డాల్ఫిన్లు ఆడుకోవడానికి టచ్‌ప్యాడ్!
వాషింగ్టన్: డాల్ఫిన్లు ఆడుకోవడానికి అమెరికా శాస్త్రవేత్తలు నీటి అడుగుభాగంలో ఏర్పాటు చేయడానికి 8 అడుగుల కంప్యూటర్ టచ్‌ప్యాడ్‌ను తయారు చేశారు. హంటర్ కాలేజ్, రాక్ఫెల్లర్ యూనివర్సిటీ వారు దీన్ని రూపొందించారు.
వీటి ద్వారా డాల్ఫిన్ల తెలివితేటలను, భావ ప్రసార నైపుణ్యాలను తెలుసుకోవచ్చని భావిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా డాల్ఫిన్ల కోసమే తయారుచేసిన యాప్‌లు ఉంటాయి. ఇప్పటికే ఇందులో ఉన్న యాప్స్‌కు సంబంధించి డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. దీనికి వారు కీబోర్డును కూడా తయారుచేశారు.