షూటింగ్‌కు సల్మాన్ ఖాన్
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో ఊరట పొందిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మళ్లీ షూటింగ్‌పై దృష్టిసారిస్తున్నారు. శనివారం కాశ్మీర్లో జరిగే బజరంగి భైజాన్ సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు.
హిట్ అండ్ రన్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల శిక్ష విధించగా, శుక్రవారం హైకోర్టు శిక్షను నిలుపదల చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్‌కు బెయిల్ మంజూరు చేయడంతో ఊపశమనం కలిగింది. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు సల్మాన్ కృతజ్ఞతలు చెప్పారు.