న్యూఢిల్లీ: బడ్జెట్‌లో రిటైల్ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని సంబంధిత కంపెనీల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ‘2017 నాటికి భారత రిటైల్ మార్కెట్ రూ.47 లక్షల కోట్ల స్థాయికి ఎగబాకవచ్చని అంచనా. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించనుంది. ఈ దృష్ట్యా పరిశ్రమ హోదా తప్పనిసరి’ అని ఉడ్‌ల్యాండ్ ఎండీ హర్‌కిరాట్ సింగ్ పేర్కొన్నారు. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ కుమార్ రాజగోపాలన్, టాటా గ్రూప్‌నకు చెందిన ఇన్ఫినిటీ రిటైల్ సీఈఓ, ఎండీ అజిత్ జోషి కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
దేశీయ బ్రాండ్లకు ప్రోత్సాహం అవసరం...
‘దేశీయ బ్రాండ్లు ప్రాచుర్యంలోకి రావాలి. ఇందుకు రాయితీలను ప్రకటించాలి. ప్రధానంగా ఆహారోత్పత్తుల తయారీలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు ఇటువంటి ప్రోత్సాహం అవసరం. దేశీయ ఫుడ్ ప్రాసెసర్లకు అనలిటికల్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రాయితీలు ఇవ్వాలి. ప్రాసెస్డ్, నాన్ ప్రాసెస్డ్ ఆహారోత్పత్తులపై ఎక్సైజు డ్యూటీ తగ్గించాలి. దేశవ్యాప్తంగా ఒకే పన్ను ఉండాలి. వ్యవసాయోత్పత్తులు, పశుగణ మార్కెట్ యాక్టు 1966ను ఎత్తివేయాలి. ఆహారోత్పత్తుల ధరలు స్థిరంగా ఉండాలంటే జీఎస్టీని వెంటనే అమలు పరచాలి’
-రవీంద్ర మోడీ, ఎండీ, హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్(సూర్య బ్రాండ్)
రిటైల్‌కు పరిశ్రమ హోదా కావాలి
Published Tue, Jul 8 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement