retired police officer
-
శిఖరాలపై శిఖామణి
సాక్షి, అమరావతి: గట్టి సంకల్పం ఉంటే వయసు అడ్డంకి కాదు.. దానికి శరీర దారుఢ్యం తోడైతే.. రాజా శిఖామణి అవుతారు. ఆరు పదుల వయసు దాటినా పర్వతాలను అవలీలగా ఎక్కేస్తారు. 63 ఏళ్ల వయసున్న ఈ పెద్దాయన అందరికీ ఆశ్చర్యం కలిగించే పనులు చేస్తుంటారు. 58 ఏళ్ల వయసులో విజయనగరం నుంచి విశాఖపట్నం వరకూ 50 కిలోమీటర్లు అలవోకగా పరిగెత్తారు. తాజాగా 63 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి శభాష్ అనిపించుకున్నారు రాజా శిఖామణి. విశ్రాంత పోలీస్ అధికారి అయిన ఆయన ఎవరెస్ట్ ప్రయాణం విజయవంతంగా ముగించుకుని విజయవాడ వచ్చారు. యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న రాజా శిఖామణి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన జీవన ప్రస్థానం, ఎన్నో ఆపదలతో నిండిన పర్వతారోహణ విశేషాలు ఆయన మాటల్లోనే.. గుంటూరు నుంచి కాలిఫోర్నియా వరకు.. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమళ్లపాడు మా స్వగ్రామం. నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. ఒంగోలులో స్థిరపడ్డారు. అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ (ఏబీఎం) హైస్కూల్లో చదువుకున్నాను. డిగ్రీ వరకూ ఫుట్‌బాల్, ఆ తర్వాత అథ్లెటిక్స్ వైపు వెళ్లాను. తొలి ప్రయత్నంలోనే 1977లో ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించి యూనివర్సిటీ చాంపియన్‌గా నిలిచాను. తర్వాత ఎస్ఐగా ఎంపికయ్యాను. అనంతపురంలో పోలీస్ శిక్షణ పూర్తిచేసి హైదరాబాద్‌లో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్గా తొలిపోస్టింగ్ తీసుకున్నా. ఇంటెలిజెన్స్, సివిల్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేసి 2016లో విజయనగరం పోలీస్ శిక్షణ కేంద్రానికి ప్రిన్సిపాల్ అయ్యాను. తరువాత ఆరు నెలలు అనంతపురం పీటీసీలో ప్రత్యేకాధికారిగా సేవలందించాను. 5 వేల మంది ఎస్ఐలు, 150 మంది డీఎస్పీలు, 55 మంది ఐపీఎస్‌లకు శిక్షణనిచ్చాను. ఇండియన్ పోలీస్ మెడల్‌తో పాటు అనేక అవార్డులు లభించాయి. కాలిఫోర్నియాలోని రెక్లెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకం, రాష్ట్ర పోలీస్ చిహ్నంతో శిఖామణి మావోయిస్టులకు రెవెన్యూ అధికారినని చెప్పా స్టాండర్డ్ ట్రైనింగ్ కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండో శిక్షణ తీసుకోవడంతో అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, మర్రి చెన్నారెడ్డి, హోం మంత్రి మైసూరారెడ్డిలకు భద్రతాధికారిగా పని చేశాను. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఎప్పుడు మన రాష్ట్రానికి వచ్చినా ఆయన రక్షణ బాధ్యత నాకే అప్పగించేవారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో సహా ఏడుగురు ఐఏఎస్‌లను దారగడ్డలో మావోయిస్టులు కిడ్నాప్ చేసినప్పుడు రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకుని వారితో చర్చలు జరిపాను. మూడు దేశాలు..మూడు పర్వతాలు పర్వాతారోహణం నా జీవితంలో భాగంగా మారిపోయింది. హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ నేతృత్వంలో నాతో కలిపి ఆరుగురు సభ్యుల బృందం గత నెల విజయవాడ నుంచి బయలుదేరి వివిధ మార్గాల ద్వారా లుక్లాకు చేరుకున్నాం. అక్కడి నుంచి అందరిలా హెలికాప్టర్లో వెళ్లకుండా 70 కిలోమీటర్లు అదనంగా నడిచి మొత్తం 6 వేల మీటర్ల ఎవరెస్ట్ పర్వతాన్ని (బేస్ క్యాంప్ వరకూ) ఏడు రోజుల్లో అధిరోహించాను. నా వయసున్న భారతీయులెవరూ పర్వతారోహణ చేయలేదు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన, ప్రమాదకరమైన టాంజానియా దేశంలోని కిలిమంజారోను ఎక్కినపుడు నా వయసు 62 ఏళ్లు. దీనికి ఏడాది ముందు యూరప్‌లోనే ఎత్తయిన రష్యాలోని మౌంట్ ఎల్బ్రోస్ పర్వతాన్ని అధిరోహించాను. దృఢ సంకల్పం వస్తుంది అత్యంత కష్టమైన పర్వతారోహణను అలవోకగా చేయడానికి కారణం చిన్నప్పటి నుంచీ శరీర దృఢత్వంపై పెట్టిన శ్రద్ధ, కఠోర శ్రమ, ఆహార అలవాట్లు. మానసికంగానూ బలంగా ఉండాలి. పర్వతారోహణలో ఎక్కడా సరైన ఆహారం దొరకదు. పైకెళుతున్నకొద్దీ ఒంట్లో శక్తి క్షీణిస్తుంది. మైనస్ 27 డిగ్రీల వద్ద అడుగు ముందుకు పడదు. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఏమాత్రం పట్టు జారినా లోయల్లో పడిపోతాం. శవం కూడా దొరకదు. చాలా మంది యువకులే మధ్యలో వెనక్కి వచ్చేస్తుంటారు. ముందుకెళ్లడమే తప్ప వెనక్కి వెళ్లాలన్న ఆలోచనే నాకు రాదు. పర్వతారోహణ వల్ల విశాల దృక్పథం పెరుగుతుంది. ఓర్పు, సహనం వంటి లక్షణాలు అలవడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో జీవితంలో ఏదైనా సాధించగలమనే నమ్మకం వస్తుంది. -
దారుణం: కొడుకులపై తండ్రి కాల్పులు.. ఒకరి మృతి
ముంబై: ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తన ఇద్దరు కొడుకులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ కొడుకు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. పాటిల్ ఐరోలి సెక్టార్ 2 ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపారు. అయితే తండ్రితో గొడవల కారణంగా కొడుకులు విజయ్, సుజయ్ వేరుగా నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సోమవారం సాయంత్రం పాటిల్ తన కుమారులను ఓ విషయంపై మాట్లాడటానికి తన ఇంటికి పిలిచినట్లు తెలిపారు. అయితే తండ్రీ, కొడుకుల మధ్య కారు భీమాపై పెద్ద గొడవ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో పాటిల్ తన పిస్టల్ తీసుకొని తన ఇద్దరు కొడుకులపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక చికిత్స కోసం ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్క్నన్నారు. అయితే విజయ్‌కి తీవ్రగాయాలు కావడంతో మరణించినట్లు తెలిపారు. కాగా అతని సోదరుడు జయ్‌కు స్వల్ప గాయాల కావడంతో ప్రాణాపాయం తప్పిందని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఈ రూ. 2 నాణెం ఉంటే లక్షాధికారి అయిపోవచ్చా? -
చేటు తెచ్చిన సివిల్ పంచాయితీ
ఒంగోలు: సివిల్ వ్యవహారం చేటు తెచ్చింది. ఇందుకు కారకులుగా భావిస్తూ విశ్రాంత పోలీసు అధికారి ఒకరిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయగా కేసు విచారించిన సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. పోలీసు శాఖలో అదనపు ఎస్పీగా పనిచేసి రిటైర్ అయిన నరహరి.. దాసరి మాల్యాద్రి అనే వ్యక్తికి కొంత మొత్తం అప్పుగా ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఈనెల 18న మాల్యాద్రి కుమారుడ్ని ఒంగోలు రైల్వేస్టేషన్ వద్దకు పిలిపించారు. అక్కడ నుంచి కారులో రామాయపట్నంకు చేరుకుని ఆయన తండ్రి మాల్యాద్రితో నేరుగా తాలూకా పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. నరహరి ఇచ్చిన ఫిర్యాదుపై సీఐ లక్ష్మణ్ ఇరువర్గాలతో మాట్లాడారు. ఈ క్రమంలో ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన మాల్యాద్రి తిరిగి రాలేదు. దీంతో అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. ఉదయాన్నే మాల్యా ద్రి పెళ్లూరు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై మృతదే హమై కనిపించారు. డబ్బులు చెల్లించాలంటూ మాన సికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడంటూ మృతుడి బంధువులు ఎస్పీకి ఐ క్లిక్‌లో ఫిర్యాదు చేశారు. అదే విధంగా గురువారం జీఆర్పీ పోలీసులకు శవ పంచనామా సందర్భంగా కూడా నరహరి స్టేషన్‌కు తీసుకువెళ్లి తమను కులం పేరుతో దూషించడం,డబ్బులు ఇవ్వా లంటూ మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడి చేశా రని, ఈ విషయంలో తాలూకా సీఐ లక్ష్మణ్ కూడా తమను బెదిరించారంటూ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి శవ పంచనామా అనంతరం లా అండ్ ఆర్డర్ పోలీసులకు జీఆర్పీ పోలీసులు బదిలీ చేస్తున్న నేపథ్యంలో ప్రాథమికంగా తాలూకా సీఐ లక్ష్మణ్‌ను వీఆర్‌కు బదిలీ చేసి, సస్పెండ్ చేయడంతోబాటు నరహరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఎస్పీ సిఫార్సు మేరకు సీఐ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ జె.ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మణ్ మీద వచ్చిన ఆరోపణలపై ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ను విచారణాధికారిగా నియమించారు. -
రిటైర్మెంట్ అయ్యాక మళ్లీ పెళ్లి
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి, భార్య బతికుండగానే మరో పెళ్లి చేసుకున్న సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. పట్టణ శివారులోని వీవర్స్ కాలనీలో నివసిస్తున్న ఆనంద్ (65) రెండోపెళ్లి చేసుకున్న ఘనుడు. పోలీస్ అధికారిగా సేవలందించి రిటైర్డ్ అయిన ఆనంద్ 37 సంవత్సరాల క్రితం శోభ అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తదనంతరం శోభాను అనేక విషయాల్లో చిత్రహింసలకు గురిచేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. వీరికి ఒక కూతురు ఉండగా ఆమెకు వివాహమై ఒక కూతురు కూడా ఉంది. అయితే ఆనంద్ కుమార్తె ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆనంద్ తనకు వంశోద్ధారకుడు కావాలని చెప్పి శోభ ఎంత చెప్పినా వినకుండా కొన్ని నెలల క్రితం చెప్పాపెట్టకుండా మరో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శోభ నెలమంగల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఆనంద్‌పై చర్యలు తీసుకోవడంలేదని బాధితురాలు మీడియా ముందుకు వచ్చింది. తనకు న్యాయం చేయాలని డిమాండు చేస్తోంది. -
ఖాకీ జాగా.. రియల్టర్ పాగా!
విశ్రాంత పోలీసు అధికారి స్థలంపై కబ్జాకోరుల కన్ను స్థలాన్ని చదును చేసిన వైనం మరో 20 మంది ప్లాట్ల స్వాహాకు యత్నం భీమారం : వరంగల్ మహానగరం పరిధిలో పలువురు రియల్టర్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేయడమే లక్ష్యంగా వారు పావులు కదుపుతున్నారు. దీంతో బాధితులు గుండెలు బాదుకొని లబోదిబోమనాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. నగరానికి చెందిన ఓ రియల్టర్ ఇటీవల గోపాలపురంలోని సర్వే నంబర్ 110లోని ఓ విశ్రాంత పోలీసు అధికారికి చెందిన భూమిని కబ్జా చేశాడు. ఎవరి అనుమతి తీసుకోకుండా ఎంచక్కా చదును కూడా చేసేశాడు. పోలీసు విభాగంలో పనిచేసిన వారి స్థలాలకే భద్రత కొరవడిన ప్రస్తుత పరిస్థితుల్లో, సామాన్యుల ఆస్తుల రక్షణ ప్రశ్నార్ధకంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గోపాలపురంలోని సర్వే నంబర్ 110లో కబ్జాకు గురైన స్థలం వరంగల్ నగరానికి చెందిన ఎం.భిక్షపతిది. ఆయన హైదరాబాద్‌లో సీఐ హోదాలో విధులు నిర్వర్తించి, ఇటీవల పదవీ విరమణ పొందారు. 24 ఏళ్ల క్రితం మరో 24 మందితో కలిసి గోపాలపురంలోని ఓ వెంచర్లో భిక్షపతి ప్లాట్లు కొన్నారు. భూమి కొన్నవాళ్లు చాలామంది ఇప్పటికే ఇళ్లు కట్టుకోగా, కొంత స్థలం ఖాళీగా ఉంది. ఆ ఖాళీ స్థలాన్నే రియల్టర్ చాపలా చుట్టేసి స్వాహా చేసే ప్రయత్నం చేశాడని భిక్షపతి ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అరుునా రియల్టర్‌పై ఎలాంటి చర్యా తీసుకోకపోవడంతో.. నగర పోలీస్ కమిషనర్(సీపీ) సుధీర్‌బాబును కలిసి ఫిర్యాదు చేశారు. గోపాలపురంలోని తమ వెంచర్‌కు చెందిన 1.30 ఎకరాల భూమి కబ్జాలో ఉందని భిక్షపతి సహా బాధితులంతా సీపీకి తమ గోడు వెల్లబోసుకున్నారు. పైసా..పైసా కూడగట్టి భూమి కొంటే రియల్టర్ ఆ భూమిని గద్దలా తన్నుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీపీ స్పందించి.. భూకబ్జాకు యత్నిస్తున్న రియల్టర్‌పై రౌడీషీట్ తెరవాలని స్థానిక పోలీసులను ఆదేశించినట్లు సమాచారం. ఆ రియల్టర్ కబ్జా చేయదల్చుకున్న స్థలానికి వస్తే , వెంటనే అరెస్ట్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. -
విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి కాల్చివేత
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లా అషముజే గ్రామంలో మంగళవారం రాత్రి విశ్రాంత సీనియర్ పోలీసు ఉన్నతాధికారి బషీర్ అహ్మద్ దార్‌పై వేర్పాటువాద గెరిల్లాలు విచక్షరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారని పోలీసులు ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. మోటార్ సైకిల్‌పై వచ్చిన నిందితులు బషీర్‌పై తుపాకీ గుళ్ల వర్షం కురిపించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు.