‘రాజన్నా.. ఇదేం లెక్క!
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల) : జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన దుబ్బరాజన్న ఆలయానికి ఈ ఏడాది భారీగా ఆదాయం సమకూరింది. అయితే అదేస్థాయిలో ఖర్చులూ పెరిగిపోయాయి. ఈ వ్యవహారం ఆలయంలో ఇటీవల జరిగిన సమావేశంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆదాయం భారీగానే వచ్చినా.. ఎప్పుడూ చిల్లిగవ్వ మిగలేదికాదని, ఏయేడు ఖర్చును బాగా తగ్గించి స్వామివారి పేరున రూ.8 లక్షలు బ్యాంక్లో డిపాజిట్ చేశామని ఆలయ అధికారులు చెబుతున్నా.. ఆలయ ఆదాయ, వ్యయాలపై వారం క్రితం జరిగిన సమావేశంలో విడుదల చేసిన కాపీలను భక్తులు జిరాక్స్తీసి.. ప్రజలకు పంచుతూ.. ఖర్చులు ఇలా ఉంటే.. ఆలయం ఎలా అభివృద్ధి సాధిస్తుందంటూ ప్రచారం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
ఇదీ ఆలయ చరిత్ర
జిల్లా కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో.. సారంగాపూర్ మండలం పెంబట్ల–కోనాపూర్ గ్రామ సరిహద్దుల్లో ఉంటుందీ ఆలయం. 1982లో ఈ ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి చేరింది. ఇసుకదిబ్బపై స్వయంభూగా వెలిసిన ఆలయం కావడంతో అనతికాలంలో ప్రసిద్ధి చెందింది. రూ.40 వేల ఆదాయంతో ప్రారంభమైన ఆలయ ప్రస్థానం.. ఇప్పుడు రూ.కోటికి చేరింది.
2017–18 ఆదాయ, వ్యయాలు
స్వామివారికి భక్తుల ద్వారా మొత్తం ఆదాయం రూ. 84,87,887గా వచ్చింది. ఇందులో నికర ఆదాయం రూ.74,75,191. ప్రారంభ బ్యాంక్ నిలువ రూ.10,12,696. స్వామివారి హుండీ ద్వారా రూ.27,48,953, కోడెమొక్కు ద్వారా రూ. 11,47,650, అభిషేకం ద్వారా రూ.3,34,000, అన్నపూజ ద్వారా 84వేలు, కుంపటి 46,620, గజశూలం 13,860, గదుల కిరాయిద్వారా రూ.20,500 వచ్చింది. ప్రత్యేకాభిషేకం 80,800, కేశఖండనం ద్వారా రూ.35,010, పెద్ద వాహనపూజ రూ.17,800, ద్విచక్రవాహన పూజ రూ.27,100, వివాహాల ద్వారా రూ.8,848, ఆంజనేయ, నవగ్రహపూజల ద్వారా రూ.3 వేలు, గండదీపంతో రూ.98,740, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.3,40,350, శావతో రూ.10వేలు, లడ్డూప్రసాదంతో రూ.6,58,805, పులిహోరతో రూ.4,54,560, నిజకోడే మొక్కు రూ.2,232, స్వామివారి కల్యాణం రూ.1,37,500, కొబ్బరికాయలు, పూజసామగ్రి వేలం ద్వారా రూ.5.50లక్షలు, తలనీలాలు రూ.2,05,555, కొబ్బరిముక్క ల వేలం రూ.1.75లక్షలు, కోడెల వేలం రూ. 1,31,378, కల్యాణకట్నాలు రూ.33, 940, బ్యాం క్ వడ్డీలు రూ.55,637, విదేశీ కరెనీ రూ.12,150, ఇతర ఆదాయం రూ.41,203గా సమకూరింది.
ఖర్చులు ఇలా..
స్వామివారి ఆదాయం నుంచి మొత్తం రూ. 84,87,887 ఖర్చు చేశారు. ఇందులో వ్యయం రూ.76,29,139, ముగింపు నగదు నిలువ రూ. 1,57,650, ముగింపు బ్యాంక్ నిలువ రూ. 7,01, 103గా పేర్కొన్నారు. పద్దుల వారీగా పరిశీలిస్తే ..
అర్చక, సిబ్బంది వేతనాలు రూ.14,28,633, నివేదనకు రూ.98,870, ప్రింటింగ్, స్టేషనరీ, పోస్టేజీ రూ.79,727, కరెంటు బిల్లు, సామగ్రి, మరమ్మతు రూ.1,75,069, మహాశివరాత్రి జాతరకు రూ.9,46,198, ఇతరాలు రూ.11,09,868, కంట్రిబూషన్ కింద రూ.11,08,414, ఆరోగ్యం, పారిశుధ్యం రూ.87,385, మైనర్ రిపేర్స్ రూ. 1,80,542, ఫర్నిచర్ రూ.26,400, నాయీబ్రాహ్మణ వారి ప్రతిఫలం రూ.4,500, ప్రసాదం తయారీ రూ.6,90,180, రుద్రాభిషేకం రూ.12,055, ఏడా ది పండగల ఖర్చు రూ.2,24, 023, అధికారుల టీఏ, డిఏ రూ.12,410, రంగులకు రూ. 1,21,337, అన్నదానం రూ. 2,92,146, ప్రచార ఖర్చు రూ.1,66,679, వీఐపీలు రూ.29,710, ఎఫ్డీఆర్ రూ.8లక్షలు, కోర్టు ఖర్చులు రూ.10వేలు, కోనేరురిపేర్, నిర్వహణకు రూ.38,450, ధర్మకర్తల అలవెన్స్ రూ.1.10లక్షలు, లాకర్కిరాయి రూ.8,576, చౌల్ట్రీ రిపేర్స్ రూ.40వేలు, చలవ పందిళ్లు, టెంట్లు రూ.1,98,020, పూజ సామగ్రి రూ.79,738, కొడెల నిర్వహణ రూ.39,940, బ్యాంక్ చార్జీలు రూ.3,169, లేబర్ చార్జీలు రూ.56,230, ధార్మిక కార్యక్రమాలు రూ.29,275, గ్రాట్యూటీ రూ.2 లక్షలు ఖర్చు చేశారు.