సూర్య 'రెట్రో' సినిమా.. అలరిస్తున్న టీజర్
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ఈసారి అదిరిపోయే మాస్ కమ్ బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. గతనెలలో 'కంగువ' (Kanguva Movie) మూవీతో వచ్చాడు. ప్రేక్షకులు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే 'బాహుబలి'లా తీద్దామనుకున్నారు కానీ మూవీ బెడిసికొట్టేసింది. ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజుతో ఓ మూవీ చేశారు. దానికి 'రెట్రో' (Retro Movie) అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)డీ గ్లామర్ లుక్‌తో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డేతో సూర్య మాట్లాడుతుంటాడు. నీతో ప్రేమ కోసం రౌడీయిజం, గుండాయిజం అన్ని వదిలేస్తున్నానని.. మీ నాన్న దగ్గర పనిచేయడం కూడా మానేస్తానని చెప్పడం బాగుంది. ఓవైపు ఇంటెన్స్ యాక్షన్ చూపిస్తూనే.. ప్రేమకథ కూడా ఉందనే విషయాన్ని టీజర్ చెప్పకనే చెప్పింది. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు.కార్తిక్ సుబ్బరాజు సినిమాలన్నీ సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంటాయి. సూర్యతో చేసిన 'రెట్రో' టీజర్ చూస్తుంటే హిట్ కళ కనిపిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే సూర్యకి హీరోగా కమ్ బ్యాక్ దొరుకుతుంది. ఎందుకంటే గత మూడేళ్లుగా 'కంగువ' కోసం పనిచేశారు. కానీ ఫలితం అనుకున్నట్లు రాలేదు. ఇప్పుడు 'రెట్రో' హిట్ కావడం అనేది సూర్య కెరీర్‌కి చాలా కీలకం. ప్రస్తుతానికి తమిళ టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో మిగతా భాషల టీజర్స్ విడుదల చేస్తారేమో?(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)