Retail industry
-
షాపర్‌టైన్‌మెంట్‌కు స్వాగతం
తాము ఇష్టపడే వస్తువును కొనడానికి వెబ్సైట్లలోకి వెళ్లే యువతరం... అక్కడ కనిపించే సుదీర్ఘమైన సమాచారాన్ని చదవడం బోర్‌గా ఫీలవుతున్నారు.అలా అని వస్తువుగురించి పూర్తిగా తెలుసుకోకుండా కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో లైవ్ ‘షాపర్‌టైన్‌మెంట్’ను ఇష్టపడుతున్నారు.వెబ్సైట్లలో వన్‌సైడ్ కమ్యూనికేషన్ ఇష్టపడని వారికి లైవ్ కామర్స్ యాప్‌లు దగ్గరయ్యాయి. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 25 సంవత్సరాల కనిక షిండే యాక్టివ్ ఆన్లైన్ షాపర్. రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు ఆమె నోట పదేపదే వినిపిస్తున్నమాట షాపర్‌టైన్‌మెంట్. ‘షాపర్టైన్మెంట్లో షాప్‌కు వెళ్లి సరదాగా షాపింగ్ చేసిన అనుభూతి కలుగుతుంది. లిప్‌స్టిక్ నుంచి ఐ షాడోస్ వరకు మనం ఎంపిక చేసుకునే వస్తువుల విషయంలో స్పష్టత వస్తుంది. ఆ వస్తువులకు సంబంధించి సందేహాలకు వెంటనే సమాధానాలు దొరుకుతాయి’ అంటుంది కనిక. నాసిక్‌లోని కనిక షిండే మాత్రమే కాదు మన దేశంలో చిన్న, పెద్ద పట్టణాలు అనే తేడా లేకుండా జెన్–జెడ్, మిలీనియల్స్ రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ‘షాపర్‌టైన్‌మెంట్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడది వారికి ఫ్యాషన్‌గా కూడా మారింది. చైనీస్ డిజిటల్ మార్కెట్లో పుట్టిన ‘షాపర్‌టైన్‌మెంట్’ (కాంబినేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇ– కామర్స్, వీడియో కంటెంట్) ట్రెండ్ ఇప్పుడు మన దేశంలోనూ హల్చల్ చేస్తోంది.చైనాలో ‘షాపర్‌టైన్‌మెంట్’ అనేది పాపులర్ ట్రెండ్‌గా ఉంది. చైనాకు చెందిన దిగ్గజ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ‘టవ్భావ్’ షాపర్‌టైన్‌మెంట్‌కు ఊపు ఇచ్చింది. అమ్మకాల్లో కొత్త చరిత్ర సృష్టించింది. ‘ఇది కేవలం మరో మార్కెటింగ్ ట్రెండ్ కాదు. రిటైల్ ఇండస్ట్రీ ముఖచిత్రాన్ని మార్చే పరిణామం’ అంటున్నారు విశ్లేషకులు.చైనాలోని షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్స్ దౌయిన్, క్లైష్ ‘షాపర్‌టైన్‌మెంట్’ ట్రెండ్ దూసుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నసంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ‘షాపర్‌టైన్‌మెంట్’కు పెద్ద పీట వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫాం ‘మింత్రా’ లైవ్ వీడియో స్ట్రీమింగ్ యాప్ లాంచ్ చేసింది. 2026 కల్లా ‘షాపర్‌టైన్‌మెంట్’ అమ్మకాలు గణనీయంగా పెరగనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇ–కామర్స్ ప్రపంచంలో కస్టమర్ రివ్యూలు కొనుగోలు ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఇవి కొన్నిసార్లు గందరగోళంగా మారి ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలోకి నెడతాయి. ఇలాంటి సమయంలోనే షాపర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యత పెరుగుతుంది. – హరిత, కోజికోడ్ (కేరళ) వెబ్సైట్లలో కనిపించే సుదీర్ఘమైన సమాచారం చదవాలంటే బోర్‌గా ఉంటుంది. మనం కావాలనుకున్న వస్తువును కంటితో చూసి కొనుగోలు చేయడంలోనే మానసిక తృప్తి ఉంటుంది. – శాంతిస్వర, చెన్నై -
దేశంలో రిటైల్ పరిశ్రమ జోరు..19 శాతం వృద్ధితో
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ పరిశ్రమ తన జొరు కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలల కాలంలో 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. కరోనాకు ముందు 2019 సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ వృద్ధి కనిపించింది. క్యూఎస్ఆర్, పాదరక్షల విభాగాలు ఈ కాలంలో బలమైన పనితీరు నమోదు చేయడం ద్వారా వృద్ధికి మద్దుతుగా నిలిచినట్టు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) ప్రకటించింది. ఈ రెండు విభాగాల్లో అమ్మకాల వృద్ధి 30 శాతానికి పైగా ఉన్నట్టు తెలిపింది. ప్రాంతాల వారీగా చూస్తే తూర్పు భారత్‌లో రటైల్ పరిశ్రమ 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత ఉత్తర భారతంలో 19 శాతం వృద్ధి కనిపించగా, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో 18 శాతం మేర పెరుగుదల నమోదైంది. సౌందర్య, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ పరిశ్రమల్లో వృద్ధి 2019 ఇదే కాలంతో పోల్చినప్పుడు కేవలం 7 శాతం నమోదైనట్టు రాయ్ తెలిపింది. వినియోగదారులు తిరిగి స్టోర్లకు వచ్చి షాపింగ్ చేస్తున్నారని, ఆన్లైన్లో కొనుగోళ్లను సైతం వారు ఆస్వాదిస్తున్నారని రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ తెలిపారు. గడిచిన రెండేళ్లలో భారత రిటైల్ పరిశ్రమలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నట్టు రాయ్ చైర్మన్ బిజో కురియన్ తెలిపారు. ఆఫ్‌లైన్ రిటైలర్లు టెక్నాలజీని అందిపుచ్చుకోవడం పెద్ద ఎత్తున పెరిగినట్టు చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇతర మార్కెట్ల కంటే భారత్‌లో రిటైల్ పరిశ్రమ మెరుగైన వృద్ధిని నమోదు చేస్తుంది. ఓమ్నిచానల్ రిటైల్ (ఆఫ్‌లైన్, ఆన్లైన్) అన్నది రిటైలర్లకు సాధారణ నియమంగా మారింది’’అని కురియన్ వివరించారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) వల్ల లక్షలాది చిన్న వర్తకులు సైతం డిజిటల్ కామర్స్‌లో భాగస్వాములు అవుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
రూ.150 లక్షల కోట్లకు రిటైల్ పరిశ్రమ!
ముంబై: రిటైల్ పరిశ్రమ తిరిగి వృద్ధి క్రమంలోకి ప్రవేశించిందని, ఏటా 10 శాతం చొప్పున ప్రగతి సాధిస్తూ 2032 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లు (రూ.150 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని తాజా నివేదిక ఒకటి అంచనా వేసింది. ‘భారత్‌లో రిటైల్ పరిశ్రమ తదుపరి దశ’ పేరుతో బీసీజీ–రాయ్ (రిటైల్ అసోసియేషన్) బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఫుడ్, గ్రోసరీ, రెస్టారెంట్లు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్), కన్జ్యూమర్ డ్యురబుల్స్ విక్రయాలు కరోనా ముందు నాటి స్థాయికి కోలుకున్నట్టు.. జ్యుయలరీ, యాక్సెసరీ, వస్త్రాలు, పాదరక్షలు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకునే క్రమంలో ఉన్నాయని వివరించింది. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ వినియోగం ఆధారితంగా నడుస్తుంది. రెండేళ్ల తర్వాత వినియోగంలో వృద్ధి తిరిగి సానుకూల స్థాయికి చేరింది’’ అని బీసీజీ ఎండీ అభీక్ సింఘి తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో సంఘటిత రిటైల్ రంగం.. వృద్ధి కోసం ఆన్లైన్, ఆఫ్‌లైన్, అన్ని ఫార్మాట్లలోనూ మరింత విస్తరణపై దృష్టి సారిస్తుందని అంచనా వేసింది. దేశంలో వినియోగం కరోనాకు ముందు ఏటా 12 శాతం చొప్పున వృద్ధి చెందగా, మహమ్మారి సమయంలో మైనస్‌లోకి జారిపోయిందని, ఇప్పుడు కోలుకుని కరోనా ముందు నాటి స్థాయిని దాటినట్టు వివరించింది. ఈ కామర్స్ విభాగం 2021 నాటికి 45 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2026 నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. 2022–23లో రెండంకెల వృద్ధి ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ పరిశ్రమలో వృద్ధి దిగువ రెండంకెల స్థాయిలో ఉండొచ్చని షాపర్స్‌స్టాప్ ఎండీ, సీఈవో వేణు నాయర్ అంచనా వేశారు. కరోనా మహమ్మారికి సంబంధించిన ఆంక్షలను సడలించేయడంతో కస్టమర్లు తిరిగి ఆఫ్‌లైన్ స్టోర్లకు రావడం పెరుగుతున్నట్టు చెప్పారు. ‘‘కస్టమర్ల రాక కరోనా ముందుస్తు స్థాయికి చేరింది. గడిచిన రెండు నెలలుగా ఇది బలంగా ఉంది. రిటైల్ వ్యాపారంలో అధిక స్థాయి ఒక అంకె (8–9శాతం) లేదంటే దిగువ స్థాయి రెండంకెల్లో (11–13శాతం) వృద్ధి నమోదు కావచ్చు’’అని నాయర్ తెలిపారు. భవిష్యత్తు రిటైల్ అంతా ఓమ్నిచానల్ రూపంలోనే ఉంటుందని (ఆన్లైన్, ఆఫ్‌లైన్), అదే సమయంలో ఆన్లైన్ ఇక ముందూ కీలకంగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 డిపార్ట్మెంట్ స్టోర్లు, 20 బ్యూటీస్టోర్లు ప్రారంభించనున్నట్టు వేణు నాయర్ వెల్లడించారు. వృద్ధి కోసం స్టోర్ల విస్తరణ అన్నది తమకు కీలకమని, దానిపై దృష్టి కొనసాగిస్తామని చెప్పారు. భాగస్వామ్యాల గురించి మాట్లాడుతూ.. ‘‘ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్లతో టైఅప్ అవుతున్నాం. ఎన్నో కొత్త బ్రాండ్లు మా నిర్వహణలో ఉన్నాయి. మరిన్ని నూతన బ్రాండ్లు కూడా రానున్నాయి. మాకు సరిపోతాయని భావిస్తే కచ్చితంగా మా స్టోర్లలో వాటిని అందుబాటులోకి తీసుకొస్తాం’’అని వేణు నాయర్ వివరించారు. ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్లైన్లోనే ఎక్కువగా వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. భౌతికంగా స్టోర్లకు స్థలాల విషయంలో పరిమితి ఉంటుందని.. ఆన్లైన్లో ఈ ఇబ్బంది ఉండదు కనుక కొత్త బ్రాండ్లను ముందగా ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తున్నట్టు వివరించారు. -
ఆ రంగాలలో ఉద్యోగులకు భారీ డిమాండ్..!
ముంబై: నియామకాలు 2021 డిసెంబర్ నెలలో అంతకుముందు నెలతో పోలిస్తే 2 శాతం పెరిగాయి. రిటైల్, ఆగ్రో ఆధారిత పరిశ్రమల్లో ఉద్యోగులకు పెరిగిన డిమాండ్ ఇందుకు తోడ్పడింది. ఈ వివరాలను ‘మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్’ నివేదిక ప్రకటించింది. ఈ రెండు పరిశ్రమల్లో నియామకాలు 2020 డిసెంబర్‌తో పోలిస్తే 12 శాతం పుంజుకున్నట్టు తెలిపింది. నెలవారీగా చూస్తే డిసెంబర్లో హెల్త్‌కేర్ రంగంలో 6 శాతం మేర నియామకాలు పెరిగాయి. కరోనా కేసులు పెరగడం ఈ రంగంలో నియామకాలకు తోడ్పడింది. అలాగే, హెచ్ఆర్, అడ్మిన్ విభాగాల్లో నియామకాలు కూడా 5 శాతం పెరిగాయి. ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాల్లో 4 శాతం వృద్ధి కనిపించింది. ఆరంభ స్థాయి, మధ్యస్థాయి ఉద్యోగాలకు డిమాండ్ డిసెంబర్లో 2 శాతం పెరిగింది. ఎఫ్ఎంసీజీ, ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ రంగంలో 7 శాతం, ప్రింటింగ్, ప్యాకేజింగ్‌లో 7 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో 5 శాతం చొప్పున నెలవారీగా ఉద్యోగుల నియామకం అధికంగా నమోదైంది. 2022పై అప్రమత్త ధోరణి అన్ని రంగాల్లోనూ భవిష్యత్తు రికవరీ పట్ల 2021 డిసెంబర్ గణాంకాలు ఆశలు కల్పించాయని మాన్స్టర్ డాట్ కామ్ సీఈవో శేఖర్ గరీశ తెలిపారు. అయితే, 2022లో ఉద్యోగ నియామకాలపై మహమ్మారి ప్రభావం దృష్ట్యా మాన్స్టర్ డాట్ కామ్ అప్రమత్త ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ఇక 2021 డిసెంబర్లో రియల్ ఎస్టేట్ రంగంలోనూ నియామకాలు 6 శాతం పెరిగాయి. బయోటెక్నాలజీ, పార్మా రంగాల్లో 4 శాతం, ఐటీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లో 3 శాతం చొప్పున అధిక నియామకాలు జరిగాయి. ఈ రంగాల్లో క్షీణత టెలికం/ఐఎస్పీ రంగంలో 2021 డిసెంబర్లో 9 శాతం మేర నియామకాలు తక్కువగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, సిమెంట్, నిర్మాణం, ఐరన్/స్టీల్ రంగంలో 7 శాతం మేర నెలవారీగా తక్కువ నియామకాలు నమోదయ్యాయి. అలాగే, షిప్పింగ్, మెరైన్, లాజిస్టిక్స్, కొరియర్/ఫ్రైట్, ట్రాన్స్‌పోర్టేషన్, ట్రావెల్, టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో 1 శాతం చొప్పున క్షీణత కనిపించింది. హైదరాబాద్‌లో 4 శాతం వృద్ధి మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ 13 పట్టణాల్లో నియామకాలను పరిగణనలోకి తీసుకోగా, ఇందులో 11 పట్టణాల్లో ఆశావహ పరిస్థితి కనిపించింది. హైదరాబాద్ మార్కెట్లో 4 శాతం, బెంగళూరులో 5 శాతం, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ 4 శాతం, పుణెలో 3 శాతం, కోల్‌కతాలో, చెన్నై, కోచి, జైపూర్ నగరాల్లో 3 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ఈ పట్టణాలు అన్నీ కూడా నవంబర్ నెలకు క్షీణత చూశాయి. -
కరోనా మహమ్మారిలోనూ బలంగా నిలబడ్డ పరిశ్రమలివే
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, రిటైల్ పరిశ్రమలు కరోనా మహమ్మారి కాలంలోనూ తమ బలాన్ని చాటుతున్నాయని..భవిష్యత్తులో ఇవి మరింత విలువను సృష్టించే విధంగా అభివృద్ధి చెందగలవని డెలాయిట్–ఫిక్కీ నివేదిక అభిప్రాయపడింది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు డిజిటల్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వినియోగదారులకు చేరువ కావాలని సూచించింది. వనరులను సమకూర్చుకోవడం, ఉత్పత్తి, ప్యాకేజింగ్ విషయంలో స్థిరత్వం ఉండేలా చర్యలు అవసరమని పేర్కొంది. ఈ నివేదిక గురువారం విడుదలైంది. ‘‘వినియోగ డిమాండ్‌ను కరోనా పూర్తిగా మార్చేసింది.సరఫరా వ్యవస్థలకు సవాళ్లు విసిరింది. కొన్నింటిని సమూలంగా మార్చేసింది. వ్యాపారాలకు ఇక నూతన సాధారణ అంశాలుగా మార్చేసింది’’అని వివరించింది. డిజిటైజేషన్‌తో కిరాణాల సామర్థ్యం పెరగనుందని.. ఎఫ్ఎంసీజీ రంగానికి వృద్ధి అవకాశాలు తీసుకొస్తుందని అంచనా వేసింది. నేరుగా వినియోగదారుణ్ణి చేరుకునే మార్గాలపై కంపెనీలు దృష్టి పెట్టాలని సూచించింది. కాస్మొటిక్స్, బేబీ కేర్, వెల్నెస్ విభాగాల్లో ఈ కామర్స్ ఇకమీదట మరింత వేగంగా విస్తరిస్తుందని పేర్కొంది. చదవండి: ఉద్యోగుల ధోరణి మారింది, ఈ వస్తువులపై పెట్టే ఖర్చు భారీగా పెరిగింది -
కరోనా : మూసివేత దిశగా 25 వేల దుకాణాలు
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా లాక్డౌన్ కారణంగా దుకాణాల మూత, పరిమిత సేవల ఆంక్షల నేపథ్యంలో రీటైల్ పరిశ్రమ కుదేలైంది. దీంతో ఈ ఏడాదిలో సుమారు 25 వేల దుకాణాలు శాశ్వతంగా మూత పడనున్నాయని ఒక నివేదిక వెల్లడించింది. దేశంలోని మాల్స్, డిపార్టమెంటల్ స్టోర్లపై వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపనుందని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న మాల్ ఆధారిత చిల్లర వ్యాపారులు మరింత కుదేలవుతారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో పరిస్థితి 2019 నాటికంటే దారుణంగా వుంటుందని పేర్కొంది. రిటైల్ అండ్ టెక్ డేటా సంస్థ కోర్ సైట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ప్రధానంగా మాల్స్‌లో చాలావరకు దుకాణాలు మూత పడనున్నాయి. వీటితోపాటు డిపార్ట్మెంట్ స్టోర్లు, బట్టల దుకాణాలు తీవ్రంగా దెబ్బతింటాయని అంచనా వేసింది. 2019లో 9,800కి పైగా దుకాణాలను మూసివేసిన రికార్డును బద్దలు కొట్టేంత తీవ్రంగా ఇది ఉంటుందని నివేదించింది. అలాగే మాల్లోని ప్రధాన అద్దెదారులు స్టోర్లను మూసివేస్తే, ఇతర అద్దె దారులు కూడా తమ షాపులు మూసివేయాల్సి వస్తుందని కోర్ సైట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డెబోరా వీన్స్ విగ్ తన నివేదికలో తెలిపారు. ఈ ప్రభావంతో మూతపడే దుకాణాల సంఖ్య 20-25 వేల వరకు ఉంటుందన్నారు. మూసివేతలతో పాటు, రుణ భారంతో మరికొంతమంది చిల్లర వ్యాపారులు దివాలా అంచుల్లోకి జారుకుంటారని హెచ్చరించారు. ఈ సంవత్సరం ఇప్పటికే పదిహేను ప్రధాన రిటైలర్లు దివాలా పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. (పరిస్థితి మరింత దిగజారుతోంది: డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్-19 వ్యాప్తి కారణంగా మార్చి మధ్యలో అమెరికన్ రిటైలర్లు నష్టాల పాలయ్యారు. పలు షాపులు మూత పడ్డాయి. ప్రస్తుతం కొన్ని పరిమితులతో షాపులు తిరిగి తెరుచుకున్నప్పటికీ , లాక్డౌన్ ప్రతిష్టంభనతో చిల్లర వ్యాపారులు జూన్ 5 నాటికి సుమారు 4 వేల దుకాణాలను శాశ్వతంగా మూసివేతకు నిర్ణయించడం గమనార్హం. వందల సంఖ్యలో దుకాణాలను మూసివేసిన వరుసలో జె.సి. పెన్నీ, విక్టోరియా సీక్రెట్ , పీర్1 ఇంపోర్ట్స్ సంస్థలు ఉన్నాయి. లాక్ డౌన్ ప్రభావం స్పష్టంగా తెలియకముందే, 2020 లో 15,000 దుకాణాలు మూతపడతాయని కోర్ సైట్ మార్చిలో అంచనా వేసింది. -
రిటైల్‌కు పరిశ్రమ హోదా కావాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో రిటైల్ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని సంబంధిత కంపెనీల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ‘2017 నాటికి భారత రిటైల్ మార్కెట్ రూ.47 లక్షల కోట్ల స్థాయికి ఎగబాకవచ్చని అంచనా. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించనుంది. ఈ దృష్ట్యా పరిశ్రమ హోదా తప్పనిసరి’ అని ఉడ్‌ల్యాండ్ ఎండీ హర్కిరాట్ సింగ్ పేర్కొన్నారు. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ కుమార్ రాజగోపాలన్, టాటా గ్రూప్‌నకు చెందిన ఇన్ఫినిటీ రిటైల్ సీఈఓ, ఎండీ అజిత్ జోషి కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశీయ బ్రాండ్లకు ప్రోత్సాహం అవసరం... ‘దేశీయ బ్రాండ్లు ప్రాచుర్యంలోకి రావాలి. ఇందుకు రాయితీలను ప్రకటించాలి. ప్రధానంగా ఆహారోత్పత్తుల తయారీలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు ఇటువంటి ప్రోత్సాహం అవసరం. దేశీయ ఫుడ్ ప్రాసెసర్లకు అనలిటికల్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రాయితీలు ఇవ్వాలి. ప్రాసెస్డ్, నాన్ ప్రాసెస్డ్ ఆహారోత్పత్తులపై ఎక్సైజు డ్యూటీ తగ్గించాలి. దేశవ్యాప్తంగా ఒకే పన్ను ఉండాలి. వ్యవసాయోత్పత్తులు, పశుగణ మార్కెట్ యాక్టు 1966ను ఎత్తివేయాలి. ఆహారోత్పత్తుల ధరలు స్థిరంగా ఉండాలంటే జీఎస్టీని వెంటనే అమలు పరచాలి’ -రవీంద్ర మోడీ, ఎండీ, హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్(సూర్య బ్రాండ్) -
ఆర్థిక అజెండాలో తేడా లేదు!
కాంగ్రెస్, బీజేపీల మేనిఫెస్టోల్లో దాదాపు ఒకే రకమైన హామీలు ఒక్క రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ పైనే భిన్నస్వరాలు న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం కోసం పోటీ పడుతున్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఆర్థిక అజెండాల్లో.. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల విషయంలో మినహా పెద్ద తేడా ఏమీ లేదు. అభివృద్ధిని పెంపొదిస్తామని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తామని, ఉద్యోగాలు సృష్టిస్తామని, పన్ను వ్యవస్థను సంస్కరిస్తామని, పెట్టుబడుదారులకు స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తామని రెండు పార్టీలూ తమ మేనిఫెస్టోల్లో హామీలిచ్చాయి. ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చేందుకు, ఉద్యోగాల సృష్టికి.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లను రిటైల్ రంగం మినహా అన్ని రంగాల్లోనూ ఆహ్వానిస్తామని బీజేపీ సోమవారం విడుదల చేసిన తన మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే.. రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతిస్తూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. వ్యవసాయ ఆర్థికవ్యవస్థను మార్చివేస్తుందని, రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని కాంగ్రెస్ చెప్పింది. ఎఫ్‌డీఐకి అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని స్థిరంగా కొనసాగించటానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఇక పన్ను సంస్కరణలకు సంబంధించి.. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సరుకులు, సేవల పన్ను (జీఎస్టీ)ని తీసుకువస్తామని బీజేపీ, కాంగ్రెస్ రెండూ హామీ ఇచ్చాయి. ఇక ఆదాయ పన్ను చట్టం స్థానంలో ప్రతిపాదిత ప్రత్యక్ష పన్నుల నియమావళి (డీటీసీ)ని ఏడాది కాలంలో తీసుకువస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే.. బీజేపీ దీని గురంచి మాట్లాడలేదు కానీ పన్ను వ్యవస్థను హేతుబద్ధీకరణ, సులభీకరణ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పింది. వచ్చే పదేళ్లలో పది కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, ఆర్థికవ్యవస్థను తిరిగి 8 శాతం వృద్ధి రేటు బాటపట్టిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే.. సంఖ్యల జోలికి వెళ్లకుండానే ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. పట్టణ మౌలిక నిర్మాణాలను మెరుగుపరచే విషయమై.. 100 పట్టణ ప్రాంత సముదాయాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెప్తే.. అదే సంఖ్యలో నగరాలను నిర్మిస్తామని బీజేపీ చెప్పింది. కీలకాంశాలపై కాంగ్రెస్ - బీజేపీ మేనిఫెస్టోలు ఏం చెప్తున్నాయంటే...