‘హరితహారంతో’ రైస్ ఇండస్ట్రీకి లాభం
హాలియా: హరితహారం కార్యక్రమం ద్వారా రైస్ పరిశ్రమలకు లాభం చేకూరనుందని జిల్లా పౌరసరఫరాల అధికారి అమృతారెడ్డి పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం హాలియాలోని బాలాజీ రైస్ మిల్లులో మొక్కలను నాటారు. చెట్లు ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుసి పంటలు పండుతాయని, దీంతో బియ్యం పరిశ్రమలు నిరంతరం నడుస్తాయన్నారు. జిల్లాలో రైస్ మిల్లులు, గ్యాస్ గోడౌన్లలో ఇప్పటి వరకు 63 వేల మెుక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ప్రేమ్‌కుమార్, డీటీసీ ఎస్‌లు రంగారావు, లక్ష్మణ్‌బాబు, సర్పంచ్ ఉడ్తూరి వెంకట్‌రెడ్డి, హాలియా ఉపసర్పంచ్ పాంపాటి శ్రీనివాస్, మిల్లర్లు చిట్టిప్రోలు యాదగిరి, గార్లపాటి మట్టపల్లి, చిట్టిప్రోలు వెంకటేశ్వర్లు, పేలపూడి బాలకృష్ణ, ప్రసాద్, శ్రీనివాస్, రమేష్, కరుణాసాగర్ తదితరులు పాల్గొన్నారు.