revenue deportment
-
‘ప్రక్షాళన’ ఏది?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ–రికార్డుల ప్రక్షాళనలో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటుంటే ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారని ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లాల కలెక్టర్లపై మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో వీఆర్ఓలు, తహసీల్దార్లు అక్రమాలకు పాల్పడుతుంటే మీరెందుకు చర్యలు తీసుకోలేకపోయారని కలెక్టర్లను సూటిగా ప్రశ్నించారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలపైనా కలెక్టర్లు పట్టు సాధించలేకపోతే ఎలాగంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ ప్రక్షాళనపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులొస్తున్నా.. మీరేం చేస్తున్నారంటూ కలెక్టర్లకు క్లాస్ పీకారు. మంగళవారం ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సుదీర్ఘంగా సమావేశమైన సీఎం.. కొత్త రెవెన్యూ చట్టం తయారీపై సలహాలను స్వీకరించడంతో పాటు కొత్త పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఉదయం 11.45 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 8 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ పలుమార్లు కలెక్టర్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయి అధికారుల పనితీరుపై కలెక్టర్ల పర్యవేక్షణ లోపించిందని, పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి 50 రోజులైనా అమలు చేయడంలో ఎలాంటి ప్రగతీ లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి సంబంధించి సీఎంవో ఎలాంటి ప్రకటనా జారీ చేయలేదు. వీఆర్ఓ, తహసీల్దార్ల అధికారాలకు చెక్ గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), తహసీల్దార్ల అధికారాలకు కత్తెర పడడం ఖాయంగా కనబడుతోంది. పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యుటేషన్లు, విరాసత్ వంటి అవసరాల కోసం వచ్చే రైతులు, సామాన్య ప్రజలను.. క్షేత్ర స్థాయిలో వీఆర్ఓలు, తహసీల్దార్లు లంచాల కోసం తీవ్ర వేధింపులకు గురిచేయడం నిత్యకృత్యంగామారిన నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలిసింది. కొత్త రెవెన్యూ చట్టం లక్ష్యాలు, ప్రాధాన్యతపై సీఎం కేసీఆర్.. కలెక్టర్లసమావేశంలో వివరిస్తున్న సందర్భంగా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. గ్రామ రెవెన్యూ రికార్డుల సంరక్షకులుగా ఉండాల్సిన వీఆర్వోలే వాటిని తారుమారు చేసి ఒకరి భూములను మరొకరికి కట్టబెట్టుతున్న వైనంపై ఆయనఆగ్రహం వ్యక్తం చేశారు. భూ–రికార్డుల పరిరక్షణతో పాటు భూములకు సంబంధించిన అన్ని రకాల బాధ్యతల నుంచి వీఆర్ఓలను తప్పించాలనే నిర్ణయానికి సీఎం వచ్చినట్లు సమాచారం. కొత్త రెవెన్యూ చట్టం వచ్చాక వీఆర్ఓలు భూమియేతర వ్యవహారాలకే పరిమితం కానున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాల జారీకి విచారణ జరిపే బాధ్యతలను మాత్రమే వీఆర్వోలకు కట్టబెట్టాలని సర్కారు యోచిస్తోంది. తహశీల్దార్ల అధికారాలకు సైతం ప్రభుత్వం కోత పెట్టి జాయింట్ కలెక్టర్లకు కీలక అధికారాలను అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం ప్రగతిభవన్లోముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన సమావేశానికి హాజరైన కలెక్టర్లు, అధికారులు సెప్టెంబర్ 10న మళ్లీ పిలుస్తా కొత్త పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాలు, హరితహారం కార్యక్రమం అమలు పురోగతిని సమీక్షించేందుకు సెప్టెంబర్ 10న జిల్లా కలెక్టర్లతో మరోసారి సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఆలోగా మంచి పురోగతి సాధించి రావాలని కలెక్టర్లకు ఆదేశించినట్లు సమాచారం. నేడు కోమటిబండకు సీఎం,కలెక్టర్లు సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండను సీఎం కేసీఆర్‌తోపాటుగా అన్ని జిల్లాల కలెక్టర్లు సందర్శిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీఎం నియోజకవర్గంలో గజ్వేల్‌లో హరితహారం కింద చేపట్టిన కార్యక్రమాలను జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో కలిసి సీఎం పరిశీలిస్తారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి అధికారుల బృందం బయలుదేరి గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ సహా వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి సాయంత్రానికి ఈ బృందం నగరానికి చేరుకుంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 60రోజుల పచ్చదనం, పరిశుభ్రత కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా హరితహారం కింద సీఎం నియోజకవర్గంలో అమలుచేసిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలను గురించి ఈ పర్యటనలో వివరిస్తారు. గజ్వేల్‌లో గత మూడు, నాలుగేళ్లలో సహజ అడవి పునరుద్ధరణ (అటవీ భూముల సంరక్షణ) చర్యలు విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని గ్రామాల్లో హరితహారం కింద చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడం, దాదాపు మూడేళ్ల క్రితం కోమటిబండ వద్ద మిషన్ భగీరథ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినపుడు ‘అవెన్యూ ప్లాంటేషన్’కింద రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో వాటిని ఈ బృందం పరిశీలించనుంది. గతంలోనూ సీఎం సూచనల మేరకు కలెక్టర్ల బృందం కోమటిబండను సందర్శించి అక్కడ హరితహారం, ఇతర కార్యక్రమాలను పరిశీలించి వచ్చిన సంగతి విదితమే. ఇక సత్వర రెవెన్యూ సేవలు కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో భాగంగా అంశాలవారీగా కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు, సలహాలను సీఎం స్వీకరించారు. అవినీతి లేకుండా రెవెన్యూ వ్యవహారాలు ఎలా నడపాలి? రైతులకు సత్వర సేవలు ఎలా అందించాలి? భూ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత 24 గంటల్లోపే రైతు ఇంటికి పాస్‌బుక్ వెళ్లాలంటే ఏం చేద్దాం? అన్న అంశాలపై కలెక్టర్ల అభిప్రాయాలను సేకరించారు. ఈ క్రమంలో రెవెన్యూకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ల చేతికి ప్రశ్నావళిని ఇచ్చి సమాధానాలను రాబట్టుకున్నట్లు తెలిసింది. -
‘రెవెన్యూ’ లీలలు..!
కోదాడ: రెవెన్యూ అధికారుల లీలలకు ఈ ఘటన పరాకాష్ట. చనిపోయిన వ్యక్తి పేరుతో కొందరు అగ్రిమెంట్ సృష్టించగా, సదరు అక్రమార్కులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. ఇంకేముంది దానిని సాదాబైనామా పేరుతో క్రమబధ్వీకరించారు. అంతేకాకుండా మరణించిన వ్యక్తి వారసులకు తెలియకుండానే అక్రమార్కులకు పట్టాదారుపాస్ పుస్తకాలూ జారీ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న వారసులు ఇదేమిటని ప్రశ్నిస్తే తప్పు జరిగింది. మీరు భూమి మీదకు వెళ్లండని ఉచిత సలహా ఇస్తున్నారు. మరోపక్క భూమి మీద ఉన్న వారిని వారు వస్తే చూసుకోండని రెచ్చగొడుతున్నారని పట్టాదారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత అధికారులు గతంలో జరిగింది దానికి మేము ఏం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో అసలు భూ యజమానులు తమ భూమికోసం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. అసలు విషయం ఏమిటంటే... పూర్వం నడిగూడెం మండలంలో ఉండి ప్రస్తుతం అనంతగిరి మండల పరిధిలోకి వచ్చిన త్రిపురవ రంగ్రామానికి చెందిన కెవిఎల్.నర్సిహారావు(లక్ష్మప్ప)కు అదే గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నం బర్లు 15, 21లలో 3 ఎకరాల భూమి ఉంది. ఈయన 09–01 2009న మృతిచెందాడు. విచిత్రమేమిటంటే ఈయన 20–05–2010న అగ్రిమెంట్ రాసినట్లు ఓ కాగితాన్ని సృష్టించారు. దీని ఆధారంగా ఇటీవల సాదాబైనామాల క్రమబద్ధీకరణ లో భాగంగా రెవెన్యూ అధికారులు సదరు ఫోర్జరీ చేసిన వ్యక్తులతో కుమ్మక్కయ్యారు. వెనుకాముం దు విచారణ కూడా చేయకుండా తప్పడు రికార్డుతో సదరు వ్యక్తుల పేరిట పట్టామార్పిడి చేశారు. వాస్తవానికి సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలంటే అగ్రిమెంట్ రాసిన వ్యక్తులకు సమాచా రం ఇవ్వాల్సి ఉంటుంది. అతను ఒక వేళ మరణిస్తే అతని వారసులకు సమాచారం ఇచ్చి ఎలాం టి అభ్యంతరం లేకపోతేనే దాన్ని క్రమబద్ధీకరించా ల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అవేవి జరగలేదు. కా రణం అధికారుల కాసుల కక్కుర్తేనని తెలుస్తోంది. భూ రికార్డుల శుద్ధీకరణలో బయటపడిన అక్రమం 2017లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూరి కా ర్డుల శుద్ధీకరణ కార్యక్రమంలో కేవీఎల్ నర్సిం హా రావు వారసులు తమ భూములకు పట్టాదారు పా స్పుస్తకాల కోసం దఖాస్తు చేయగా అప్పటికే ఆ భూమి ఇతరుల పేరుమీదకు మారడంతో లబోది బోమంటూ అధి కారులకు ఫిర్యాదు చేశా రు. కానీ ఈ విషయంలో కావాలనే ఇతరులకు సాయం చేసిన అధికారులు అసలు పట్టా దా రుల గోడు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దరఖాస్తుల మీద దరఖాస్తులు పెడుతున్నా కాళ్లు అరిగేలా కా ర్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. మరో పక్క అక్రమార్కులు మాత్రం నిర్భయంగా ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు సాయాన్ని తీసుకొంటున్నారు. అధికారులే అక్రమార్కులను రెచ్చగొట్టి తమ భూముల మీదకు తోలుతున్నారని, మీరే దు న్నుకోమని వారికి చెబుతూ , «ఫిర్యాదు చెయ్యండి విచారిస్తామని మాకు చెబుతూ డబుల్ గేమ్ ఆడుతున్నారని పట్టాదా రులు ఆరోపిస్తున్నారు. ఇలానే మరికొన్ని... ఇదే గ్రామ రెవెన్యూ పరిధిలో మరికొన్ని సర్వే నం బర్లలో కూడా వీరు అక్రమ పట్టామార్పిడి చేసిన ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అసలు ప ట్టాదారులు అడిగితే తమ ఉన్నతాధికారి చెయ్యమన్నాడు... మేము చేశాం.. మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు. ఇలా సుమారు 20ఎకరాల్లో వీరు అక్రమాలకు పాల్పడి రూ.లక్షలు దొడ్డిదారిన దోచుకున్నారని దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇంటి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తీవ్ర అన్యాయం చేశారు త్రిపురవరం గ్రామంలో మాకు భూములు ఉన్నాయి. వృత్తి రీత్యా మేము విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నాం. ఇటీవల భూశుద్ధి కార్యక్రమంలో మా భూములకు పటా ్టదారు పుస్తకాల కోసం దరఖాస్తు చేయగా ఆభూములను అప్పటికే స్ధానిక రెవెన్యూ అధికారులు ఇతరులకు అక్రమంగా పట్టా చేశారు. దీనిపై ఫిర్యాదు చేయగా మీరు భూ మి మీద లేరంటూన్నారు. ఇతర దేశాల్లో ఉన్న వారు భూమి వద్ద ఎలా ఉంటారో అధి కారులే చెప్పాలి. దీని కోసం ఉద్యోగాలను వదిలి కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిప్పుతున్నారు. ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి. – కొమరగిరి గోపాలకిషన్‌రావు, పట్టాదారుల వారసుడు నేను కొత్తగా వచ్చాను అనంతగిరి తహసీల్దార్‌గా ఇటీవలనే బాధ్యతలు స్వీకరించా. ఈ భూముల విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై శనివారం మా సర్వేయర్‌తో సర్వే చేయించాము. సోమవారం వివరాలు తెలుపుతాము. మిగతా భూముల విషయం ఆర్డీఓ పరిధిలో ఉంది. – జంగయ్య, తహసీల్దార్, అనంతగిరి. -
అవినీతి.. షరా ‘మామూలు’
చెన్నూరు : రెవెన్యూ శాఖ అవినీతికి అడ్డాగా మారింది. పట్టాదారు పాసు పుస్తకాలు మొదలుకుని, భూములుఆన్‌లైన్‌లో చేర్చడం వరకు అక్రమాలకు నిలయంగా పేరు పొందిన ఈ శాఖ ఇప్పుడు ఇసుకలోనూ తాయిలాన్ని పిండుతోంది. ఇటీవల కాలంలో భారీ ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు వినవస్తున్నాయి. చెన్నూరు అధికారులు వారం రోజుల్లోనే ఇసుక ట్రాక్టర్ల వద్ద రూ. 95 వేలు అక్రమంగా వసూలు చేసి తమ సత్తా ఏమిటో చూపారు. ఓ మండల స్థాయి అధికారితో పాటు, మరో ద్వితీయ శ్రేణి అధికారి ఇసుక దందాకు తెరలేపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరు ఇద్దరిని మధ్యవర్తులుగా, తమ బినామీలుగా ఏర్పరచుకొని వారి ద్వారా ఈ దందాను కొనసాగిస్తూ.. కడపలోని ఓ హోటల్ కేంద్రంగా పంపకాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5లక్షలు టార్గెట్ రెవెన్యూ కార్యాలయంలో ఒక నెలకు రూ. 3లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అక్రమ వసూళ్లు చే యాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం. ఇటీవల మండలంలోని ఓ రైతు తమ పొలాన్ని ఆన్లైన్ చేయాలని కోరితే రూ. 80 వేలు మామూళ్లు అడగడంతో కంగుతిని చేసేది లేక మిన్నకున్నాడు. చెన్నూరుకు చెందిన రైతు తన బంధువులు కొనుగోలు చేసిన భూమిని ఆన్లైన్ చేయాలని కోరితే రూ. 10 వేలు మామూళ్లు తీసుకొన్నారు. సదరు రైతు తొలుత మామూళ్లు ఇచ్చేందుకు తిరస్కరించినా కార్యాలయం చుట్టూ ఏళ్లతరబడి తిరగలేక మామూళ్లు సమర్పించి పని చేయించుకున్నట్లు తెలుస్తోంది. గత నెల 6 వతేదీన మండలంలోని కొక్కరాయపల్లెకు చెందిన వ్యక్తి ట్రాక్టర్లో ఇసుక తరలిస్తూ పట్టుబడితే రూ.35 వేలు లంచం తీసుకొని వదిలేశారు. అదే గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడు ట్రాక్టర్లో ఇసుక తరలిస్తూ పట్టుబడితే అతని వద్ద రూ. 16 వేలు వసూలు చేశారు. ఇటీవల ముగ్గురు రైతులు నదిలోని ఒండ్రుమట్టి పొలానికి తోలుతుంటే మూడు ట్రాక్టర్లను పట్టుకొని రూ.18 వేలు తీసుకొన్నారు. ఈనెల 22వతేదీ శుక్రవారం ఇసుక ట్రాక్టర్ పట్టుబడగా ఆదివారం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి రూ.10 వేలు తీసుకొని పంపారు. 24వ తేదీన శివాలపల్లె వద్ద 2, చెన్నూరు వద్ద రెండు ట్రాక్టర్లు పట్టుకొని 26వతేదీవరకు స్టేషన్లో ఉంచి ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ. 15 వేల చొప్పున రూ.60 వేలు వసూలు చేసినట్లు బాధితులు తెలుపుతున్నారు. ఈనెల 22న బుధవారం ఉదయం ఒక ట్రాక్టర్‌ను పట్టుకుని స్టేషన్లో అప్పగించి మధ్యాహ్నం వదిలేశారు. ఇలా ఒక్కటేమిటి ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి అందినకాడికి దండుకొంటున్నారనే విమర్శలున్నాయి. కాగా, ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ఈనెల 22 వతేదీ నుంచి 27 వరకు ఆరు ట్రాక్టర్లు పట్టుకొని తమకు అప్పగించారని, మూడు రోజులు స్టేషన్లో ఉంచుకొన్నాక రెవెన్యూ అధికారి పంపమంటే తాము పంపామని వారు చెప్పారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారిస్తే ఈ మామూళ్ల దందా బహిర్గతమవుతుంది. ఈ విషయంపై తహశీల్దార్ సత్యానందంను వివరణ కోరగా ట్రాక్టర్లు పట్టుకొన్నది వాస్తవమేనని, తాము ఎవ్వరి వద్ద మామూళ్లు తీసుకోలేదన్నారు.