భారత్ కంపెనీలతో సంబంధాల పటిష్టతకు యూబీఆర్డీ అసక్తి
న్యూఢిల్లీ: భారత్ కంపెనీలతో కలిసి పనిచేయడానికి బహుళజాతి రుణ సంస్థ యూరోపియన్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (యూబీఆర్డీ) ఆసక్తి కనబరిచింది. భారత్ కంపెనీల్లో పెట్టుబడులకు తాము సిద్ధమని, అయితే ఆయా కంపెనీలు తప్పనిసరిగా తమ దేశాల్లో విస్తరణ కార్యకలాపాలు చేపట్టాలన్న అభిప్రాయాన్ని యూబీఆర్డీ మేనేజింగ్ డెరైక్టర్ రికార్డో పులిట్టి వ్యక్తం చేశారు.
అసోచామ్ సో మవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మేనేజింగ్ డెరైక్టర్ పాల్గొన్నారు. టాటా పవర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రేయి ఇన్ఫ్రా ఫైనాన్స్సహా ఇప్పటికే దాదాపు 10 కంపెనీలతో యూబీఆర్డీ ఇప్పటికే ‘విదేశాల్లో పెట్టుబడులు, విస్తరణకు’ సంబంధించి సంబంధాలను కలిగి ఉందని, మరిన్ని కంపెనీలతో ఇలాంటి భాగస్వామ్యాన్ని కలిగి ఉండడానికి సిద్ధమని అన్నారు.