లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభంలో స్వల్ప లాభాలకు పరిమితమై, ఒడిదుడుకులకు లోనైనప్పటికీ చివరికి లాభాల్లో స్థిరంగా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 183 పాయింట్లు జంప్‌చేసి 26,698 వద్ద , 51 పాయింట్లు ఎగసి నిఫ్టీ 8,222 వద్ద ముగిశాయి.. ముఖ్యంగా మిడ్‌సెషన్ నుంచీ పెరిగిన కొనుగోళ్లతో ప్రధాన ఇండెక్సులు జోరందుకుని లాభాలను ఆర్జించాయి. ప్రధానంగా ఆటో, ఐటీ , ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ లాభాలు మార్కెట్ నుప్రభావితం చేశాయి.
ఫెడరల్ రిజర్వ్ పాలసీ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. దీంతో దేశీయంగానూ సెంటిమెంటు మెరుగుపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల్లో మీడియా, మెటల్, రియల్టీ నష్టాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, బీపీసీఎల్, విప్రో, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఐడియా, టాటా పవర్, బీవోబీ లాభపడగా అల్ట్రాటెక్, హిందాల్కో, జీ, భెల్, గ్రాసిమ్, గెయిల్, అంబుజా, లుపిన్, టాటా స్టీల్, ఏసీసీ నష్టపోయాయి.
అటు డాలర్ మారకంలో రూపాయి 0.07 పైసల నష్టంతో రూ.67.49 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి రూ. 141నష్టంతో రూ. 27,521 వద్ద బలహీనంగా ముగిసింది.