rights leaders
-
జాతి వివక్ష పోరాట యోధుడు అస్తమయం
జొహన్నెస్‌బర్గ్/న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం సాగించిన హక్కుల నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు(90) అస్తమించారు. ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు ఆదివారం వేకువజామున కేప్‌టౌన్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రకటించారు. గతంలో క్షయవ్యాధికి గురైన డెస్మండ్ టుటు, ప్రొస్టేట్ కేన్సర్ బారినపడి 1997లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం పలు అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. బ్రిటిషర్ల హయాంలో నల్లజాతి ప్రజల హక్కుల కోసం, అన్యాయాలకు గురైన వారి తరఫున డెస్మండ్ టుటు తీవ్రంగా పోరాడారు. నల్ల జాతీయుల పాలన మొదలైన తర్వాత కూడా అన్యాయాలను, అక్రమాలను ఖండించడంలో ఆయన వెనుకాడలేదు. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో కొనసాగుతూనే పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ సంస్థలను కొల్లగొడుతున్న తీరుపై గళమెత్తారు. ఆర్చ్‌బిషప్ టుటు మృతిపై భారత ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆర్చి బిషప్ టుటును ‘ఆఫ్రికా పీస్ బిషప్’గా నోబెల్ ఇన్స్టిట్యూట్ అభివర్ణించింది. దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలపై బ్రిటిషర్లు దారుణాలకు పాల్పడినప్పటికీ బిషప్ టుటు మాత్రం అహింసాయుత విధానాలకే కట్టుబడి ఉన్నారని కొనియాడింది. మండేలాతో విడదీయరాని మైత్రి మొదట జొహన్నెస్‌బర్గ్ ఆర్చ్‌బిషప్‌గా ఉన్న టుటు తర్వాత కేప్‌టౌన్ బిషప్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవులు నిర్వహిస్తూనే స్థానిక నల్లజాతి వారిపై శ్వేత జాతీయుల దురాగతాలను ఖండించడంలో వెనుకాడలేదు. జొహన్నెస్‌బర్గ్ ఆర్చ్‌బిషప్‌గా కొనసాగుతున్న సమయంలోనే 1984లో ఆయన్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. బ్రిటిషర్ల హయాంలో జాతి వివక్షకు గురైన వారికి న్యాయం చేసే లక్ష్యంతో 1995లో టుటు నేతృత్వంలో ‘ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్’ను మండేలా నియమించారు. టుటు, మండేలా మధ్య అనుబంధాన్ని వివరిస్తూ మండేలా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘1950లలో పాఠశాలలో చదువుకునే రోజుల్లో జరిగిన వక్తృత్వ పోటీల సమయంలో మండేలా, టుటు తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరూ జాతి వివక్షపై ప్రజల తరఫున పోరాటం సాగించారు. ఇది నచ్చని బ్రిటిషర్లు వారిద్దరూ కలుసుకోకుండా దాదాపు 4 దశాబ్దాలపాటు పలు అవాంతరాలు కల్పించారు. చివరికి మండేలా 27 ఏళ్లపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యాకే టుటుతో నేరుగా మాట్లాడగలిగారు. చెరసాల నుంచి విడుదలైన మండేలా మొదటగా వెళ్లి ఆ రోజు గడిపింది టుటు నివాసంలోనే’అని తెలిపింది. మండేలా 2013లో తుదిశ్వాస విడిచే వరకు టుటుతో అనునిత్యం మాట్లాడుకుంటూనే ఉన్నారంటూ వారి మధ్య ఉన్న గాఢమైత్రిని గుర్తు చేసింది. -
‘కోర్టు’లోని అంశంపై మీరెలా మాట్లాడతారు?
ముంబై: మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ హక్కుల నేతలను అరెస్టు చేసిన పోలీసులు మీడియా సమావేశంలో ఆధారాలను ఎలా బహిర్గతం చేస్తారంటూ బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ)కు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. ఈ కేసులో పుణె పోలీసుల దర్యాప్తు దురుద్దేశపూరితమనీ, వారిని విచారణ బాధ్యతల నుంచి తప్పించాలని పిటిషనర్ కోరారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో హక్కుల కార్యకర్తలు, లాయర్లు, కవులు, రచయితలు, మేథావులు ఉన్నారని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద వీరిని అరెస్టు చేసినప్పుడు, దర్యాప్తును ఎన్ఐకు అప్పగించడం సముచితమని తెలిపారు. స్పందించిన న్యాయస్థానం..‘ఈ అంశం కోర్టు విచారణలో ఉండగా పోలీసులు ప్రెస్‌మీట్ ఎలా పెడతారు? ప్రస్తుతం విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఇలాంటి కేసులకు సంబంధించిన ఆధారాలను బహిర్గతం చేయడం తప్పు’ అని పేర్కొంది. రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్(శాంతిభద్రతలు) పరమ్‌వీర్ సింగ్, పుణె పోలీసు అధికారులతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో హక్కుల నేతలు రాసినట్లుగా చెబుతున్న ఉత్తరాలను చదివి వినిపించిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలను కూల్చేది ప్రజలే: శివసేన హక్కుల నేతలను అరెస్టు చేయటాన్ని తెలివితక్కువ పనిగా శివసేన అభివర్ణించింది. ప్రధాని మోదీ భద్రతకు మావోల నుంచి ముప్పు ఉందన్న పోలీసుల వాదన కుట్రసిద్ధాంతమని తన సామ్నా పత్రిక సంపాదకీయంలో శివసేన పేర్కొంది. మోదీకి అత్యున్నత స్థాయి భద్రత ఉందని ఆరోపణలు చేసే ముందు పోలీసులు సంయమనం పాటించకుంటే కేంద్రం, బీజేపీ నవ్వులపాలు కాకతప్పదని తెలిపింది. ‘యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దించింది ప్రజలే. మావోలు, నక్సలైట్లు కాదు. అధికారం ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మారుతోంది. ప్రభుత్వాలను మార్చే శక్తే మావోయిస్టులకు ఉంటే పశ్చిమబెంగాల్, త్రిపుర, మణిపూర్‌లో వామపక్షాలు అధికారం కోల్పోయేవి కావు’ అని వ్యాఖ్యానించింది. -
పోలీసులకు శిక్ష తప్పదు..
హైదరాబాద్: శేషాచల ఎన్కౌంటర్ వివాదం మరింత రాజుకుంటోంది. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై హత్యకేసు నమోదు చేయాలనే డిమాండ్ మరింత ఊపందుకుంది. హైకోర్టు సూచనమేరకు పౌరహక్కుల నేతలు, ఎన్కౌంటర్ మృతుల బంధువులు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. తమ వాళ్ళను అతికిరాతకంగా చంపిన వాళ్లను శిక్షించాలని మృతుల రక్తసంబంధీకులు కోరుతున్నారు. బాధితుల తరపున బంధువులు, గ్రామస్తులు, పౌరహక్కుల సంఘం నాయకులు స్టేషన్ కు చేరుకుని పోలీసులపై హత్యానేరం ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. దీంతో పాటు మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆదరాబాదరాగా జరిగిన మొదటి పోస్ట్‌మార్టంలో అన్ని గాయాలను నోట్ చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా 20 మంది కూలీలను హత్య చేసిన పోలీసులకు శిక్ష తప్పదని హక్కుల సంఘాల నేతలంటున్నారు. -
పోలీసులకు శిక్ష తప్పదు..