శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లా అషముజే గ్రామంలో మంగళవారం రాత్రి విశ్రాంత సీనియర్ పోలీసు ఉన్నతాధికారి బషీర్ అహ్మద్ దార్పై వేర్పాటువాద గెరిల్లాలు విచక్షరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారని పోలీసులు ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు.
మోటార్ సైకిల్పై వచ్చిన నిందితులు బషీర్పై తుపాకీ గుళ్ల వర్షం కురిపించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు.