మెగా లైట్నింగ్
షేక్ చేసే రాకింగ్ మ్యూజిక్.. దద్దరిల్లే హైవాట్స్ సౌండ్.. ఎనర్జిటిక్ బీట్స్‌కు మనసు పారేసుకోని కుర్రాళ్లెవరుంటారు. క్లబ్ అయినా.. పబ్ అయినా.. వేదిక వేరేదైనా.. మస్తీ బీట్ వినిపిస్తే చాలు.. అక్కడ వాలిపోతారు. వారి హ్యాపీనెస్‌ను టాప్అప్ చేస్తూ.. మస్తీకి మరింత టచప్ ఇస్తూ.. ఫ్లోర్ అదిరేలా స్టెప్పులేయించి.. మెరిపించి.. మైమరిపించడానికి నగరానికి వస్తున్నారు ఫేమస్ సంగీత ద్వయం ‘మిడివాల్ పండిడ్జ్’. తమ లేటెస్ట్ ఆల్బమ్ ‘లైట్’ లాంచ్ టూర్లో భాగంగా దేశంలోని మెట్రో నగరాల్లో ప్రదర్శనలిస్తున్నారు.
హైదరాబాద్ యూత్ పల్స్‌ను క్యాచ్ చేసి.. మెగా బీట్స్‌ను ఇంజక్ట్ చేసేందుకు ఫిక్సయ్యారు. ఈ రాకింగ్ ద్వయం అందించే జానీవాకర్ ‘స్టెప్అప్’ శనివారం సిటీని ఊపేయడానికి సిద్ధంగా ఉంది.
ఎవరీ పండిడ్జ్!
ఢిల్లీకి చెందిన మ్యుజీషియన్స్ గౌరవ్ రైనా, తపన్ రాజ్ కలసి ఏర్పాటు చేసిన ఫ్యూజన్ గ్రూపే ‘మిడివాల్ పండిడ్జ్’. ఉత్తర భారత దేశ సంప్రదాయ సంగీతానికి పాశ్చాత్య హంగులద్ది కంపోజ్ చేస్తున్న వీరి ఆల్బమ్స్‌కు దేశవ్యాప్తంగా మాంచి క్రేజ్. ధోల్, తంబి, సరోద్, సంతూర్, ఢోలక్, తబలా, తంబురా, సితార్, సారంగి వంటి భారతీయ సంప్రదాయ వాయిద్యాలు వీరి పాటల్లో ఎక్కువగా వినిపిస్తాయి.
అదే సమయంలో వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎఫెక్టివ్‌గా ఉపయోగించి నేటి తరాన్ని ఆకట్టుకోవడంలో వీరు సిద్ధహస్తులు. ఇప్పటి వరకు వీరు రిలీజ్ చేసిన ‘మిడివాల్ పండిడ్జ్, లెట్స్ ఎంజాయ్, మిడివాల్ టైమ్స్, మిడివాల్ పండిడ్జ్ రీమిక్స్, హలో హలో’ ఆల్బమ్స్ విశేష ఆదరణ పొందాయి. సిటీలో ఇవ్వనున్న ప్రదర్శనలో స్టెప్అప్ చాలెంజ్ విన్నర్ విరాజ్ మోహన్‌తో కలిసి సంగీత లహరిని అందిస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫెంటాస్టిక్ లైవ్ మ్యూజిక్ ను ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి..!
వేదిక: ఎయిర్ కేఫ్ లాంజ్, సాయివాసవి టవర్స్, 6వ అంతస్తు, రోడ్ నంబర్ 36, జూబ్లీహిల్స్
సమయం: ఈ నెల 18 రాత్రి 9 గంటలకు