జెనీలియాకు కొడుకు పుట్టాడు
ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్లో కూడా బాగా పరిచయమైన హాసిని.. అదే జెనీలియాకు కొడుకు పుట్టాడు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన జెనీలియా ఇటీవలే నెలలు నిండిన తర్వాత కూడా ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మంగళవారం నాడు ఈ దంపతులకు కొడుకు పుట్టాడు. వెంటనే రితేష్ దేశ్‌ముఖ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రపంచానికి చాటాడు. తనకు కొడుకు పుట్టినందుకు రితేష్ తెగ ఆనందపడిపోయాడు. బ్బోయ్య్.... అంటూ చాలా గట్టిగా ఒత్తి మరీ చెప్పాడు. 2003 నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట 2012లో పెళ్లి చేసుకుంది.
It's a BBBOOOOYYYYYY!!!!!!!!
— Riteish Deshmukh (@Riteishd) November 25, 2014