డోపీగా తేలిన పాక్ స్పిన్నర్
కరాచీ: పాకిస్థాన్ యువ స్పిన్నర్ రెజా హసన్ డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలాడు. హసన్‌పై అన్ని ఫార్మాట్ల నుంచి రెండేళ్ల పాటు నిషేధం విధించే అవకాశముంది. రెజా పాక్ తరపున 10 టీ-20లు, ఒక వన్డే ఆడాడు.
ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిర్వహించిన పరీక్షల్లో హసన్ కొకైన్ వాడినట్టు తేలింది. గత జనవరిలో పాక్ స్పిన్నర్‌ను శాంపిల్స్‌ను సేకరించారు. ఈ పరీక్షలను భారత్‌లోని లాబొరేటరిలో నిర్వహించారు. యూరిన్ శాంపిల్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలగా, రెండో శాంపిల్ పరీక్షల ఫలితాలు రావాల్సివుంది. ఈ ఘటనపై విచారించేందుకు పాక్ క్రికెట్ బోర్డు ఇద్దరు సభ్యులతో కమిటీ వేసింది. హసన్ నుంచి వివరణ కోరిన ట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.