రోహన్ డబుల్ సెంచరీ మిస్
► గుజరాతీ, ఎవర్గ్రీన్ మ్యాచ్ డ్రా
► ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్
హైదరాబాద్: ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో గుజరాతీ, ఎవర్గ్రీన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆటలో ఎవర్గ్రీన్ బ్యాట్స్‌మన్ రోహన్ యాదవ్ (261 బంతుల్లో 199; 25 ఫోర్లు) పరుగు తేడాతో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. గురువారం మ్యాచ్ నిలిచే సమయానికి ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్‌లో 118 ఓవర్లలో 478 పరుగులు చేసి ఆలౌటైంది. అజ్మత్ ఖాన్ (87), జితేందర్ త్యాగి (43) రాణించారు. గుజరాతీ బౌలర్ ప్రణీత్ రెడ్డికి 4 వికెట్లు దక్కాయి. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాతీ జట్టు 519/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. గుజరాతీ జట్టుకు 41 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. మొత్తానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో గుజరాతీ ఖాతాలో 10 పాయింట్లు, ఎవర్గ్రీన్ ఖాతాలో 5 పాయింట్లు చేరాయి.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 227 (సయ్యద్ అహ్మద్ 5/47), కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 341, ఎంపీ కోల్ట్స్ రెండో ఇన్నింగ్స్: 219 (సయ్యద్ అహ్మద్ 3/13), కేంబ్రిడ్జ్ రెండో ఇన్నింగ్స్: 120/2 (తనయ్ త్యాగరాజన్ 38, విక్రాంత్ 48 నాటౌట్).
ఎస్సీ రైల్వే తొలి ఇన్నింగ్స్: 137, కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 63, రైల్వే రెండో ఇన్నింగ్స్: 141 (వంశీకృష్ణ 79; లలిత్ మోహన్ 5/45), కాంటినెంటల్ రెండో ఇన్నింగ్స్: 93 (బాషా 6/30, సుధాకర్ 3/29).
గౌడ్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 273, జెమినీ ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 357 (అబ్దుల్ ఖురేషీ 75; అనిరుధ్ శ్రీవాస్తవ్ 6/87, రిషబ్ శర్మ 3/71), గౌడ్స్ రెండో ఇన్నింగ్స్: 160 (బిక్షపతి 46; సతీశ్ 3/28, సంకేత్ 3/51). జెమినీ ఫ్రెండ్స్ రెండో ఇన్నింగ్స్: 79/2.
రెండో రోజు: స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 349 (చిరాగ్ పాఠక్ 96, మాన్సింగ్ రమేశ్ 73), ఆర్.దయానంద్ తొలి ఇన్నింగ్స్: 244/4 (భగత్ వర్మ 53 బ్యాటింగ్, కుశాల్ పర్వేజ్ జిల్లా 84 బ్యాటింగ్).