మా అబ్బాయిని మీరు చూశారా?
హ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన జెనీలియా డిసౌజా ఇటీవలే తల్లి అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న జెనీలియా.. గుమ్మడిపండు లాంటి అబ్బాయికి జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చుక్కల చుక్కల చొక్కా వేసుకున్న తన కొడుకు పొటోను జెనీలియా స్వయంగా ట్విట్టర్లో షేర్ చేసింది.
రియాన్ రితేష్ దేశ్‌ముఖ్ అనే పేరు పెట్టిన ఈ చిన్నారితో జెనీలియా తీయించుకున్న ఫొటో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రస్తుతం శరవేగంగా వ్యాపిస్తోంది. బాలీవుడ్లోనే అందమైన జంటగా పేరొందిన జెనీలియా, రితేష్ 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు పదేళ్ల పాటు వారి ప్రేమాయణం సాగింది. ఆ తర్వాతే మూడు ముళ్లు పడ్డాయి.