The results of the test
-
డబుల్ ధమాకా
మొదటి సంవత్సరం 81 శాతం, సీనియర్ ఇంటర్లో 84 శాతం ఉత్తీర్ణత రెండు విభాగాల్లోనూ బాలికలదే పైచేయి తొలిసారిగా రెండు ఫలితాలూ ఏకకాలంలో విడుదల జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మనమే టాప్ విజయవాడ : ఇంటర్మీడియెట్‌లో జిల్లా విద్యార్థులు డబుల్ ధమాకా సాధించారు. మంగళవారం విడుదలైన మొదటి, రెండవ సంవత్సరాల పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లాను రెండు విభాగాల్లోనూ మొదటిస్థానంలో నిలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 81 శాతం, రెండో సంవత్సరంలో 84 శాతం ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. విద్యల రాజధానిగా వెలుగొందుతున్న జిల్లా మరోసారి ర్యాంకును పదిలం చేసుకుంది. ఉత్తీర్ణత క్రమంలో రెండు సంవత్సరాల్లో 80 శాతానికి పైబడి ఉత్తీర్ణత సాధించింది. జూనియర్, సీనియర్ రెండు విభాగాల్లోనూ బాలికలో అగ్రస్థానంలో నిలిచారు. గడచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది జిల్లా ఉత్తీర్ణత శాతం కూడా పెరిగింది. మొదటిసారి ఏకకాలంలో... గతంలో ఎన్నడూ లేనివిధంగా మొదటి సారి ఏకకాలంలో ఇంటర్ జూనియర్, సీనియర్ పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. గతంలో కనీసం వారం రోజుల వ్యవధిలో ఈ ఫలితాలు విడుదల చేసేవారు. ప్రస్తుతం పరీక్షా ఫలితాల్ని విజయవాడలోనే రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. గత ఏడాది జిల్లా నాలుగో స్థానంలో నిలవగా ఈ ఏడాది మొదటి స్థానం దక్కించుకోవటం విశేషం. జూనియర్ ఇంటర్ ఫలితాలు ఇలా... జిల్లాలో ఈ ఏడాది మొత్తం 63,707 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 51,294 మంది వివిధ గ్రేడ్లలో ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 81గా ఉంది. మొదటి సంవత్సరంలో 34,095 మంది బాలురకు గాను 26,911 మంది, 29,612 మంది బాలికలకు గాను 24,383 మంది ఉత్తీర్ణులయ్యారు. 79 శాతం బాలురు, 82 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్లో జిల్లాకు చోటు దక్కింది. సీనియర్ ఇంటర్ ఫలితాలు ఇలా... సీనియర్ ఇంటర్లో 57,448 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 48,027 మంది ఉత్తీర్ణులయ్యారు. 84 శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. బాలుర విభాగంలో 30,258 మంది హాజరుకాగా 25,081 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల విభాగంలో 27,190 మందికి గాను 22,946 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 83 శాతం, బాలికల విభాగంలో 84 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండు సంవత్సరాల ఫలితాల్లోనూ బాలికలదే పైచేయిగా ఉంది. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 990 మార్కులతో జువ్వాది శివరామకృష్ణ, బైపీసీలో ఇంద్ర స్వరూప్ నాయక్ (991), బొజ్జా ప్రదీప్‌రెడ్డి (990), మిట్టపల్లి అలేఖ్య (989), విజయ్‌కుమార్ (989), పి.శ్రీశ్రావ్య (988) అత్యధిక మార్కులు సాధించారు. -
కనబడుట లేదు
సాక్షి, విశాఖపట్నం: ఇంట్లో అలిగి కొందరు.. పరీక్ష ఫలితాల భయంతో మరికొందరు.. ప్రేమ వ్యవహారంలో ఇంకొందరు చెప్పాపెట్టకుండా గడపదాటేస్తున్నారు. వీరిలో చాలా మంది ఎక్కడికి వెళ్లారో.. ఏమైపోయారో కూడా తెలియడం లేదు. పిల్లల కోసం గాలించి, కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులకు అక్కడా చేదు అనుభవమే ఎదురవుతోంది. పోలీసులు అదృశ్యం కేసులను ఛేదించకపోగా హేళనగా మాట్లాడుతున్న సందర్భాలూ ఉన్నాయి. పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదవుతున్న అదృశ్యం కేసుల్లో పసిపిల్లలు మొదలు యువతీయువకులే ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా 0-5 ఏళ్లలోపు వయస్సున్న బాలలు,16 నుంచి 18ఏళ్ల వయస్సున్న యువతుల అదృశ్యం లెక్కలు కంగారుపెడుతున్నాయి. వీరికి సంబంధించి మిస్సింగ్ కేసులు పోలీసు రికార్డులకు ఎక్కుతున్నా మొక్కుబడి దర్యాప్తుతో చివరకు అయినవాళ్లకు చేదుజ్ఞాపకాలే మిగులు తున్నాయి. 2011లో నగర పరిధిలో మొత్తం 478మంది అదృశ్యం అయినట్లు రికార్డులకెక్కగా, 2012లో 518 మంది, 2013లో 646, 2013 జనవరి నుంచి జులై వరకు 351 మంది కనిపించడం మానేశారు. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో మొత్తం 351 మంది కనిపించకపోగా అందులో బాలికలు, యువతులు, మహిళలు 185కాగా, బాలురు,యువకులు 166 మం ది ఉన్నారు. ఇందులో అయిదేళ్లలోపు పిల్లలు పది మందికాగా, 16-18ఏళ్ల వయసుగల యువతులు 109, యువకులు 34గా కేసులు నమోదయ్యాయి. అదృశ్యం కేసులు క్రమేపీ పెరిగిపోతున్నా అందులో పోలీసులు ఛేదించి ఆచూకీ తెలుసుకున్న కేసులు పెద్దగా లేవనే చెప్పాలి. ఒక రకంగా అదృశ్యం కేసులను పోలీసులు కూడా తేలిగ్గా తీసుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తున్నా తర్వాత విచారణ పక్కనపడేస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాలు, తల్లిదండ్రులే పోలీసులపై ఆధారపడలేక సొంతంగా పాట్లు పడుతున్నారు. అయినా ఏళ్లతరబడి ఫలితం లేక తమవారి రాక కోసం ఎదురుచూపులుచూస్తూ భారం గా కాలం వెళ్లదీస్తున్నారు. స్టేషన్‌కు ఫిర్యాదుచేశాక కనీసం వారినుంచైనా తమవాళ్ల సమాచారం వస్తుందేమోనని ఆశగా చూస్తున్నారు. కానీ పోలీసులు పట్టించుకునే ప్రయత్నం చేయకపోవడంతో ఆ కేసులు క్రమక్రమంగా అదృశ్యం అయిపోతున్నాయి. పుట్టిన పసి పిల్లలను కేజీహెచ్, ఘోషాస్పత్రి నుంచి అపహరించుకుపోయే ముఠాలు నగరంలో పెరిగిపోతున్నాయి. పోలీసులు మాత్రం ఈ కేసులను ఛేదించలేకపోతున్నారు. చాపకిందనీరులా నగరంలో యువతుల అదృశ్యం కేసులు పెరిగిపోతుండడం విశేషం. నగరంలో పాగా వేసిన కొన్ని యువతుల అక్రమ రవాణా గ్యాంగులు పేదింటి యువతులపై కన్నేసి వారిని ఉపాధి పేరుతో దేశాల సరిహద్దులు దాటించేస్తున్నారు. ఇటీవల 10 మంది యువతులను ఇలాగే తరలించే ప్రయత్నం చేసి పట్టుబడ్డారు. ఇంట్లో సమాచారం ఇవ్వనీయకుండా మహిళలు, యువతులను తరలించేస్తుండడంతో తమవారి జాడ తెలియక చాలామంది స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసులను తేలిగ్గా తీసుకుంటున్నారు. అధికంగా ప్రేమ వివాహాలకు సంబంధించి యువతుల తల్లిదండ్రులు మిస్సింగ్ కేసులు ఎ క్కువగా పెడుతున్నారని, తర్వాత తమ వాళ్లు తిరిగి వచ్చినా కేసులు వెనక్కి తీసుకోకపోవడం కూడా కేసు లు పెరగడానికి కారణమని విశ్లేషిస్తుండడం విశేషం.