లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో శివ
పెనమలూరు : చిత్రకారుడు పామర్తి శివ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఆయన గతంలో 11 అడుగుల వెడల్పు, తొమ్మిది అడుగుల ఎత్తుతో పురికొసతో 3 గంటల్లో ఏకధాటిగా బుద్ధుడి బొమ్మను వేశాడు. ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో నమోదైంది. ఈ మేరకు మంగళవారం లిమ్కా బుక్ ప్రతినిధి విజయ్ఘోష్ రికార్డు పత్రాన్ని పంపారని శివ తెలిపారు. తనకు ఇప్పటివరకు 36 రికార్డులు వివిధ అంశాల్లో వచ్చాయన్నారు. తనను ప్రభుత్వం కానీ, దాతలుగానీ ప్రోత్సహిస్తే మరిన్ని రికార్డులు సాధిస్తానని తెలిపారు. తాను శివ ఆర్ట్సు పేరుతో సొసైటీ ఏర్పాటు చేసి పలువురు విద్యార్థులకు చిత్రలేఖనంపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.