డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాల కోసం నిరీక్షణ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరి«ధిలోని బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ రీవాల్యుయేషన్ ఫలితాల కోసం విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 12న ఆయా డిగ్రీ కోర్సుల వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల చేశారు.
జూన్ 13 నుంచి 15 రోజులపాటు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు స్వీకరించారు. సుమారు 14 వేల మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 40 రోజులు గడిచినా ఇంకా ఫలితాలు ఇవ్వలేదు. రీవాల్యుయేషన్ కోసం వచ్చిన దరఖాస్తులతో ఆయా విద్యార్థులు ఏ సబ్జెక్టు పేపర్‌కు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు చేశారో ఆయా సబ్జెక్టుల జవాబు పత్రాలను మళ్లీ ఇతర యూనివర్సిటీల అధ్యాపకులతో రీవాల్యుయేషన్ చేయించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకా పదిరోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుందని భావిస్తున్నారు. పది రోజుల తర్వాత పరీక్షల విభాగం అ«ధికారులు ఫలితాలను వెల్లడించే అవకాశాలున్నాయి. ఎంతమంది విద్యార్థులకు బెనిఫిట్స్ జరుగుతుందో వేచి చూడాల్సిందే.