సూర్యోదయం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రా అసోసియేషన్ ఢిల్లీ ఎన్నికల్లో ఉదయించే సూర్యుడి గుర్తుతో పోటీకి దిగిన ఆర్ మణినాయుడు స్పష్టమైన ఆధిక్యత చాటారు. ఆద్యంతం నువ్వా నేనా అన్నట్టు కొనసాగిన ఈ పోటీలో కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిని 82 ఓట్ల తేడాతో ‘సింహం’గుర్తు ప్యానల్ తరఫున బరిలోకి దిగిన కోటగిరి సత్యనారాయణ దక్కించుకున్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదువరకు లోధీ ఎస్టేట్‌లోని డీటీఈఏ సీనియర్ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం 4,139 మంది తెలుగువారు ఓటుహక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదుగంటలకు ఓటింగ్ ముగిసింది. అనంతరం రాత్రి ప్రారంభమైన కౌంటింగ్ క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ కొనసాగింది. రాత్రి 12-30 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది.
తుది ఫలితాలను ఒంటిగంటకు ఎన్నికల పర్యవేక్షణ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్ష పదవికి ‘సింహం’గుర్తుపై పోటీకి దిగిన ప్యానల్ అభ్యర్థి మట్టా పశుపతిపై ఉదయించే సూర్యుడి ప్యానల్‌కి చెందిన ఆర్ మణినాయుడు 107 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా ఉదయించే సూర్యుడి గుర్తు ప్యానల్ నుంచి పోటీకి దిగిన ఎన్ఈవీఎన్ చంద్రశేఖర్‌రావును కోట గిరి సత్యనారాయణ 82 ఓట్ల తేడాతో ఓడించారు. మిగిలిన స్థానాల్లోనూ ఉదయించే సూర్యుడి వెలుగులు కనిపించాయి. ఉపాధ్యక్షుడిగా ఉదయించే సూర్యుడి ప్యానల్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులు గెలుపొందగా, సింహం ప్యానల్ నుంచి ఒకే ఒక్క అభ్యర్థి విజయం సాధించాడు.
రెండు సంయుక్త కార్యదర్శి పదవులను రైజింగ్‌సన్ అభ్యర్థులే గెలుచుకున్నారు. కీలకమైన కోశాధికారి పదవిని సైతం రైజింగ్‌సన్ తన ఖాతాలో వేసుకుంది. అత్యంత పోటీ నెలకొన్న ఈ స్థానాన్ని 10 ఓట్ల తేడాతో రైజింగ్‌సన్ ప్యానల్‌కు చెందిన అభ్యర్థి మంచిరాజు లహరి కైవసం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లలోనూ నాలుగు స్థానాలు ఉదయించే సూర్యుడి ప్యానల్ గెలుచుకోగా, రెండు సింహంగుర్తు ప్యానల్‌కు దక్కాయి. ఇక ట్రస్టీల్లో రెండు ప్యానళ్లు రెండేసి చొప్పున గెలుచుకున్నాయి. ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉదయించే సూర్యుడి గుర్తు ప్యానల్‌కి చెందిన యాదవరావు, సింహం గుర్తు ప్యానల్‌కి చెం దిన రాంకుమార్‌కు సమాన ఓట్లు రావడంతో మొద ట టై అయింది. ఆ తర్వాత టెండెడ్ ఓట్లు రెండు కలవడంతో ఉదయించే సూర్యుడి ప్యానల్‌కి చెంది న యాదవరావు గెలుపొందినట్టు ప్రకటించారు.
అధ్యక్షుడు: ఆర్. మణినాయుడు
ప్యానల్: ఉదయించే సూర్యుడు
జనరల్ సెక్రటరీ: కోటగిరి సత్యనారాయణప్యానల్: సింహం
ఉపాధ్యక్షుడు:
పేరు ప్యానెల్
కె.వి. రాం గణేశ్ ఉదయించే సూర్యడు
నజీర్‌జాన్ ఉదయించే సూర్యుడు
కోటిరెడ్డి ఉదయించే సూర్యుడు
ఎన్‌వీఎల్‌ఎన్ నాగరాజు సింహం
జాయింట్ సెక్రటరీలు:
సూరి సత్యవతిరావు ఉదయించే సూర్యుడు
బీవీవీకె రావు ఉదయించే సూర్యుడు
ట్రెజరర్
మంచిరాజు లహరి ఉదయించే సూర్యుడు
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు:
బి.లోకనాథం ఉదయించే సూర్యుడు
ఎం.యాదవరావు ఉదయించే సూర్యుడు
పి. పరమేశ్వరరావు ఉదయించే సూర్యుడు
మద్దిల ఢిల్లీరావు ఉదయించే సూర్యుడు
మల్లాది వెంకటేశ్వరరావు సింహం
జీవీ రెడ్డి సింహం
ట్రస్టీలు:
మల్లాది రవిశంకర్ ఉదయించే సూర్యుడు
డా. కేజీ రావు ఉదయించే సూర్యుడు
కృష్ణమోహన్ సింహం
ఎం వెంకటేశ్వర్లు సింహం
స్థానాల వారీగా గెలుపొందిన అభ్యర్థులు: