Revenue issues
-
వారిని నమ్మొద్దు: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ కాలనీల్లో సంవత్సరాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలపైన పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు(కేటీఆర్) శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. నూతన రెవెన్యూ చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వ్యవసాయ భూముల పైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. (చదవండి: ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం..) సామాన్యుడిపై ఎలాంటి భారం పడకుండా అండగా ఉంటామన్నారు. అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి ఆమోదం తీసుకున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో సుమారు 24 లక్షల 50 వేల ఆస్తులు ఉన్నట్లు అంచనా ఉందని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా.. పేద, మధ్య తరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఎవరు కూడా దళారులను నమ్మొద్దని, ఒక్కపైసా ఇవ్వవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
రెవెన్యూ’ సమస్యలు పరిష్కరించాలి..
► ఇక్కడి అధికారుల టీం బాగుంది ► జీవో 58, 59లో ఇంకా ముందుండాలి ► ప్రజలకు కష్టం కలిగించొద్దు ► ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ► అధికారులతో ‘రెవెన్యూ’పై సమీక్ష దిలాబాద్ అర్బన్ : సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రజలకు కష్టం కలిగించవద్దని, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి, సహాయ, పునరావాస, రెవెన్యూ శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. భూముల సమస్యలు, ఆహార భద్రత కార్డుల పంపిణీ రెవెన్యూ చేపట్టిందన్నారు. ఇక్కడి అధికారుల టీం బాగుందని.. జీవో 58, 59లో ఇతర జిల్లాల కంటే ఇంకా ముందుండాలన్నారు. జిల్లాకు ఏవైనా ఇబ్బందులుంటే చెప్పాలని, సీఎంతో మాట్లాడామని చెప్పారు. ప్రజలకు కష్టం కల్గించకుండా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జీవో 58 ద్వారా 24,872 దరఖాస్తులు.. అనంతరం జేసీ సుందర్ అబ్నార్ మాట్లాడుతూ జీవో 58 ద్వారా జిల్లా వ్యాప్తంగా 24,872 దరఖాస్తులు రాగా, 16,242 దరఖాస్తులు తిరస్కరించామని, 8,380 దరఖాస్తులను పరిశీలించి భూములను క్రమబద్ధీకరించామని తెలిపారు. సాంకేతిక సమస్యతో ఇంకా 245 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. జీవో 59కి సంబంధించి 2637 దరఖాస్తులు వచ్చాయని, డబ్బు చెల్లింపు కింద వీరందరి నుంచి రూ.17.85 కోట్లు వసూలు చేసినట్లు వివరించారు. ఇందులో 1,741 దరఖాస్తులను అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మ్యూటేషన్‌లో 10 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 3,831 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చామని, 345 మందికి బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించామన్నారు. ఈ యేడాది కూడా గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి కార్డులు పంపిణీ చేస్తామన్నారు. సాదాబైనామాలపై ప్రత్యేక శ్రద్ధ సాదాబైనామాలపై శ్రద్ధ పెడతామని, దరఖాస్తుల గడువు జూన్ 2 నుంచి 15 వరకు ఉందని పేర్కొన్నారు. సాదాబైనామాల రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని, తహసీల్దార్ కార్యాలయాల్లో మ్యాన్యువల్‌గా కొనసాగితే సమస్యలు వచ్చేట్లు ఉన్నాయని జేసీ డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో విరాసత్ చేస్తామని చెప్పారు. భూదాన్ ల్యాండ్ పరిశీలనలో ఉందన్నారు. జమాబంధీలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ల్యాండ్ అక్విషన్లో ముందున్నామన్నారు. సర్వేయర్లు తక్కువగా ఉన్నాయని, 52 మండలాలకు 28 మంది సర్వేయర్లు, 11 డిప్యూటీ సర్వేయర్లు ఉన్నారని తెలిపారు. అనంతరం షాదీముబారక్, ఇతర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీవో 58 ప్రకారం భూముల క్రమబద్ధీకరణలో మూడో స్థానంలో ఉన్నామని, 59లో రెండో స్థానంలో ఉన్నామని మంత్రి జోగు రామన్న తెలిపారు. సమావేశంలో దేవదాయ, హౌసింగ్ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే బాపురావు, సబ్ కలెక్టర్ అధ్వైత్ కుమార్ సింగ్, డీఆర్వో సంజీవరెడ్డి, డీఆర్డీఏ పీడీ అరుణ కుమారి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, ఆర్డీవోలు ఐలయ్య, శివలింగయ్య, సుధాకర్‌రెడ్డి, అయేషా మస్రత్ ఖానమ్, తహసీల్దార్లు, పర్యవేక్షకులు, అధికారులు పాల్గొన్నారు. -
పోస్టులన్నీ ఖాళీ... ఏం చేయాలి?
ఐదు నెలలుగా జేసీ పోస్టు ఖాళీ ఇన్చార్జి జేసీగా ఏజేసీ సంజీవయ్య నాలుగు శాఖలకు జిల్లా అధికారులు లేరు అనేక విభాగాల్లో ఖాళీ కుర్చీలు {పజలకు సక్రమంగా అందని సేవలు సిటీ బ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్నా ... ప్రభుత్వ అధికారులు... ఉద్యోగుల పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు.దీంతో అనేక శాఖలు ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నాయి. పాలన గాడి తప్పింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. జిల్లా అధికారులు లేక.. జిల్లాలో కీలకమైన జాయింట్ కలెక్టర్ పోస్టు ఐదు నెలలుగా ఖాళీగా ఉంది. ఇన్చార్జిగా ఏజేసీ సంజీవయ్య అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో రెవెన్యూ సమస్యలు అధికం. భూ వివాదాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో జేసీ పోస్టు భర్తీ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏజేసీ సంజీవయ్యకు కీలకమైన సంక్షేమ శాఖలతో పాటు అదనంగా జేసీగా ఇన్చార్జి బాధ్యతలు ఉన్నాయి. కలెక్టర్ సెలవుపై వెళ్లినపుడు ఇన్చార్జి బాధ్యతలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు అప్పగించినా... పనులు మాత్రం ఏజేసీయే చూసుకోవాల్సి వస్తోంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి (డీబీసీడబ్ల్యూఓ), జిల్లా యువజన సంక్షేమ అధికారి, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ అధికారి, డీసీఓ వంటి కీలకమైన బాధ్యతలూ ఇన్‌చార్జిలే చూస్తున్నారు. ఉద్యోగుల ఖాళీలు ఇలా... జిల్లా విద్యాశాఖలో 24 మంది డీప్యూటీ ఐఓఎస్‌లకు గాను ముగ్గురు మాత్రమే ఉన్నారు. 12 మంది డీప్యూటీ ఈఓలు ఉండాల్సి ఉండగా... ముగ్గురే ఉన్నారు. జిల్లాలో 790 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్వీఎంలో 24 ఇంజినీర్ పోస్టులు అవసరం కాగా...12 మంది మాత్రమే ఉన్నారు. ఐదు ఏబీసీడబ్ల్యూఓ, 13 హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. -
పోస్టులన్నీ ఖాళీ...ఏం చేయాలి?
ఐదు నెలలుగా జేసీ పోస్టు ఖాళీ ఇన్ఛార్జీ జేసీగా ఏజేసీ సంజీవయ్య నాలుగు శాఖలకు జిల్లా అధికారులు లేరు అనేక విభాగాల్లో ఖాళీ కుర్చీలు {పజలకు సక్రమంగా అందని సేవలు సిటీ బ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్నా ... ప్రభుత్వ అధికారులు... ఉద్యోగుల పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు.దీంతో అనేక శాఖలు ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నాయి. పాలన గాడి తప్పింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. జిల్లా అధికారులు లేక.. జిల్లాలో కీలకమైన జాయింట్ కలెక్టర్ పోస్టు ఐదు నెలలుగా ఖాళీగా ఉంది. ఇన్చార్జిగా ఏజేసీ సంజీవయ్య అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో రెవెన్యూ సమస్యలు అధికం. భూ వివాదాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో జేసీ పోస్టు భర్తీ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏజేసీ సంజీవయ్యకు కీలకమైన సంక్షేమ శాఖలతో పాటు అదనంగా జేసీగా ఇన్చార్జి బాధ్యతలు ఉన్నాయి. కలెక్టర్ సెలవుపై వెళ్లినపుడు ఇన్చార్జి బాధ్యతలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు అప్పగించినా... పనులు మాత్రం ఏజేసీయే చూసుకోవాల్సి వస్తోంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి (డీబీసీడబ్ల్యూఓ), జిల్లా యువజన సంక్షేమ అధికారి, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ అధికారి, డీసీఓ వంటి కీలకమైన బాధ్యతలూ ఇన్‌చార్జిలే చూస్తున్నారు. ఉద్యోగుల ఖాళీలు ఇలా... జిల్లా విద్యాశాఖలో 24 మంది డీప్యూటీ ఐఓఎస్‌లకు గాను ముగ్గురు మాత్రమే ఉన్నారు. 12 మంది డీప్యూటీ ఈఓలు ఉండాల్సి ఉండగా... ముగ్గురే ఉన్నారు. జిల్లాలో 790 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్వీఎంలో 24 ఇంజినీర్ పోస్టులు అవసరం కాగా...12 మంది మాత్రమే ఉన్నారు. ఐదు ఏబీసీడబ్ల్యూఓ, 13 హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.