గాంధీ ఆస్పత్రి ఆర్ఎంవో సరస్వతిపై వేటు
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రి ఆర్ఎంవో సరస్వతిపై వేటు పడింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆమెను డీఎంఈకి సరెండర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. బుధవారం ఆయన గాంధీ ఆస్పత్రిని సందర్శించి, రెండు గంటలపాటు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులతో సమావేశమయ్యారు. విధులను నిర్లక్ష్యం చేయటంతోపాటు ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోనట్లుగా తేలిన ఆర్ఎంవో, డిప్యూటీ సివిల్ సర్జన్ సరస్వతిని డీఎంఈకి సరెండర్ చేయాలని ఆదేశించారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. రోగుల విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తే సహించేది లేదని, అలాగే విధుల్లో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడివారు ఎంతటివారినైనా ఉపేక్షించేది లేనది లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేసినందుకు సరస్వతిపై వేటు పడినట్లు సమాచారం. ఇటీవలి గాంధీ ఆస్పత్రిలో వీల్ చైర్స్ కొరత, సాయి ప్రవళిక మృతి తదితర అంశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.