'రిషితేశ్వరి కేసును మరుగున పడేసేందుకు కుట్ర'
గుంటూరు : రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ మేరుగ నాగార్జున, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ హెచ్చరించారు. శనివారం వారు నాగార్జున యూనివర్సిటీని సందర్శించారు.
ఈ సందర్భంగా మేరు నాగార్జున మాట్లాడుతూ.. రిషితేశ్వరి కేసును మరుగున పడేసేందుకే యూనివర్సిటీకి 10 రోజులు శెలవులు ప్రకటించారన్నారు. విద్యార్థులు అందోళన చేస్తే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌తోనే సరిపెట్టారని ఆయన అన్నారు. ఆత్మహత్య కారకులందరిపై కేసు నమోదు చేసి శిక్షించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.