rickshaw-puller
-
భర్త, కూతురు మృతి.. తోడు నిలిచిన ‘రిక్షా’ కుటుంబం.. బహుమతిగా రూ.కోటి ఆస్తి
భువనేశ్వర్: ఏ ప్రతిఫలం ఆశించకుండా రిక్షా కార్మికుడు చేసిన సేవకు ఓ వృద్ద మహిళ కోటి రుపాయలకుపైగా ఆస్తిని దానం చేసింది. ఈ మేరకు ఆస్తిని అతని పేరు మీద రాసిన పత్రాలను రిక్షా కార్మికుడికి అందించింది. ఈ ఘటన ఒరిస్సాలోని సంబల్పూర్లో చోటు చేసుకుంది. అయితే అంత ఆస్తిని కుటుంబ సభ్యులకో, లేక బంధువులకో కాకుండా రిక్షా కార్మికుడికి దానం చేయడానికి పెద్ద కారణమే ఉందండోయ్! వివరాల్లోకి వెళితే.. సబల్పూర్కు చెందిన మినాతి పట్నాయక్(63) భర్త 2020లో మరణించగా, తన కుమార్తె 2021లో మరణించింది. అప్పటి నుంచి తనని ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఆమె బంధువులు ఇటీవల తన ఆస్తి కోసం ఒక్కసారిగా ఆమెతో దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గత 25 ఏళ్లుగా ఆమె కుటుంబానికి నమ్మకంగా పని చేస్తున్న వచ్చిన రిక్షా కార్మికుడికి తన ఆస్తి మొత్తాన్ని దానం చేసింది. అందులో రూ.కోటి విలువైన భవనం, ఇతర సామగ్రిని అతని పేరుపై రిజిస్ట్రేషన్ చేయించింది. దీనిపై వృద్దురాలు మాట్లాడుతూ.. తన భర్త, కూతురు చనిపోయి కృంగిపోయి, దుఃఖంలో బతుకుతున్నప్పుడు, తన బంధువులెవరూ కూడా అండగా నిలబడలేదని ఆ సమయంలో తాను ఒంటరిగా కాలాన్ని గడిపినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆ రిక్షా కార్మికుడు, అతని కుటుంబం మాత్రం ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు పేర్కొంది. అందుకే ఆస్తి కోసం ఎదురుచూసే వారికంటే ఏ లాభం ఆశించకుండా తన కుటుంబం కోసం నిశ్వార్ధంగా పని చేసిన బుధాకు( రిక్షా కార్మికుడు) తన ఆస్తిని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. చదవండి: రాంగ్ కాల్.. ఆ దివ్యాంగురాలి జీవితాన్నే మార్చేసింది.. -
రిక్షా కార్మికుడిని రూ.3 కోట్లు టాక్స్ కట్టాలన్న ఐటీ అధికారులు
లక్నో: అతనో రిక్షా కార్మికుడు. తన బతుకు బండి నడవాలంటే రిక్షా నడపాల్సిందే. అలాంటి వ్యక్తికి ఆదాయపన్ను శాఖ (ఐటీ) రూ.3 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. రోజూ కష్టపడితే అతనికి వెయ్యి రూపాయలు కూడా వచ్చేది అనుమానమే అలాంటి వ్యక్తి అంత డబ్బు కట్టాలనేసరికి షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల ఫిర్యాదులో.. బ్యాంక్ అధికారులు పాన్ కార్డును అకౌంట్‌కు అనుసంధానించాలని చెప్పడంతో బకల్‌పూర్‌లోని జన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని రోజుల తరువాత ఆ షాపులోని వ్యక్తి తనకు పాన్‌కార్డు కలర్ కాపీని ఇచ్చాడని తెలిపాడు. అయితే తనకు అక్టోబర్ 19న ఐటీ అధికారుల నుంచి ఫోన్ వచ్చిందని, రూ. 3,47,54,896 చెల్లించాలని నోటీసు ఇచ్చారని చెప్పారు. దీంతో షాక్ అయిన ఆ వ్యక్తి తాను రిక్షా కార్మకుడని.. తన కథంతా ఐటీ అధికారులకి వివరించాడు. దీంతో తన పేరుపై ఎవరో వ్యాపారాన్ని నడుపడంతో 2018-19లో వ్యాపారపరమైన టర్నోవర్ రూ.43,44,36,201 అని అధికారులు చెప్పడంతో అతనికి అసలు కథ అర్థమైంది. కాగా తాను నిరక్షరాస్యుడు కావడంతో ఒరిజినల్ పాన్ కార్డుకు, కలర్ కాపీకి తేడా గుర్తించలేకపోయినట్లు తన వెనుక జరిగిన మోసాన్ని అప్పుడే అధికారులకు వివరించాడు. దీంతో అసలు విషయం తెలుసుకున్న ఐటీ అధికారులకు అతనికి.. తన పాన్ కార్డుని కొందరు దుర్వినియోగం చేశారని ఎఫ్ఐఆర్ నమోదు చేయమని సలహా ఇచ్చారు. దీంతో ప్రతాప్ సింగ్ మధుర పోలీసులో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రిక్షా కార్మికుడికి ప్రధాని మోదీ సర్ప్రైజ్
లక్నో: వారణాసి పర్యటనలో భాగంగా ఈ నెల 16న ఓ రిక్షా కార్మికుడిని ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ రిక్షా కార్మికుడేవరో కాదు.. ఇటీవలే తన బిడ్డ వివాహానికి హాజరు కావాలని మోదీకి పెళ్లి పత్రిక పంపిన మంగల్ కేవత్. అయితే మోదీకి ఆ ఆహ్వానం అందడంతో.. పెళ్లి కుమార్తెకు ఆశీస్సులు తెలుపుతూ ప్రధాని.. కేవత్‌కు లేఖ రాశాడు. ఈ క్రమంలో వారణాసి పర్యటకు వచ్చిన మోదీ తానే స్వయంగా కేవత్‌ను పిలిపించుకుని.. అతని యోగక్షేమాలు అడిగారు. ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు మోదీ. ఈ సందర్భంగా మంగల్ కేవత్ మాట్లాడుతూ.. తన కుమార్తె పెళ్లి సందర్భంగా మొదటి ఆహ్వానాన్ని ప్రధాని మోదీకి పంపాను. ఢిల్లీలోని పీఎంవో కార్యాలయంలో ఫిబ్రవరి 8వ తేదీన తానే స్వయంగా పెళ్లి పత్రికను ఇచ్చాను. ఆ తర్వాత మోదీ నుంచి ఆశీస్సులు తెలుపుతూ లేఖ వచ్చింది. లేఖను చూసిన వెంటనే తాము ఎంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యాము అని కేవత్ తెలిపాడు. అయితే కేవత్ గంగా నది భక్తుడు. తనకు వచ్చిన ఆదాయంలో కొంత గంగా ప్రక్షాళన కోసం ఖర్చు పెట్టడం విశేషం. ఇక కేవత్ నివాసముంటున్న డోమ్రి గ్రామాన్ని నరేంద్ర మోదీ దత్తత తీసుకున్నారు. -
వైరల్ వీడియో ఎఫెక్ట్.. ఖాకీ అవుట్
లక్నో: కనీసం వృద్ధుడనే విచక్షణ కూడా లేకుండా రిక్షా కార్మికుణ్ని చితకబాదిన రైల్వే పోలీసుపై వేటు పడింది. లక్నో(యూపీ)లోని చార్బాగ్ ప్రాంతంలో ఓ రిక్షావాలాపై పోలీసు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఖాకీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దాష్టీకానికి దిగిన పోలీసు తీరును నెటిజన్లు తీవ్రస్థాయి ఖండిచారు. అసలేం జరిగిందంటే..: లక్నో నగరంలోని రెండు అతి పెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటి చార్బాగ్ స్టేషన్. నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణికులు వచ్చిపోతుంటారిక్కడ. రద్దీ దృష్యా స్టేషన్ బయట ఆటోలు, రిక్షాలు నిలపరాదంటూ రైల్వే పోలీసులు ఇటీవలే హుకుం జారీచేశారు. శుక్రవారం స్టేషన్ ముందు ప్రయాణికులను రిక్షాలో ఎక్కించుకునే ప్రత్నంచేసిన రిక్షావాలను విశ్వజిత్ సింగ్ అడ్డుకున్నాడు. అంతటితో ఆగకుండా ’స్టేషన్ ముందు రిక్షా నిలుపుతావట్రా..’ అంటూ చితకబాదాడు. తన్నుకుంటూ ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేశాడు. అక్కడే ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ అమర్ సింగ్ కూడా వృద్ధ రిక్షావాలపై చేయిచేసుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. దీంతో కానిస్టేబుల్ విశ్వజిత్, ఎస్‌హెచ్‌వో అమర్ సింగ్ లను సస్సెండ్ చేస్తూ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు.