తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
ఈరోడ్ : ఓ రిటైర్డ్ టీచర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 60 కాసుల బంగారు ఆభరణాలు, రూ.20 లక్షల నగదును గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయారు. ఈ సంఘటన తమిళనాడులోని ఈరోడ్‌లో సత్యమంగళం రాజీవ్‌నగర్‌లో చోటుచేసుకుంది. రాజీవ్‌నగర్‌కు చెందిన జోసెఫ్(62) కుటుంబసభ్యులతో కలిసి చెన్నైకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఆయన ఇంటికి తిరిగివచ్చారు. ఇంటికి రాగానే ముందు తలుపులు పగులగొట్టి సంఘటనను గుర్తించిన జోసెఫ్ షాక్‌కు గురయ్యారు. ఏమి జరిగిందో అని హడావుడిగా ఇంట్లోకి వెళ్లి చూడగా, అల్మారాలో దాచిపెట్టిన 60 కాసుల బంగారు ఆభరణాలు, రూ. 20 లక్షల నగదు చోరీకి గురైనట్టు గుర్తించారు. వెంటనే జోసెఫ్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు , స్పెషల్ టీమ్స్‌తో రంగంలోకి దిగారు.
మహిళ మెడలో చైన్ చోరీ
ఈ గ్రామానికి 40 గ్రామానికి దూరంలో ఉన్న సిరువలూర్ గ్రామంలో మరో సంఘటన చోటుచేసుకుంది. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పార్వతి అనే మహిళ మెడలో 9 కాసుల గోల్డ్ చైన్ లాక్కొని పారిపోయారు. పార్వతి గత సాయంత్రం టూ-వీలర్‌పై సిరువలూర్ గ్రామ సమీపంలో వెళ్తూ ఉండగా.. అటుగా మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె వెహికిల్‌కు డాష్ ఇచ్చారు. కిందపడిపోయిన ఆమె మెడలోంచి ఓ వ్యక్తి చైన్‌ను లాగగా.. మరోవ్యక్తి బైక్‌ను వేగంగా పోనిచ్చాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.