షికారుకెళ్లాం..బిల్లులు చెల్లించండి
రంగారెడ్డి జిల్లా: షికారు చేశాం.. బిల్లులు చెల్లించండి.. శీర్షికన బుధవారం ప్రచురితమైన వార్త జిల్లా అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పది నెలల వాహనం అద్దె బిల్లులు చెల్లించాలని రెవెన్యూమంత్రి పేషీ నుంచి లేఖ రావడం.. నిధులు విడుదల చేసేందుకు ఫైలు సిద్ధమైనట్లు పత్రికల్లో కథనం రావడంతో అధికార యంత్రాంగం ఫైలును పక్కనపెట్టింది. నిబంధనలకు అనుగుణంగా లేనందున బిల్లులు చెల్లించకూడదని నిర్ణయించామని పేర్కొంటున్న అధికారులు అసలు ఫైలును ఎందుకు సిద్ధం చేశారనే అంశంపై మాత్రం నోరు మెదపడంలేదు.