ఐదు నెలలుగా జేసీ పోస్టు ఖాళీ
ఇన్‌ఛార్జీ జేసీగా ఏజేసీ సంజీవయ్య
నాలుగు శాఖలకు జిల్లా అధికారులు లేరు
అనేక విభాగాల్లో ఖాళీ కుర్చీలు
{పజలకు సక్రమంగా అందని సేవలు
సిటీ బ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్నా ... ప్రభుత్వ అధికారులు... ఉద్యోగుల పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు.దీంతో అనేక శాఖలు ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నాయి. పాలన గాడి తప్పింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది.
జిల్లా అధికారులు లేక..
జిల్లాలో కీలకమైన జాయింట్ కలెక్టర్ పోస్టు ఐదు నెలలుగా ఖాళీగా ఉంది. ఇన్‌చార్జిగా ఏజేసీ సంజీవయ్య అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో రెవెన్యూ సమస్యలు అధికం. భూ వివాదాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో జేసీ పోస్టు భర్తీ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏజేసీ సంజీవయ్యకు కీలకమైన సంక్షేమ శాఖలతో పాటు అదనంగా జేసీగా ఇన్‌చార్జి బాధ్యతలు ఉన్నాయి. కలెక్టర్ సెలవుపై వెళ్లినపుడు ఇన్‌చార్జి బాధ్యతలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు అప్పగించినా... పనులు మాత్రం ఏజేసీయే చూసుకోవాల్సి వస్తోంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి (డీబీసీడబ్ల్యూఓ), జిల్లా యువజన సంక్షేమ అధికారి, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ అధికారి, డీసీఓ వంటి కీలకమైన బాధ్యతలూ ఇన్‌చార్జిలే చూస్తున్నారు.
ఉద్యోగుల ఖాళీలు ఇలా...
జిల్లా విద్యాశాఖలో 24 మంది డీప్యూటీ ఐఓఎస్‌లకు గాను ముగ్గురు మాత్రమే ఉన్నారు. 12 మంది డీప్యూటీ ఈఓలు ఉండాల్సి ఉండగా... ముగ్గురే ఉన్నారు. జిల్లాలో 790 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్‌వీఎంలో 24 ఇంజినీర్ పోస్టులు అవసరం కాగా...12 మంది మాత్రమే ఉన్నారు. ఐదు ఏబీసీడబ్ల్యూఓ, 13 హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.
పోస్టులన్నీ ఖాళీ...ఏం చేయాలి?
Published Wed, Dec 3 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM
Advertisement