revenue law
-
15 లక్షల ఎకరాలు.. 30 కారణాలు
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభమై మూడేళ్లు పూర్తయినా... సుమారు 15 లక్షల ఎకరాలకు సంబంధించిన భూముల యాజమాన్య హక్కులపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. పలు కారణా లను చూపుతూ 9.67 లక్షల ఖాతాలకు డిజిటల్ సంతకం చేయకుండా పెండింగ్‌లో పెట్టిన రెవెన్యూశాఖ... వీటికి పరిష్కారమార్గం చూపడంలో చేతులెత్తే ్తసింది. దీంతో పట్టాదార్ పాస్‌పుస్తకాలు రాక, రైతు బంధు సహాయం అందక భూ యజమానులు ఇబ్బందులు పడు తున్నారు. తమ భూములపై పడిన గొళ్లెం వీడేదెప్పుడో తెలియక ఆందోళన చెందు తున్నారు. భూ వివాదాలు, సాంకేతిక కార ణాలు, సివిల్ కేసులు, ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల మధ్య సరిహద్దు తగాదాలు, వ్యవ సాయేతర అవసరాలకు మళ్లిన భూములు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 15,69,209 ఎకరాల భూముల హక్కులు 30 కారణాలతో పెండింగ్‌లో పడిపోయాయి. ఎన్ని ఖాతా ల్లోని, ఎంత విస్తీర్ణంలో ఉన్న భూములకు, ఏ కారణంతో యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వలేదో వివరిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) వర్గాలు ఇటీవల ఓ నివేదిక తయారు చేశాయి. మరోవైపు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసు కొచ్చిన ప్రభుత్వం.. భూ వివాదాలను పరిష్కరించే అధికారాలను రెవెన్యూ కోర్టుల నుంచి తొలగిం చింది. ఏ వివాదమైనా సివిల్ కోర్టులను ఆశ్రయిం చాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో రెవెన్యూ కార్యా లయాల్లో మగ్గుతున్న లక్షలాది ఖాతాలకు పరిష్కారం ఎలా చూపుతారనే దానిపై స్పష్టత కరువైంది. కొత్త చట్టం అమలుపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తే తప్ప ఈ భూముల భవితవ్యమేమిటో ఆర్థంకాని పరిస్థితి. ఎందుకు పక్కనపెట్టారంటే పట్టణీకరణతో అనేక ప్రాంతాల్లో సాగు భూమలు వ్యవసాయేతర అవసరాలకు మళ్లాయి. అయితే, భూ వినియోగ మార్పిడి జరగకుండానే వీటిని వ్యవసాయేతర అవసరాలకు మళ్లించడం... కొంత మేర ప్లాట్లు, కొంత విస్తీర్ణంలో వ్యవసాయం సాగుతుండడంతో వీటికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇచ్చే అంశంపై రెవెన్యూశాఖ స్పష్టమైన విధానం ప్రకటించలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఎకరాలపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ సమస్య కొలిక్కి రావాలంటే క్షేత్రస్థాయి సర్వే అనివార్యం. మరోవైపు ఆధార్ వివరాలు సరిగా లేకపోవడంతో ఏకంగా 3.9 లక్షల ఖాతాల డిజిటిల్ సంతకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఇలా 4.5 లక్షల ఎకరాల భూ విస్తీర్ణానికి ఇంకా గ్రహణం వీడలేదు. వారసత్వ పంచాయతీలతో 38,504 ఖాతాలు..33,682 ఎకరాల మేర పెండింగ్‌లో పడింది. అలాగే పీవోటీ కేటగిరీలో 64,722 ఖాతాలు... 82,439 ఎకరాల యాజమాన్యాలపై మెలిక పడింది. విస్తీర్ణంలో వ్యత్యాసాలున్న కేటగిరీలో 43,475 ఖాతాలకు సంబంధించి 65,316 ఎకరాలకు పాస్‌పుస్తకాలు పెండింగ్‌లో ఉంచారు. ఇవేగాకుండా ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల మధ్య సరిహద్దు వివాదాలతోనే వేలాది ఎకరాలకు సంబంధించిన భూ హక్కులపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిపై ప్రభుత్వస్థాయిలో విధానపరమైన నిర్ణయం జరగలేదు, స్పష్టమైన మార్గదర్శకాలు లేవు కాబట్టి తహసీల్దార్లు డిజిటిల్ సంతకం చేయకుండా పక్కనపెట్టారు. కొత్త చట్టం రాకముందే...! తాజాగా అమలులోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? లేదా? అనేదానిపై కూడా అనిశ్చితి నెలకొంది. గతంలో భూ వివాదాలపై ఆర్జీల పరిష్కారం అధికారుల పరిధిలో ఉండేది. వివాదాలైతే రెవెన్యూ కోర్టుల్లో పరిష్కారం లభించేది. కొత్త చట్టంలో రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. అంతేగాకుండా రెవెన్యూ కేసులను పరిష్కరించుకోవాలంటే ఇకపై న్యాయస్థానాలనే ఆశ్రయించాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో వివిధ కారణాలతో నిలిపివేసిన పాస్‌పుస్తకాలకు మోక్షం ఎప్పుడు.. ఎలా కలుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సీసీఎల్ఏ చెపుతున్న 30 కారణాలతో పెండింగ్‌లో పడిన భూములకు పరిష్కారం కలగాలంటే సమగ్ర సర్వే ఒక్కటే మార్గమని, దీని ద్వారానే వివాదాలకు తెరపడుతుందని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. అయితే, ధరణి పోర్టల్ అప్డేట్ చేసి అధికారికంగా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చే లోపే ఈ వివాదాస్పద భూముల విషయంలోనూ పరిష్కారం రావాల్సి ఉంటుందని, లేదంటే భవిష్యత్తులో ఈ భూములకు మరిన్ని ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. -
‘నిషేధం’ తొలగేనా!
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 346లో ఉన్న 20 ఎకరాల 17 గుంటల భూమిలో ఓ భాగం ఇది. రెవెన్యూ కార్యాలయంలో ఇది పట్టా భూమిగానే నమోదైనా చౌటుప్పల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం ప్రభుత్వ భూముల నిషేధిత జాబితా 22 (ఏ)లో ఉంది. ఆ భూముల్లో 14 మంది రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. అవసరానికి వేరే వ్యక్తికి అమ్మాలనుకొని కొనుగోలుదారుడికి రిజిస్టర్ చేసేందుకు వెళ్లగా అందులో 2 ఎకరాల 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ జరగలేదు. మిగిలింది తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద మారుద్దామన్నా కుదరట్లేదు. ఇందుకు కారణం ఆ సర్వే నంబర్ 22 (ఏ) జాబితాలో ఉండటమే. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిషేధిత భూముల నమోదులో గందరగోళం కారణంగా ఏళ్ల తరబడి పేద రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడు తున్నారు. నిషేధిత భూముల జాబితాను ఎప్పుడో తయారు చేసిన రెవెన్యూ అధికారులు... ఆ తర్వాత వాటిని సరిదిద్దే కసరత్తు చేయక పోవడంతో ఒకే సర్వే నంబర్లో ప్రభుత్వ, పట్టా భూములన్న ప్రాంతాల్లో పట్టా భూముల రిజిస్ట్రేషన్లు జరగట్లేదు. ఇలా 22 (ఏ) జాబితాలో సమస్యలున్న భూములు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 లక్షల ఎకరాలుంటాయని అంచనా. ఈ భూములు కొందరికి పీటముడిగా మారితే అక్రమార్కులకు వరంగా మారాయి. వాటి మాటున రూ. వందల కోట్లు చేతులు మారాయి. ఈ భూముల రిజిస్ట్రేషన్లు జరగాలంటే జిల్లా కలెక్టర్ నుంచి ఎన్వోసీ కావాలని, అది తేవా లంటే ‘ఖర్చ’వుతుందని రెవెన్యూ శాఖలో పనిచేసే కిందిస్థాయి అధికారులు చెబుతున్నా రన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారు అడిగి నంత డబ్బు ముట్టజెప్పుకున్నవారు కొందరైతే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగలేక, అడిగినంత లంచాలు ఇవ్వలేక... అయిన వారికి భూమిపై హక్కుల మార్పిడి చేయ లేక, అవసరానికి అమ్ముకోలేక లక్షలాది మంది ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో అయినా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమోననే ఆశతో ఎదురుచూస్తున్నారు. ఎన్నాళ్లున్నా... అంతేనా? వివిధ ప్రభుత్వ శాఖలు, అటవీ, వక్ఫ్, దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగకుండా... ప్రభుత్వ భూములను ఎవరూ కబ్జా చేయకుండా కాపాడేందుకు ఈ నిషేధిత భూముల జాబితాను తయారు చేశారు. ప్రతి గ్రామంలోని ఫైసల్ పహాణీ ఆధారంగా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూముల సర్వే నంబర్లను గుర్తించి వాటిపై లావీదేవీలు నిషేధించారు. అక్కడే అధికారులు తప్పులో కాలేశారు. ప్రభుత్వ భూముల పేరుతో పట్టా భూములను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఒకే సర్వే నంబర్లో ప్రభుత్వ, పట్టా భూములుంటే ఆ భూములను విభజించకుండా, సర్వే నంబర్లను బై చేయకుండా సర్వే నంబర్ మొత్తాన్ని 22 (ఏ) జాబితాలో చేర్చారు. దీంతో సమస్య ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలోనూ ఈ సమస్యకు మోక్షం కలగలేదు. నిషేధిత భూముల జాబితాను సవరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వం సూచించినా, ప్రజలు ఫిర్యాదులు చేసినా వాటిని సవరించడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోని ఏదో ఒక గ్రామంలో ఈ నిషేధిత భూములతో ప్రజలు తంటాలు పడుతూనే ఉన్నారు. పట్టా భూమిగా మార్చాలి మా భూమి రెవెన్యూ కార్యాలయంలో పట్టాగా చూపుతున్నా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే ప్రభుత్వ భూమి అంటున్నారు. అధికారుల చుట్టూ భూమి కోసం తిరుగుతూనే ఉన్నాం. మాది ప్రభుత్వ భూమి కాదు. దాన్ని పట్టా భూమిగా గుర్తించి క్రయవిక్రయ లావాదేవీలు జరిపేందుకు మాకు అధికారం ఇవ్వాలి. – మర్రి చిన్నజంగారెడ్డి, పుట్టపాక ప్రభుత్వ భూమి అంటున్నారు పుట్టపాకలోని సర్వే నంబర్ 346లో 7 ఎకరాలు కొన్నాను. రెవెన్యూ కార్యాలయంలో అడిగితే పట్టా భూమే కొనుక్కోమన్నారు. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు అది ప్రభుత్వ భూమి అంటున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ప్రభుత్వం ఈ సమస్య నుంచి ఇప్పటికైనా రైతులను బయట పడేయాలి. – కుక్కల రఘపతి, పుట్టపాక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని సర్వే నంబర్ 587లో ఉన్న భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం పట్టా భూమి. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం ఇది 22 (ఏ) జాబితాలో ఉంది. ఆ భూమిలో 1996లోనే వెంచర్ చేసి ప్లాట్లుగా విక్రయించారు. రిజిస్ట్రేషన్ సమయానికి వచ్చేసరికి చిక్కుముడి పడింది. నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఈ సర్వే నంబర్లో రిజిస్ట్రేషన్లు జరగవని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో గత 24 ఏళ్లుగా అక్కడ ప్లాట్లు కొన్న వారు భూముల రిజిస్ట్రేషన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కలేదు. కందుకూరులోని మరో సర్వే నంబర్ 911లోనూ ఇదే పరిస్థితి. ఇలా మండలంలోని చాలా గ్రామాల్లో ఈ నిషేధిత భూముల సమస్య ఉంది. కేస్ స్టడీ–3 రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెదక్ అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఏసీబీకి పట్టుబడ్డ వ్యవహారానికి కూడా ఈ నిషేధిత సమస్యే మూలం. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చే పనిని తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఆయన ప్రయత్నించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి గ్రామంలోని 58, 59 సర్వే నంబర్లలో ఉన్న లావణీ భూములకు ఎన్వోసీ ఇచ్చేందుకు లంచం అడిగి అడ్డంగా దొరికిపోయారు. ఎకరానికి రూ. లక్ష ఇస్తే ఎన్వోసీ ఇస్తానని ఒప్పందం కుదుర్చుకొని బుక్కయ్యారు. -
‘ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: త్వరలో రాబోయే కొత్త రెవెన్యూ చట్టంలో తమ పాత్ర ఏమిటో ప్రభుత్వం సృష్టం చేయాలని తెలంగాణ వీఆర్వోల సంఘం ప్రెసిడెంట్ గోల్కొండ సతీష్ కోరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా మీడియాలో వీఆర్వోల విషయంలో అనేక కథనాలు వస్తున్నాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కూడా మాట్లాడారు. అందులో వీఆర్వో ల పాత్ర ఎలా ఉంటుందో తెలియదు. కొత్త చట్టాన్ని తాము స్వాగతిస్తామని, కానీ అందులో తమ పాత్ర ఏమిటో చెప్పాలన్నారు. ‘‘వీఆర్వోలుగా అనేక మంచి పనులు చేసాం.. కానీ మా ఉద్యోగాలు ఉంటాయో లేదో లేదో తెలియదు. రెవెన్యూ విషయంలో మా పరిధిలోకి వచ్చిన సమస్యపై ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తున్నాం. ఇంత చేస్తున్నా చాలి చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. కొత్తగా వచ్చే చట్టం పై ఆందోళన చెందుతున్నాం. మా కష్టాన్ని గుర్తించకుండా మమ్మల్ని ఇతర శాఖలకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారని’’ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వో అధికారాలు తీయొద్దని, తమపై అవినీతి ఆరోపణలు వేసి ఇతర శాఖలకు పంపటం సమంజసం కాదన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన 100 రోజుల్లో చేశాం కాబట్టే రైతులు సమర్థంగా రైతుబంధు పొందుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం. కొత్త చట్టం రావడాన్ని స్వాగతిస్తాం కానీ మమ్మల్ని రెవెన్యూ శాఖలోనే ఉంచాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అందరిపై అవినీతి ఆరోపణలు వేసి ఇతర శాఖలకు పంపవద్దన్నారు. గ్రామ స్థాయి నుండి అధ్యయనం చేసి ఈ చట్టం తేవాలని, అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టేముందు తమ సలహాలు తీసుకోవాలని గోల్కొండ సతీష్ విజ్ఞప్తి చేశారు. -
కసరత్తు షురూ.. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం!
సాక్షి, హైదరాబాద్ : కొత్త రెవెన్యూచట్టం తీసుకువస్తున్నట్లు ఆర్అండ్బీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. దీనిపై సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారని, అవసరమైతే మూడు, నాలుగు రోజులు కూర్చొని సభ్యుల సూచనలు, సలహాలతో కొత్త చట్టాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. బుధవారం శాసనసభలో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, ఎక్సైజ్, హోం, వ్యవసాయ, పశుసంవర్ధక, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం పద్దులను సీఎం తరఫున మంత్రులు సభలో ప్రవేశపెట్టారు.రెవెన్యూ పద్దులపై ప్రశాంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఇప్పటివరకు 98శాతం రికార్డులను నవీకరించామని తెలిపారు. 68.37 లక్షల ప్రైవేటు ఖాతాలకుగాను 58.48 ఖాతాలకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలిచ్చినట్లు చెప్పారు. కేవలం 12–13% ఖాతాలపై అభ్యంతరాలుండటంతో పక్కనపెట్టామని, త్వరలోనే విధానపర నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ రికార్డుల సవరణలో అనుభవదారుల కాలమ్‌లో పేర్లను తొలగించడం ద్వారా భూమిపై ఉన్న హక్కు కోల్పోతున్న రైతుల విషయంలో ఆలోచిస్తామని, మంత్రి చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖలో మార్పులు... రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖను అనుసంధానించడం ద్వారా రిజిస్ట్రేషన్ రోజే మ్యుటేషన్‌కు చర్యలు తీసు కుంటామని, అదే రోజు పాస్‌పుస్తకం, 1బీలో కూడా పేరు చేర్చేలా సంస్కరణలు తీసుకువస్తున్నట్లు చెప్పారు. స్లాట్ విధానంతో డాక్యుమెంట్ల జారీలో వేగాన్ని పెంచామని, సగటున రోజుకు 43 డాక్యుమెంట్లు నమోదవుతున్నాయని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాది రూ.2,046 కోట్ల రాబడి రాగా, ఈసారి ఇప్పటికే రూ.6,012 కోట్ల ఆదాయం లభించిందని, ఇది ఏకంగా 237% అధికమని తెలిపారు. భూస్వామ్యవర్గాలకు మేలు కలిగేలా: భట్టి తెలంగాణ పోరాటమే భూమి కోసం జరిగింది.అలాంటి భూమిని ప్రస్తుత ప్రభుత్వం జమీందార్, భూస్వామ్యవర్గాలకు కట్టబెట్టేలా భూ రికార్డుల ప్రక్షాళనను చేసిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అనుభవదారుల కాలమ్ నుంచి పేర్లు తొలిగించడంతో వారి ఆస్తులపై పేదలు హక్కులు కోల్పోతున్నారని చెప్పారు. భూ రికార్డుల నవీకరణ ఉద్దేశం మంచిదే అయినా.. చేసిన విధానం బాగాలేదని అభిప్రాయపడ్డారు. జిల్లాలవారీగా ఉదాహరణలు చెబుతుంటే సమయం అయిపోందని స్పీకర్ మైక్ కట్ చేశారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జోక్యం చేసుకుంటూ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం కంకణం కట్టుకుంటే.. అడ్డగోలుగా మాట్లాడటం సబబుకాదన్నారు. పర్మిట్ రూమ్‌లు ఎత్తివేయండి పర్మిట్ రూమ్‌ల వల్ల శాంతిభద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయని భట్టి అన్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేక జీఓ ద్వారా టానిక్ పేరిట కొన్ని బార్లకు అనుమతిచ్చినట్లు తెలిసిందని, అది సరికాదన్నారు. పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఇప్పటికే పలు డిపోలు, వర్క్‌షాప్‌లను తాకట్టు పెట్టిందని, తాజాగా ఎలక్ట్రానిక్ బస్సుల నిర్వహణ ఒప్పందంలోను అక్రమాలు జరిగినట్లు తెలుస్తోందని విచారణ జరపాలన్నారు. పౌరసరఫరాల పద్దుపై పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల్లో సన్నబియ్యం పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, పేదోళ్ల కడుపునింపేందుకు ఏడాదిగా రూ.5,413 కోట్ల సబ్సిడీని భరించినట్లు తెలిపారు. -
వీఆర్వో వ్యవస్థ రద్దు?
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థను సమగ్రంగా మార్చాలన్న యోచనలో ఉన్న సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నారు. సత్వర సేవలు, అవినీతి నియంత్రణ లక్ష్యంతో ఈ వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) వ్యవస్థ రద్దు, క్వాలిఫైడ్ వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా నిర్వచిస్తూ రెవెన్యూ శాఖలో కొనసాగించే అంశాన్ని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై కలెక్టర్లతో సీఎం చర్చించారు. కొత్త చట్టంలో పొందుపరిచే అంశాలపై చర్చించడమే కాకుండా.. కలెక్టర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చివరకు వీఆర్వో వ్యవస్థ రద్దు మంచిదనే భావనలో సీఎం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వారి వల్లే చెడ్డపేరు భూ రికార్డుల ప్రక్షాళనలో వీఆర్వోల భాగ స్వామ్యంతో అక్రమాలు జరిగాయని అంచనాకొచ్చిన ప్రభుత్వం.. భూ రికార్డుల నిర్వ హణ నుంచి వారిని తప్పించాలని నిర్ణయించింది. భూ రికార్డుల్లో కాస్తు కాలమ్‌ను తొలగించినందున.. వీరి అవసరం లేదనే అంచనాకొచి్చంది. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ రికార్డులను సవరించే క్రమంలో వీఆర్వోల వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందనే అభిప్రాయంతో సీఎం ఉన్నారు. ఈ వ్యవస్థను రద్దు చేస్తే ఉద్యోగవర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తున్న సర్కారు.. వీరి సేవలను వేరే విధంగా వాడుకోవాలని భావిస్తోంది. విద్యార్హతలు, నైపుణ్యం, నిబద్ధత ఉన్న వారినే రెవెన్యూలో కొనసాగించి.. మిగిలిన వారిని పూలింగ్‌లో పెట్టడం ద్వారా వేరే శాఖ (పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ)ల్లోకి బదిలీ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. వీఆర్ఏలను పంచాయతీరాజ్ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సర్వే ప్రైవేటుపరం!: సర్వేయర్ల వ్యవస్థ రద్దునూ ప్రభుత్వం పరిశీలిస్తోంది. రెవెన్యూ లో అవినీతికి సర్వేయర్లు ప్రధాన కారణమని అంచనాకు వచ్చిన సర్కారు.. వీరిపై వేటు వేసేలా ఆలోచన చేస్తోంది. సర్వేను ప్రైవేటు పరంచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ బాధ్యతలను లైసెన్స్డ్ సర్వేయర్లకు అప్పగించనుంది. ఒకే రోజులో మ్యూటేషన్! భూముల మ్యూటేషన్‌ను సరళతరం చేయనుంది. రిజి్రస్టేషన్ అయిన రోజే మ్యూటేషన్ అయ్యేలా కొత్త విధానాన్ని తీసుకురానుంది. 24 గంటల్లో అభ్యంతరాలు రాకపోతే.. తహసీల్దార్ మ్యూటేషన్ ప్రోసీడింగ్స్ (ఆటోమేటిక్ డిజిటల్ సంతకం జరిగేలా) ఇవ్వడమే కాకుండా.. ఆన్లైన్ పహాణీలో నమోదు చేసేలా చట్టంలో పొందుపరచనున్నారు. అలాగే 10 రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాన్ని నేరుగా రైతు ఇంటికే పంపనున్నారు. సమగ్ర సర్వేకు మొగ్గు: భూరికార్డుల ప్రక్షాళనను సంపూర్ణం చేసేందుకు సమగ్ర భూసర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. టైటిల్ గ్యారంటీ అమలుకు ఈ సర్వే అనివార్యమైనందున భూసమగ్ర సర్వేకు ఆదేశాలివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. టైటిల్ గ్యారెంటీ చట్టం అమల్లోకి తేవడానికి ముందు సరిహద్దు వివాదాలు, క్లియర్ టైటిల్ ఉండాలనే కారణాలతోనే సమగ్ర భూసర్వే నిర్వహించనుంది. ఏపీలో ఉన్న టైటిల్ గ్యారంటీ చట్టం పేరు మారి వేరే చట్టాన్ని తీసుకురావాలని చూస్తోంది. తహసీల్దార్ల అధికారాలకు కోత? తహసీల్దార్ల అధికారాల కుదింపుపై కలెక్టర్ల భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమై నట్లు తెలుస్తోంది. మ్యూటేషన్లతోపాటు భూరికార్డుల మార్పులు, చేర్పుల అధికారాన్ని జాయింట్ కలెక్టర్లకు బదలాయిస్తే కొత్త సమస్యలు వస్తాయని కొందరు కలెక్టర్లు సూచించినట్లు సమాచారం. ప్రస్తుత విధానమే మంచిదనే వాదనలు వినిపించినట్లు తెలిసింది. వీరి అధికారాలపై రెవెన్యూ ముసాయిదాలో స్పష్టత రానుంది. -
ప్రైవేటుకు ‘పట్టా’భిషేకం!
మదన్‌పల్లి భూములకు బడా బాబుల టెండర్ 194 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వైనం రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారులు సీసీఎల్ఏ విచారణలో వెలుగు చూసిన అక్రమాలు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీఐడీకి లేఖ శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: పేదల భూములపై ‘పెద్దలు’ వాలారు. అక్రమార్కులతో కుమ్మక్కై వందల కోట్ల భూమికి టెండర్ పెట్టారు. రెవెన్యూ చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకొని ఏకంగా 194 ఎకరాల భూమిని కొల్లగొట్టారు. రికార్డుల తారుమారుతో ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తికి సంతర్పణ చేశారు. ఈ తంతును ఆలస్యంగా గుర్తించిన భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) చివరకు విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో తీగలాగితే డొంక కదిలినట్లు.. ఈ భూమాయలో మాజీ తహసీల్దార్, ఆర్డీవోలు చక్రం తిప్పినట్లు తేలింది. శంషాబాద్ మండలం మదన్‌పల్లి రెవెన్యూ పరిధిలో చోటుచేసుకున్న ఈ భూ కుంభకోణంపై విచారణ జరపాలని జిల్లా యంత్రాంగం తాజాగా సీఐడీకి లేఖ రాసింది. మదన్‌పల్లి సర్వే నంబర్ 50లో 559.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో 546 ఎకరాలను 1977-78 సంవత్సరంలో ప్రభుత్వం 132 మంది ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ చేసింది. ఈ మేరకు ఫైసల్ పట్టీ, పహాణీల్లోను వివరాలు నమోదు చేశారు. ఇదిలావుండగా ఇందులో కొంత మేర భూమి చేతులు మారింది. బెంగళూరు జాతీయ రహదారికి అనుకొని ఉన్న ఈ భూమిపై కన్నేసిన బడాబాబులు రైతుల నుంచి కారుచౌకగా కొనుగోలు చేశారు. అసైన్డ్ భూములు కావడంతో వీటిని ఎలాగైనా తమ పేరిట మార్చుకునేందుకు కొత్త నాటకానికి తెరలేపారు. తమ పలుకుబడి, రికార్డుల్లోని లొసుగులను అడ్డు పెట్టుకొని భూములను కాజేసే ఎత్తుగడ వేశారు. రక్షిత కౌలుదారుగా... కొత్తగా నాలుగు లేన్ల పీ-వన్ రోడ్డు ఏర్పాటు చేయడంతో బెంగళూరు హైవేలోని భూముల విలువ గణనీయంగా పెరిగింది. ఎకరాకు కనిష్టంగా రూ.35 -50 లక్షల వరకు ధర పలుకుతోంది. దీంతో విలువైన ఈ భూములను వశపర్చుకోవాలనే వ్యూహంతో భూ మాఫియా పావులు కదిపింది. హైకోర్టు తీర్పును సాకుగా చూపి ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు సిద్దపడింది. ఈ క్రమంలోనే అక్రమార్కులతో చేతులు కలిపిన ఆర్డీవో, తహసీల్ధార్లు రికార్డుల తారుమారుకు ఉపక్రమించారు. 2005-06లో సేత్వార్‌లో ప్రభుత్వ భూమిగా నమోదు చేసిన భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. గిరిజనులకు అసైన్డ్ చేసిన భూమిలో రక్షిత కౌలుదారులుగా చేరుస్తూ రికార్డును తహసీల్దార్ మార్పిడి చేశారు. లావణీ పట్టాలిచ్చిన తర్వాత ప్రైవేటు భూమిగా పేర్కొనడం, 194 ఎకరాలకు పట్టాలు జారీ చేయాలని నిర్ణయించడంపై స్థానికంగా ఆరోపణలు రావడంతో.. సీసీఎల్ఏ స్థాయిలో ఫిర్యాదులు పోవడంతో ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరపాలని సంబంధిత ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో 2009-11 మధ్యకాలంలో రాజేంద్రనగర్ ఆర్డీవోగా పనిచేసిన రత్నకుమార్ కూడా ఈ భూ బాగోతంలో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించారు. ఈ భూములకు సంబంధించిన రికార్డులు కూడా స్థానిక మండల కార్యాలయంలో ఆదృశ్యమైనట్లు తేలడంతో... క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరుతూ సీఐడీకి జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ తాజాగా లేఖ రాశారు.. మరోవైపు క్షేత్రస్థాయిలో సదరు భూమిలో ఎంతమంది అసైనీలు ఉన్నారు? ప్రైవేటు వ్యక్తులెందరు? ఖాళీగా ఉన్న భూమి వివరాలపై రీ సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక పంపాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా రెవెన్యూ సిబ్బంది సర్వే పనుల్లో నిమగ్నమైంది.