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదన్నారు. జిల్లాలోనిసంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు శంఖుస్థాపన చేసి 19 ఏళ్లు గడచినా ప్పటికీ పూర్తి కాకపోవడం దారుణమన్నారు. దీని వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మూడురెట్లు పెరిగిందన్నారు. పాలమూరు జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారన్నారు. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం పూర్తరుుతే జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ ఖరీఫ్ సీజన్లోనే రైతులకు సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమాలపై విచారణ జరిపించాలి ముంపు గ్రామాల్లో అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేరడిగొమ్ము, భూత్పూర్ గ్రామాల్లో కొందరు అక్రమంగా షెడ్లు నిర్మించుకుని పరిహారం స్వాహా చేస్తున్నారన్నారు. ఇందులో అధికారులకు వాటా ఉందని ఆరోపించారు. నిజమైన లబ్దిదారులు ఏళ్లతరబడి పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పునారవాస కేంద్రాల్లో కూడా రూ.3లక్షలతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనెఉన్నట్లు తెలిపారు. జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల పరిశీలన ధరూరు : సీపీఐ బృదం బుధవారం సాయంత్రం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ రిజర్వాయర్‌ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. నీటి నిల్వ, ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. జూరాల- పాకాలకు ఇచ్చే నీటి వివరాలను ఈఈ రవీందర్‌ను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా నిర్మించనున్న ప్రాజెక్టు మార్గదర్శకాలు తమ వద్ద లేవని, లెఫ్ట్ కెనాల్ ప్రాంతం నుంచి నీళ్లు వదిలే ప్రాంతాన్ని అధికారులు ఆయనకు చూపారు. అనంతరం నెట్టెంపాడు నెట్టెంపాడు ఎత్తిపోతల పనులను పరిశీలించారు. ప్రాజెక్టు కింద ఉన్న రిజర్వాయర్లు, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు గద్వాలకు బయలుదేరి వెళ్లారు. ఈ బృందంలో సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లు వెంకటేష్, వర్ల పద్మ, విశ్వేరరావు, జిల్లా నాయకులు ఈర్ల నరసింహ, ఆంజనేయులు, కేశవులు తదితరులు న్నారు. -
సర్వేపల్లి కాలువ కబ్జా
సాక్షి, నెల్లూరు : సోమశిల రిజర్వాయర్ పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే సర్వేపల్లి కాలువ కబ్జాకు గురైంది. దీంతో ఈ కాలువ రోజురోజుకూ కుంచించుకుపోతోంది. నెల్లూరు పెన్నానది నుంచి నగరంలో 10 కిలోమీటర్లకు పైగా పొడవు ఉన్న ఈ కాలువ దాదాపు కనుమరుగు అయ్యేంతగా కబ్జా కోరల్లో చిక్కుకుంది. నగర పరిధిలో రంగనాయకులపేట నుంచి శెట్టిగుం టరోడ్డు, ఆత్మకూరు బస్టాండ్, బాలాజీనగర్, మినీబైపాస్ రోడ్డు, కొండాయపాళెం, కనుపర్తిపాడు, వెంకటాచలం మీదుగా ఈ కాలువ సర్వేపల్లి వరకూ సాగుతుంది. అయితే రంగనాయకులుపేట మొదలు కొండాయపాళెం, కనుపర్తిపాడు వరకూ కాలువ ఆక్రమణకు గురైం ది. ముఖ్యంగా ఆత్మకూరు బస్టాండ్ నుంచి బాలాజీనగర్, మినీబైపాస్ రోడ్డులోని ఈ ప్రధాన కాలువను పెద్ద ఎత్తున ఆక్రమించారు. ఈ ప్రాంతంలో అధికార పార్టీ అండతో కబ్జాదారులు ఏకంగా కాలువలోనే పిల్లర్స్ వేసి బహుళ అంతస్తుల భవనాలు సైతం నిర్మించారు. మరికొందరు చిన్నపాటి ఇళ్లు నిర్మించి బాడుగలకు ఇస్తుండగా, మరికొందరు వాటిని అమ్మకానికి పెట్టి అందిన కాడికి దండుకొని చేతులు దులుపుకున్నారు. మరికొందరు ఆక్రమణల పర్వం కొనసాగిస్తున్నారు. ఆక్రమణల వెనక అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతోపాటు కొందరు మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. నగరంలో విలువైన స్థలం కావడం, శ్రమ లేకుండానే కోట్లాది రూపాయలు కొల్లగొట్టే అవకాశం ఉండటంతో నేతలు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు ఏ మాత్రం స్పందించడంలేదు. అధికార బలంతో ఆక్రమణలు పెరగడంతో పలు ప్రాంతాల్లో కాలువ మరింత కుంచించుక పోయింది. కొన్నిచోట్ల ప్రధాన కాలువ పిల్లకాలువలాగా, మరి కొన్నిచోట్ల చిన్నపాటి డ్రైనేజీలాగా మారిపోయాయి. సోమశిల నీళ్లు విడుదల చేసినా సక్రమంగా ఆయకట్టుకు నీరుచేరే పరిస్థితి లేదు. నీళ్లు రాకపోతే పంటలు సక్రమంగా పండే అవకాశం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక కాలువలో పూడికతీత అంటూ అటు అధికారులు, కాంట్రాక్టర్లు అందిన కాడికి దండుకున్నారే తప్ప ఆక్రమణలు తొలగించి కాలువను విస్తరించడాన్ని గాలికొదిలారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లుతెత్తుతున్నాయి. కాలువల ఆక్రమణలతో పాటు నాసిరకంగా జరుగుతున్న పూడికతీత పనులు ఇటీవల కలెక్టర్ శ్రీకాంత్ పరిశీలించారు. అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఇరిగేషన్ అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదు. ఈ నెల 15న ఐఏబీ సమావేశంలో కొందరు ప్రజాప్రతినిధులు కాలువల ఆక్రమణల సంగతి అధికారుల దృష్టికి తెచ్చారు. కలెక్టర్ సీరియస్‌గా స్పందించినట్టు కనిపించలేదు. ఇప్పటికైనా స్పందించి సర్వేపల్లి కాలువతో పాటు నగర పరిధిలో నెల్లూరు చెరువు, పెన్నాడెల్టా, ఈస్ట్రన్, సదరన్, జాఫర్‌సాహెబ్ కాలువ, సర్వేపల్లి తదితర నీటిపారుదల శాఖకు సంబంధించి కాలువలున్నాయి. పెన్నాడెల్టాకు సంబంధించి 22 మీడియం కెనాల్స్, నాలుగు ప్రధాన కాలువలున్నాయి. సదరన్ చానల్‌కు సంబంధించి 26 కాలువలు ఉండగా జాఫర్ సాహెబ్ కెనాల్‌కు 38 కాలువలు,సర్వేపల్లి కెనాల్ పరిధిలో 34 కాలువలు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. తక్షణం ఆక్రమణల తొలగింపునకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
పాతాల గంగమ్మ పైకొచ్చింది
భారీగా పెరిగిన భూగర్భ జలాలుచాలాచోట్ల రెండు మీటర్ల లోతులోనే నీరు మోర్తాడ్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఊహించని రీతిలో వర్షాలు కురియడంతో భూగర్భ జల మట్టం భారీగా పెరిగింది. చాలాచోట్ల రెండు మూడు మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభిస్తున్నాయి. జిల్లాలో సరాసరిన 7.6 మీటర్ల లోతులోనే నీరుంది. గతేడాది జూలైలో జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 12.27 మీట ర్లుగా నమోదైంది. కాగా ఇదే సంవత్సరం జూన్‌లో 11.42 మీటర్లుగా ఉంది. భారీ వర్షాలు కురియడంతో వారం వ్యవధిలోనే భూగర్భ జలాలు పైకి వచ్చాయి. జిల్లాలోని 45 ఫీజో మీటర్ల ద్వారా గత నెలలో భూగర్భ జలమట్టాలు సేకరించారు. వాటి ఆధారంగా జిల్లాలో సగటున 7.60 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నట్లు తేల్చారు. వారం వ్యవధిలోనే భారీ వర్షాలు కురియడంతో నీటి మట్టం ఒకేసారి 3.82 మీటర్లు పెరిగింది. నిజామాబాద్, బోధన్ డివిజన్లలోని పెద్దవాల్గోట్, అయిలాపూర్, మంచిప్ప, పెర్కిట్, నూత్పల్లి, ముప్కాల్, గన్నారం, అంక్సాపూర్, అర్సపల్లి, నిజాంసాగర్, నస్రూల్లాబాద్లలోని ఫీజో మీటర్లలో 2 మీటర్ల నుంచి 3 మీటర్ల లోతులో నీటిమట్టం నిలచి ఉంది. బిచ్కుంద మండలంలోని పుల్కల్లో మాత్రం 0.58 మీటర్ల లోతులోనే నీరుంది. మూడేళ్లలో భూగర్భ జల మట్టం భారీగా పెరగడం ఇదే మొదటిసారి. కామారెడ్డి డివిజన్లో అత్యల్పం నిజామాబాద్, బోధన్ డివిజన్లతో పోల్చితే కామారెడ్డి డివిజన్లో భూ గర్భ జలమట్టం తక్కువగా నమోదైంది. కామారెడ్డి డివిజన్లోని అనేక ప్రాంతాలలో 15 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నీరుంది. నిజామాబాద్ డివిజన్లో ప్రస్తుత సగటు భూగర్భ జలమట్టం 5.24 మీటర్లు కాగా జూన్‌లో 10.15 మీటర్లు, గతేడాది జూలైలో 12.25 మీటర్లుగా నమోదైంది. బోధన్ డివిజన్లో ప్రస్తుత సగటు 6.3 మీటర్లుగా నమోదు కాగా జూన్‌లో 8.66 మీటర్లు, గతేడాది జూలైలో 8.10 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. కామారెడ్డి డివిజన్లో ప్రస్తుత సగటు 11.47 మీటర్లు కాగా జూన్‌లో 15.17 మీటర్లు, గతేడాది 12.27 మీటర్లుగా ఉంది. డివిజన్లో తక్కువగా భిక్కనూరులో 15.53 మీటర్లు, గాంధారిలో 15.97 మీటర్లు, దోమకొండలో 21.49 మీటర్లు, బీబీపేట్‌లో 23.39 మీటర్లు, పెద్దమల్లారెడ్డిలో 24.61 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. నీటిని వృథా చేయొద్దు : పి.శ్రీనివాస్‌బాబు, భూగర్భ జల శాస్త్రవేత్త భవిష్యత్ అవసరాల దృష్ట్యా నీటిని పరిరక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాలి. భారీ వర్షాల కారణంగా నీటి మట్టం పెరిగింది. ఎండల తీవ్రత పెరిగితే మళ్లీ పడిపోతుంది. ప్రస్తుతానికి నీటి ఇబ్బందులు తప్పినట్లే. -